Saturday, July 27, 2024

అతడు ... ఆమె ...ఓ తీయని జ్ఞాపకం ... తేది 26-06-2024 శీర్షిక : దివ్య జ్ఞాపకం

 అతడు ... ఆమె ...ఓ తీయని జ్ఞాపకం ... 

తేది 26-06-2024
శీర్షిక : దివ్య జ్ఞాపకం 

అతడు ... ఆమెల....బంధం 
ఏడడుగులతో మొదలయి 
మూడు ముళ్ళతో ఒకటైన 
అగ్నిసాక్షిల అనుబంధం .... 

పచ్చని తోరణాల మధ్యన 
అమ్మా నాన్నల దీవెనలతో 
అయినవాళ్ల ఆశీర్వచనాలతో 
మంగళవాద్యాలతో  కూడినది ... 

పేర్లు పేరంటానికెళ్లిపోయి 
ముద్దు పేర్లతో మొదలయి 
మురిపాలను మూటగడుతూ 
సుద్దులెన్నో తిరగబోసుకున్నాయి ... 

రుతువులు కాలాల కబంధ 
హస్తాలలో చిక్కుకుపోయిన 
బాటసారుల్లా లీనమైన 
ప్రేమలతో గానమైన జీవితం ... 

ఎన్నోసార్లు అతడు ఆమెగా 
ఆమె అతడుగా ఏకమై 
దివ్య జ్ఞాపకాల  బంగారు క్షణాలను 
బందీ చేసుకున్న దాఖలాలే .. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment