Friday, July 26, 2024

కవన రవళి ఏరువాక గీతాలు తేది: 11-06-2024.

 కవన రవళి  

ఏరువాక గీతాలు 
తేది: 11-06-2024. 

ఏటేటా వస్తుంది 
ఏరువాక పున్నమి...
రైతన్నకు పండగ   
ఎవుసానికి మూర్తమై ... 

లెక్కలన్నీ జరిగినా 
పక్కాగా వర్షించగ  .... 
జ్యేష్టమాస పౌర్ణమిన 
దుక్కి దున్ను రైతన్న... 

ముందు వెనకలైతేను
సంధికొట్టు పంటలని 
శాస్త్రీయత జోడించే 
సమున్నత ఆచారమై ...  

ఏటేటా వస్తుంది 
ఏరువాక పున్నమి...

అత్యుత్సాహాలను 
అటకెక్కించుతూ   
అలసత్వాలను  
అవలకునెట్టేసి .... 

కలిసికట్టుగైతేనే 
కలిమి బలం చేకూరనీ  
పరాగ సంపర్కములు 
ఫలితం అందించునని .... 

ఏటేటా వస్తుంది 
ఏరువాక పున్నమి...

క్రమశిక్షణ కవాతుగా 
పంటరక్షణ అనుకూలమై 
ఫలదీకరణలకు సాయమై 
పయనించే కేంద్రబిందువు ... 

పనిముట్లకు పూజలు 
పశువులకు పొంగలి 
పండగనే రైతింట 
పర్వములే దేశమంతా .... 
 
ఏటేటా వస్తుంది 
ఏరువాక పున్నమి...
రైతన్నకు పండగ   
ఎవుసానికి మూర్తమై ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment