Friday, July 26, 2024

కలం గళం - యుగళ గీతాలు తేది : 22-06-2024 శీర్షిక : మదిలో విరిసిన కావ్యం

 కలం గళం - యుగళ గీతాలు 

తేది : 22-06-2024
శీర్షిక : మదిలో విరిసిన కావ్యం 

ఆమె 
సఖా వేగమే రావా 
నను చేరగ వేగమే రావా 

అతడు 
సఖీ నీ మాటకై 
ఎదురు చూశా 
మరుక్షణం వాలిపోనా ... 

ఆమె 
ఎన్నో పున్నమి రాత్రులలో 
నిన్నే కలవరిస్తున్నాను 
ఊసులన్నీ నీ చుట్టేను 
కనులు మూసినా నీ  రూపేను ... 

అతడు 
పలికేది  నీ నామమే 
ప్రతిక్షణం నీ జపమే 
ప్రతి అలికిడి నీవేనని 
మది నిన్నే తలుస్తుంటే .... 

ఆమె 
పూదోటల వనమంతా 
మలయమారుతం వీస్తుంటే 
కొంటె ఆలోచనలేవేవో 
మది గదిలో గుసగుసలాయే .... 

అతడు 
చల్ల గాలి వీస్తుంటే 
పిల్ల తెమ్మెర మోసుకొచ్చే 
నీ మదిలో విరిసిన కావ్యం 
నా కొరకే నని మురిసిపోయా .... 

ఆమె 
సఖా వేగమే రావా 
నను చేరగ వేగమే రావా 

అతడు 
సఖీ నీ మాటకై 
ఎదురు చూశా 
మరుక్షణం వాలిపోనా ... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment