వరలక్ష్మి వ్రతం -2
తేది : 25-08-2023
శీర్షిక : అపురూప సంప్రదాయం
మానవాళి నిత్య సుఖ శాంతులకై
చారుమతీదేవి దూతగా కైలాసవాసుడు
కామేశ్వరి మాతకు బోధించిన కథ ....
ఆరోగ్య రక్షణలకైనా అపురూప సంపదలకైనా
ఆనవాయితీగా కలియుగానికి కానుకగా అందించిన
అనన్యమైన వరలక్ష్మీదేవి వ్రతం .....
ఆరోగ్యమే మాహా భాగ్యమంటే
ఆరోగ్యమొక్కటే కాదు సుమా ,
ఆపదలో ఆత్మ స్త్థెర్యం , ధైర్యం ,
కష్టనష్టాలలో కడతేర్చే ఓర్పు,
ఆవేశంలో తొణకని అణకువ ,
వైఫల్యాలలో గుండె నిబ్బరం ,
అపజయాలలో ప్రత్యామ్నాయం ,
విజయాలలో సంయమనం అన్నీ సంపదలే
ఆ తల్లి లక్ష్మీదేవికి ప్రతి రూపాలే అష్టలక్ష్ములుగా ....
పట్టుబట్టలు నిండుగా ధరించి
పసుపు పారాణిలతో పడతులంతా
మడి ఆచారాలతో పరమ నిష్టలతో
పిల్లాపాపలు చల్లగుండాలని అమ్మ వరలక్ష్మిని
కొలిచే అపురూపమైన ఆచారం సంప్రదాయం ....
ఇల్లాలే ఇలవేల్పుగా శుచి శుభ్రతలతో
ఇంటిళ్లిపాదిని కనిపెట్టుకును ...
ఇంటికి దీపం ఇల్లాలుగా పూజలు వ్రతాలు
చేసినా కంటికి రెప్పై కాచుకును...
కుటుంబ బంధాల హారానికి
కువలాయాక్షియే సూత్రం ....
కుడి ఎడమైనా కుంటుపడు
ఇంటిల్లిపాది విచిత్రం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment