Friday, July 26, 2024

కవన రవళి 05-12-23 నానీలు

 కవన రవళి 05-12-23 నానీలు 


 1. ఆత్మీయతల
 పరిమళాలతో 
అల్లుకునేదే 
మానవత్వం…

 2. స్వార్థాలను 
 చంకదించడమే 
మానవత్వానికి 
 మచ్చుతునక… 

 3. మానవత్వాలను
 మంటగలపడమే 
కులమతాల
కుత్సితం…

 4. కల్తీ కాలుష్యాలో? 
కాలమానమో ? 
మానవత్వాల 
మరుగు మూలం …

 5. దైవాన్వేషణ 
 సఫలమే… 
 సాటివారిని 
 సన్నుతించిన… 

 6. రాయి రప్పకు
 మొక్కనేల? 
సాటిమనుషుల
 దూషిస్తూ… 

 7. సాధుత్వం 
 సోదరత్వం 
 మానవత్వపు 
మణి శిఖరం…

 8. దాపునిల్వవా
 మానవత్వాలు 
దరిచేరితే 
పరిపక్వతలు … 

 9. గాలి నీరుల 
 గమ్మత్తు… 
 గడబిడలేని 
మానవత్వాలు… 

 10. మానవత్వం
 మరుగులేని కిరణం 
మనిషి పోయినా
 వెలుగులీనేది …..

నగునూరి రాజన్న కరినగరము.

No comments:

Post a Comment