Sunday, July 28, 2024

మా ఊరి బస్సు తేది : 18-07-24 శీర్షిక : దైవాధీనం సర్వీసు

 మా ఊరి బస్సు 

తేది : 18-07-24
శీర్షిక : దైవాధీనం సర్వీసు 

 రాజకీయ పలుకుబడుల
నీడెరుగని మా ఊరికి 
 డెబ్భైమూడులోగాని బస్సుకు 
 ముహూర్తం కుదరలేదు... 

 నేను కాలినడకన పన్నెండో తరగతిలో 
ఉన్నప్పుడనుకుంటా ఉస్సూరుమని 
ఓ చిన్న బస్సు దుమ్ములేపుకుంటా
దూసుకొచ్చింది... మా ఊరి వైపు…. 

బస్సు మా ఊరికి వేశారన్నమాటేగాని 
వెట్టిచాకిరి సేవకుడు నిలబడినట్టు 
ఎప్పుడు నిలబడి ప్రయాణమే పక్కూరు 
వాళ్లంతా దిగిపోతేనే మాకు సీట్లు... 

ఎప్పుడెక్కడ ఆగిపోతుందో 
దైవాధీనం సర్వీసు... ఏరోజుకారోజు
హమ్మయ్య అనుకుంటూ ఊపిరి 
పీల్చుకుని ఉస్సూరుమనుకోవడమే ...

ఆటోల కాలమొచ్చినాక…మధ్యలో
గిరాకీలేక గిరికీలు కొట్టి గీరతో వాళ్ళే
బందు పెట్టిండ్రు… మళ్ళీ కొన్నాళ్ళకు
పంపించినారు….నేటికి మా పల్లెకు
పొద్దున్నొకటి సాయంత్రమొకటి అంతే…

ఇంతవరకు బస్సు మొఖం చూడని
పల్లెలెన్నో… పడావుపడి ఉన్నాయి… 
అవినీతి అంతమైతేనే అమృత ఫలాలు
అందరికి అందుతాయనేది జగమెరిగిన
సత్యం… 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment