చిత్ర కవిత -39
తేది: 15-07-2024
శీర్షిక : ఆరోగ్యరక్ష (గోరింట )
ఋతువేదైనా బతుకు మారదు
సెలవు ఊసెరుగని అమ్మలందరికి
సెలయేటి గలగలలే మైదాకు పంట
కొమ్మ లేకుండానే చేతిలో పూయు ...
ఆషాడమొచ్చిందంటే అతివలకు
అలంకారమే కాదు ఔషధ సమము ...
అందానికి అందం... కొత్తనీటి కోరణాలకు
ఆరోగ్యాలకు మూలసూత్రం ...
సంస్కృతికి సంప్రదాయాలకు
పెట్టింది పేరు హైందవమున ....
సన్నుతించి కనుగొనిరి పూర్వీకులు
ఆయుర్వేదమున ఆడపడుచులకై ....
పేరు మార్చుకుని పేరంటాలకు
పెద్దమనిషి అయ్యిందిప్పుడు ....
గోరింట ... మెహందీ... అంటూ
గొప్ప గొప్ప వేడుకలతో కోలాహలమే ....
పిల్లలకైతే పీచుమిఠాయే గోరింటా ....
సంబరాలు అంబరమంటుతాయి ...
నాకంటే నాకంటూ పోటీ పడి
పెట్టుకుంటారు… మురిసిపోతారు…
ఏది ఏమైనా అలంకార ప్రియులైన
ఆడవారికిప్పుడు క్షణంలో చటుక్కున
చేతులు పండే కిటుకులెన్నో
వాణిజ్యమై వర్ధిల్లుతున్నది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment