మృగశిర
08-06-2024
శీర్షిక : కార్తె ప్రవేశం.
గ్రీష్మ తాపములకు
ఒకింత నిరోధించి
వర్షకాల సూచనలతో
అవని మాతను మురిపించు....
మలయమారుతములు
పలకరించి సేదదీర్చు ...
ఆకాశం మేఘమాలలతో
అందంగా ఆవరించు ...
కార్తె ప్రవేశముతో
ఉబ్బస వ్యాధి నిర్మూళనలకై
చేపలతో కూడిన
ఆయుర్వేద మందుల జాతర ...
ప్రస్ఫుటమైన మార్పుతో
ప్రకృతి మాత పలకరించు...
జీవరాశి మోములన్నీ
ఆనందాలతో పులకరించు ...
రారాజే రైతన్న
ఏరువాక సాగంగా ....
రమణీయమే శ్రామికులకు
పంటలతో పని దొరకంగా ....
చిరుజల్లులతో
చిత్రంగా కొలనులన్నీ
మెరయుచుంటే
చిరునవ్వులు పూసేను
కర్షకుని మోములో ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment