అంశం - రైలు ప్రయాణం
తేదీ - 23-07-2019
శీర్షిక - ఆమ్ ఆద్మీల పయనసాధనం
సంఖ్య - 243
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
కలకత్తా నుండి వోకా వరకు
అల్లంత దూరాలు అలవోకగా సాగే
సగటు మనుషుల సరదా ప్రయాణాల మజిలీ ....
ఐదారు తరాల తీపి గుర్తుల ప్రతీకగా
వంద దెబ్బయేండ్ల జీవిత కాలంతో ...
స్వాతంత్య్ర సమర ఘట్టాలు మూటగట్టుకుని
దశవిధ అనుబంధ పరిశ్రమల పెనవేసుకున్నది ...
పిల్లల మర్రి మహా మానులా విస్తరించి
పదునెనిమిది జోనులతో ఫరిఢవిల్లుతూ...
జన సాంద్రత కలిగిన అగ్ర దేశమోలే
పదమూడు వందల పది మిలియన్ల ఉద్యోగులతో ...
ఆత్మీయంగా పల్లెను పట్టణాన్ని పలుకరిస్తూ
ప్రజావసరాలు తీర్చే ప్రేమ నిండిన పెద్దన్న పాత్ర....
ఏయాత్రకైనా తీర్థానికైనా పుణ్యక్షేత్రానికైనా
ఊరూరు ముచ్చట్లతో హుషారు గొల్పు ఊసులు....
పల్లెను బోలు ప్రజా సముదాయం రోజుల కొద్దీ
ఆత్మీయతలు అనుబంధాల తంత్రులే ....
డాబు దర్పం డబ్బు అధికారం తొణకిసలాడ
వాతానుకూలీన ఉన్నత వాయు ప్రయాణ సమం....
వ్యవసాయ పారిశ్రామిక తినుభండారాల ...
వివిధ సామాన్లు చేరవేయ వివేకమైన రవాణా ....
అప్పుడప్పుడు దొర్లే అచ్చు తప్పులోలె
అడపాదడపా ఆకతాయిల ముసుగు వేషాలు
అక్కడో ఇక్కడో జరిగే అనర్థాల పట్టాలు తప్ప
అసలు సిసలైన ఆమ్ ఆద్మీల అతి చవక పయనసాధనం .... .. .. .. నగునూరి రాజన్న