Thursday, July 25, 2024

వ్యగ్యం తేది : 16-05-2024 శీర్షిక : హాస్యం ....

 వ్యగ్యం 

తేది : 16-05-2024
శీర్షిక : హాస్యం .... 

సంవాదం సరసమైతే ... నవ్వులే 
నవ్వులు ... విరసమైతే ... వింతగా 
గొడవలు .... 

రైలు పట్టాలకు ... కాలి పట్టాలకు 
స్వామ్యమడిగితే ... పట్టాలమీద 
రైలుంటే ... కాలు మీద పట్టాలంటే 
గొలుసులుండునని  గోప్యపరిచే .... 

కనలేని స్త్రీ మూర్తిని కంటివా 
ఎక్కడైనా అంటూ కవ్వింపుగా 
ప్రశ్నించగా... న్యాయదేవతంటూ 
నగుమోము పెట్టె నతండు .... 

సభలోన ఆవులిస్తే ఏంచేస్తారంటే 
పాలిచ్చేవైతే పట్టుకుపోతాననే .... 
దేవుని గుడి ... తాళం వెయ్యాలా అంటే 
భజనలో తాళం తప్పనిసరి అన్నాడు.... 

అమ్మలంత అన్నపూర్ణలే 
కమ్మదనంతో కడుపు నింపగా ... 
నాన్నలంతా  ఏ టి ఎమ్  లే 
అవసరాలకు జేబులు నింపంగా ... 
 
అద్దం ముందు ఆడవారిని 
మైకు ముందు నాయకులను 
వారించ మన తరమౌనా అంటే... 
సమయం తెలియని తంటా అన్నడు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment