Friday, July 26, 2024

చిత్ర కవిత 36 తేది : 27-05-2024 శీర్షిక : ఆకాశ వీధి

 చిత్ర కవిత 36

తేది : 27-05-2024
శీర్షిక : ఆకాశ వీధి 
సహస్రాధికం 

రోహిణమ్మ పలకరింపుతో 
నల్ల మబ్బులు కమ్ముకొచ్చి 
తొలకరికి ముహూర్తమైతే 
తొందరపెట్టిన బాల్యం ....  
 
చెంగు చెంగున దూకే 
చెరుకు గడల్లాంటి బాల్యం 
మబ్బుల్లో తొంగి చూసి 
మాయమయ్యే మెరుపులా.... 

కడలి అలలలో కనిపిస్తూ 
కనుమరుగయ్యే నురగలు .... 
కనురెప్పల్లో కదలాడే 
కమనీయ తత్వం .... 

స్వేచ్ఛకు నిర్వచనమై 
అదుపాజ్ఞలకు ఆవల 
ఆటకోయల తనములే 
ఆ వయసుకు ఆభరణములు .... 

అనునిత్యం పాఠ్యపుస్తకాలతో  
పోరాడే కూనలకు 
ఆటవిడుపే ఆకాశవీధి 
పూటలకొద్దీ విహంగాలై 
విహరించడానికి ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment