బెల్లం
తేది 22/23-06-2024
శీర్షిక : వంటకాలలో పూబంతి
మొక్కను వడిపెట్టి తీసినా
పక్కాగా తీపి పాకమే ....
చెరుకు గడల చేమంతి
చాలా వంటకాల్లో పూబంతి ...
గానుగలోనో మిషన్ లోనో
కట్టలు పెట్టి మెలిపెడితే
తేనె జల్లులే తేట తెల్లం
బేళ్ళమైనా ... చక్కరైనా ...
వివాహ భోజనంబు అంటూ
మొదలైన పాటలో చెప్పినట్టు
బొబ్బట్లు ... దప్పడం ...
బెల్లపన్నం .... తీపి బూందీ
ఒక్కటేమిటి ... ఎన్నెన్నో చేయొచ్చు ...
కొత్తకొండ వీరన్నకు
వేములవాడ రాజన్నకు
సమ్మక్క సారలక్కలకు
అమ్మవారి నైవేద్యాలకు ...
అన్నింటికీ కావాల్సిందే ....
వివాహ తంతు జీలకర్ర బెల్లమన్నా
దసరాపండగకు ... పిల్లలకు చాలు
పప్పుబెల్లాలన్నా కావాల్సిందే ....
రకాలు మారినా రంజైన తీపినే ....
కొన్నిసార్లు కల్తీల చక్కరకన్నా
కాలేయం అనారోగ్యులకు
బెల్లమే మిన్న ...మోతాదుగా
వాడితే
మందులలోకి సముచితమే ...
సామెతలలో సాయతమే
బెల్లం మీద వాడుక భాషలో
వేలు ....బెల్లం చుట్టే ఈగలని ...
డబ్బుంటే అంతా బంధువులే
అని చెప్పడానికి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment