Friday, July 26, 2024

మళ్ళీ బడికి తేది : 12-06-2024 శీర్షిక : పుటం పెట్టిన బంగారం

 మళ్ళీ బడికి 

తేది : 12-06-2024
శీర్షిక : పుటం పెట్టిన బంగారం 

విహార యాత్రల వింతలెన్నో  
మనమున గిలిగింతలు పెడుతుంటే ... 
ఆనందాలను నెమరువేసుకునేలోపు 
అంతలోనే బడి గంట మోగింది... 

అరలో మూలనున్నబూట్లు 
సాక్సులు బాగు బట్టలు... అన్నీ 
శుభ్రంగా సర్దుకుని హాజరంటున్నాయి 
పద పదమని తొందర పెడ్తున్నాయి .... 

కొత్త మిత్రులతో అనుభవాల 
వింతలు విడ్డూరాల విషయాలు 
కోతలు కోసి అబ్బురపరచాలని 
ఓ పక్క మనసువ్విల్లూరుతున్నది.... 

మనసు వెనక్కి ముందుకు లోలకంలా 
ఊగిసలాడుతుండగానే ...అమ్మ నాన్న 
కొత్త పుస్తకాల  కోరికలేంటని ప్రశ్న ... 
సంతలో సాంతం వచ్చాయో లేదో .... 

సంప్రదాయమెంత గొప్పదో 
మృగశిర కార్తె పలకరింపులతో 
గ్రీష్మ గాలుల కొలిమి మంటలు 
వెనుకబాటై కొంత చల్ల బరిచింది ... 

గురుబోధనలే గుంభనమై 
మేధో మధనాల గమ్మత్తుతో 
కొత్తపుస్తకాల భరతం పట్టి 
భవిత మెరిసేలా...పుటం పెట్టిన 
బంగారు వర్ణాల కాంతులీనాలని ఆశిద్దాం ....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment