చిత్ర కవిత. ( అంకురం)
తేది: 07-07-2024
శీర్షిక : ఆనవాలు
రోహిణమ్మ కార్తె వరకు భీష్మించిన గ్రీష్మం
ముగియగనే…తొలకరితో పులకరించు
అవనిమాత…దరహాసంతో మురిసిన
హాలికుడు దక్కిదున్ని ఇరువాలుతో నేల
విడుచు విత్తనాలను మురిపంతో….
జంకు వదిలిన విత్తనాలు మట్టిపొరలలో
తేమతో జట్టుకట్టి బొంకులేక అంకురమై
హరిత తొనలు సంతరించుకుని… ఆదివారం
నాడు అరటి మొలిచినదిలా గానమెత్తుకుంటుంది…
అంకురం మారాకులేయాలి
మారాకులు మహావృక్షమవ్వాలి ....
లోకకళ్యాణాల పచ్చని తరువై
పురోగమనాల పుణ్యకాలమై పోవాలి ...
పచ్చదనం పొదువుకుని పంటచేలుగా
మారిపోయి…పాడి పంటల సమృద్దితో
జీవానికి ప్రాణమై ఊపిరిగా నిలిచి…జీవరాశికి
ఊతమై…విశ్వం వినోదభరితమై ఫరిడవిల్లుతుంది….
ముత్యమంత విత్తు మురిసిపోవు..
మారాకులతో పచ్చ తోరణమై వర్షఋతువులో
పుచ్చపూల వనముగ మారి….మానవ
కళ్యాణాలకు దారి….అంకురమే ఆనవాలు…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment