Friday, July 26, 2024

రాయబడని వాక్యం తేది :03-06-2024 శీర్షిక : శ్రమల చిరునామా

 రాయబడని వాక్యం 

తేది :03-06-2024
శీర్షిక : శ్రమల చిరునామా 
సహస్రాధికం 

పేదరికాలను ఆసరా 
చేసుకుని ... ఆశల వల 
విసిరేసి ...అదఃపాతాళానికి
తొక్కేసిన దళారుల చేతుల్లో .. 
దగా పడిన దిక్కులేని పక్షుల 
మోక్షాలు ...  

అధికారం ఆయుధమై 
అంధకారం ఆవరించిన
మేకవన్నె పులుల చూపులు 
తప్పుకోలేని లేడిపిల్లల కథలు...
 
ఆకలికి అశక్తమై ... 
అవకాశాలు దక్కని 
నిర్భాగ్యులు ... అమ్ముకున్న 
శరీరపు చెమట చుక్కలకు... 
రాబందుల్లా ఆశపడే 
మదాంధుల కథలు .... 
 
ఎన్నో ఇస్త్రీలు  నలగని 
వస్త్రాల ముసుగులో 
బస్తీవాసుల బతుకు 
దెరువుల ముచ్చట్లు .... 

కష్టాలను  పట్టించుకోక 
కలో గంజో కడుపుకు నింపుకుని 
బతుకుదామనుకునే వారిని 
అనుక్షణం అనగ దొక్కే 
అరాచకాల పర్వాలు ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment