Saturday, July 27, 2024

పై పై మెరుగులు తేది: 04-07-2024 శీర్షిక : మేడిపండు మెరుపులు

 పై పై మెరుగులు 

తేది: 04-07-2024
శీర్షిక : మేడిపండు మెరుపులు 

కలికాలమో .. కల్తీ కాలమో 
నిలువెల్లా విషకాలుష్యమే ... 
ఊడలూడిన మర్రిచెట్టులా 
మమతలేని మనిషిగా నేడు .... 

మనిషి ఎదురైతే మమతలు 
ఒలకబోస్తూ ... మనిషి మరుగైతే 
కలుషితాల మాటలతో 
కబాడీ ఆడేసుకుంటారు .... 

విభజన వ్యక్తిత్వాలతో 
విపరీత పాత్రలు పోషిస్తూ 
తమ పర భేదమెరుగక 
అందెవేసిన వ్యవహారాలే .... 

అవలోకనం చేసుకుంటే 
మనమే తప్పేమో అన్నంత 
పాత్రల్లో మునిగిపోయి 
పటాటోపాలు చూపిస్తారు .... 

పైపై మెరుగులతో పసిడి 
ఛాయలు చూపిస్తూ ... అసలే 
నకిలీలేమో అన్నంత నమ్మకంగా 
మేడిపండు మెరుగుల మెరుపులు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment