Thursday, July 25, 2024

మట్టి కుండ తేది: 19-05-2024 శీర్షిక : అంతటా నీవే ...

 మట్టి కుండ 

తేది: 19-05-2024
శీర్షిక : అంతటా నీవే .... 

నాగరికత నడకలలో 
నరుడు కనుక్కున్న మర్మం ... 
తోడుగా  నిలిచి ... మనిషి 
మంచి చెడును కనిపెట్టుకుని 
కడుపు నింపిన కన్న తల్లి ... 

మంచినీళ్లు తాగాలన్నా ...
కడుపునిండా బోంచేయాలన్నా... 
మట్టి కుండగా మారిపోయింది ...  
పంట ధాన్యం దాచుకోవాలన్న
గాజాగ రూపం చెందింది ....  
పది రూపాయలు దాచాలన్నా 
గురిగిలా  తోడు నిలిచింది ... 

పచ్చళ్లకు జాడీలుగా .... 
కొత్తింటికి కూరాడుగా .... 
పెళ్లిళ్లకు పేరంటాలకు 
ఐరేని కుండలుగా తోడు నీడ .... 

జనన మరణములందు 
జఠరాగ్ని నివారణాలయందు 
సర్వావస్థలయందు  గూడ 
సమున్నతమే నీ స్థానం  
 
పాల కుండగ తోడుండినావు 
పెరుగు వెన్నలకు పెన్నిధిగ 
నిలిచి వంట పాత్రలుగా నీవుండి 
గంపెడు సంసారం వెళ్లదీసినావు .... 

పారిశ్రామిక యుగములో 
పక్కకు నిన్ను పెట్టినా ... 
నీ ప్రాధాన్యతలనెఱిఁగి తిరిగి 
అధునాతన రూప శిల్పాలతో 
అక్కున చేర్చుకుంటున్నారు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment