Saturday, July 27, 2024

నాకెంతో ఇష్టం తేది :03-07-2024 శీర్షిక : కలుపుకు పోవడం

 నాకెంతో ఇష్టం 

తేది :03-07-2024
శీర్షిక :  కలుపుకు పోవడం 
సహస్రాధికం 

జీవరాశిలో భావరాశిలా 
బారులుతీరి ఎగిరే పక్షుల్లా 
నలుగురిని కలుపుకోవడం  .... 
నలుగురితో పలకడం .... 

కావు కావుమంటే గుమికూడే
కాకమ్మ గుంపులా చేరి 
కష్టాలను పంచుకోవడం… 
సుఖాలను వెదజల్లడం…. 

జీవరాశిలో మిన్నని ఉదాహరించే 
మానవతల ప్రతినిధిలా
ఆత్మీయతలు నింపుకోవడం 
అనురాగాలు పంచుకోవడం 
అనుబంధాలు పెంచుకోవడం 
ఆత్మావలోకనం చేసుకోవడం .... 

జీవరాశికే  సంకేతమైన 
సంయమనాలు పాటించడం 
సమాధానాలు పట్టుకోవడం 
సమస్యలు పరిష్కరించడం 
సమరసత పాటించండం .... 

జీవరాశిలోనే మేలైన 
పెట్టింపులకు పట్టుపట్టక 
పట్టింపులు లేకపోవడం .... 
డాంబికాలు వదులుకోవడం 
ఆడంబరాలను ఆవలకు నెట్టడం ... 

ఇంద్రధనస్సులో  రంగుల్లా 
యిగురించాల్సిన రాజకీయాల్లో 
రంకుతనం లేకుండా ఉండడం... 
మంకుతనం రాకుండా చూడడం...  

కల్మషాల జాడలు తెలియని 
స్వచ్చమైన పాలనురగలలాంటి
పసి పిల్లలతో కలిసిపోవడం .... 
మసిపూసి మారేడులను  చేసే 
కాలుష్యాల కబంధాలనుండి 
ప్రకృతిని విముక్తీకరించడం…. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment