Saturday, July 27, 2024

వీరికి పేరేది ... పుట్టేవారికి చోటేది తేది: 11-07-2024 శీర్షిక : ఒకదేశం ఒక చట్టం.

 వీరికి పేరేది ... పుట్టేవారికి చోటేది 

తేది: 11-07-2024
శీర్షిక : ఒకదేశం ఒక చట్టం.  

సతతముగ దొరుకునో 
సహస్ర నామావళిలో 
కోట్ల పేర్లయినను 
కొదువలేక హైందవమున .... 

ఒక్కడైనా పేరుకొచ్చు ... 
భరతునిలా ... 
పదులలోనైనా 
ప్రసిద్ధిపొందు ...కొందరిలా.... 

ఇబ్బందులతో మొదలైనా 
డెబ్బదిలలోనే అంకురమాయె 
ఒక్కరు లేక ఇద్దరు నానుడితో 
మొదలైన కుటుంబ సంక్షేమం... 

దేశ ప్రగతి దేదీప్యమౌనంటూ 
మంది పెరిగితే మజ్జిగ 
పలుచనవునంటూ .... సుద్దులెన్నో 
చెప్పి సుతారంగా ఒప్పించే .... 

కరుడుగట్టిన పాలకుల 
పక్షపాత ధోరణిలతో  
ఒకవర్గానికి ఒత్తిడిచేసి 
నియత్రించే అర్దనీతిగాను .... 

మారుతల్లి ప్రేమలా 
మతమౌఢ్యాలను ప్రోత్సహిస్తూ 
జనాభా పెరుగుదలకు 
ఆధ్యాత్మికతలు జోడించే .... 

ఒకేదెశం ఒకే చట్టమైతే 
కట్టడి కాదా ... అనుకున్న 
లక్ష్యం చేరదా ... అందరు 
తమవంతు సహకారమందిస్తే .... 

జనాభా పెరిగితే ... 
గలాటాలు పెరుగు ... 
అవినీతి, ఆశ్రిత పక్షపాతం , 
లంచగొండితనం , అపసవ్యాలు ... 
దొంగతనాలు , తీవ్రవాదం , 
టెర్రరిజం కొన్ని దేశాల్లో లాగ ... 

ఇప్పటికైనా పాలకులు 
ప్రజలు కళ్ళు తెరవాలి ... 
ప్రకటించుకున్న పద్ధతులు 
పాటించాలి ... చేయూతనివ్వాలి ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment