Saturday, July 27, 2024

చైతన్య గేయం June 2024

 చైతన్య గేయం

నాది నాదంటూ మురిసేవు 
నరుడా ఓ పామరుడా ....  
ఏమేమి తెచ్చావు వచ్చునపుడు 
ఏదిరా నీది ఎక్కడుందిరా  
ఉత్త చేతులతోనే 
ఊపుతూ వచ్చావు నీవు 
ఉత్త చేతులతోనే  
వెళ్లి పోతావు నీవు .... 

అవనిపైన నీ 
ఆరళ్ళ జోరేమిరా  ?
చెట్టు నాదంటావు 
గుట్ట నాదంటావు 
మట్టి నాదంటావు 

ధరణి పైనా నీ
దర్పమేందిరా  
పేను లాంటి నీకు 
పెత్తనమేంటిరా  ?
బండ నాదంటావు 
గుండు నాదంటావు 
ఇసుక నాదంటావు 
చీమకైనా లేని 
చింత ఎందుకురా ? 

అన్నీటినీ అమ్ముకుని 
సొమ్ము మూటా గట్టుకుంటావు 
ఆస్తులు గూడ బెట్టుకుంటావు
తర తరాలకంటూ  
తరగని ఆస్తులంటావు ... 
తలకు మించిన భారాలు చేస్తూ 
తండ్లాటలెందుకురా... 
 ... 
ప్రకృతి పరిమళిస్తేనే 
ఆరడుగుల గోయ్యి 
నీ ఆనవాళ్ళవునురా .... 
ఆవులించిందా 
అడ్రస్సే గల్లంతురా.... 

తెలుసుకుని మసులుకో 
తెలివి మీరా నడుచుకో 
భావితరాలకు నీవు 
తారాగ వెలుగురా .... 


--
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment