Saturday, July 27, 2024

కలం గళం - జానపద గేయం తేది 29-06-2024 శీర్షిక : కొండగట్టు అంజన్న

 కలం గళం - జానపద గేయం 

తేది 29-06-2024
శీర్షిక :  కొండగట్టు అంజన్న 

మాట వినర ఓరయ్యో 
ఈ పూట నువ్వు తప్పకుండా ... 
కోరికలు తీరునట 
కొంటెతనం ఏదైనా  ... 

కొండగట్టు అంజన్న 
కోటి వరాలిస్తడంటా ... 
స్వయంభువుగా వెలిసెనంట
సంకటములు  బాపునంటా .... 

కొండంతా  దేవుడు 
కొండగట్టు అంజన్నా .... 
సంజీవము తెస్తుంటే 
జనం కొరకు వెలిసాడు.... 

పవనసుతుడు అంజన్న 
పవిత్రమే  మూర్తిగా .... 
నరసింహుడు తోడైన 
నరులపాలి దేవుడట ... 

దీక్షలను తీసుకుని 
లక్షణంగా పాటిస్తూ ... 
మండలము పూజిస్తే 
గండములు దాటిపోవు... 

పండ్లు పూలు పత్రిలతో 
పూజాలెన్నో చేయాలి .... 
పిల్లాపాప కలిగి మనం 
సల్లంగా  ఉండాలి  .... 

మాట వినర ఓరయ్యో 
ఈ పూట నువ్వు తప్పకుండా ... 
కోరికలు తీరునట 
కొంటెతనం ఏదైనా  ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment