Saturday, July 27, 2024

బాలల గేయాలు తేది : 06-07-2024 శీర్షిక : రమ్యమైన యాత్రలు

 బాలల గేయాలు

తేది : 06-07-2024
శీర్షిక : రమ్యమైన యాత్రలు 

రండి రండి పిల్లలు 
రమ్యమైన యాత్రలకు.... 
అనుభూతులు నింపుకుని  
ఆనందం ఒంపుకుందాం....  

కొత్త కొత్త ప్రదేశాలు 
కొంగ్రొత్త విశేషాలు ... 
మాటలతో సరిపోనివి 
చూపులతో విరబూసేవి .....  

ప్రకృతిలో పదనిసలు 
పసందైన వింతలు .... 
కనులలోన మిలమిలలు 
మనసులోన హాయినిలుపు .... 

రండి రండి పిల్లలు 
రమ్యమైన యాత్రలకు.... 

పాఠమయే  విజ్ఞానాలు 
పనికొచ్చే విహారాలు .... 
అనుభవాల పురాతనం 
ఆధ్యాత్మిక  పుణ్య తీర్థం ... 

శాస్త్రములను నేర్పించే 
పరిశోధనల  వివరాలు...   
సాహసములు బోధించే 
పురాతత్వ ప్రాంతాలు... 

రండి రండి పిల్లలు 
రమ్యమైన యాత్రలకు

పలువిధముల భాషలు 
బహుగొప్పని  ఆచారాలు    ...  
ప్రాంతాలుగా  అలవాట్లు
ప్రయాణాల అనుభవాలు...  
 
కోటలు మ్యూజియములు 
బాటలు బంగళాలు .... 
జంతువుల ప్రదర్శనలు
వింతలతో ప్రపంచం . 

రండి రండి పిల్లలు 
రమ్యమైన యాత్రలకు... 
అనుభూతులు నింపుకుని  
ఆనందం ఒంపుకుందాం....   

నగునూరి రాజన్న 
కరినగరము  ( రిచ్మండ్ ) 

No comments:

Post a Comment