Thursday, July 25, 2024

పోలుమారు శీర్షిక : ఆత్మీయతల గీత

 పోలుమారు 

శీర్షిక : ఆత్మీయతల గీత 

వచ్చినా తెచ్చింది ఏమి లేదు...
పోయినా తీసుకుపోయేదేమి లేదు  ...   
ఒంటరే....అయినా...మధ్యలో మిధ్యలా 
సంపద ... సంపాదన ... నాదీ ... నీదీ .... 

ఇండ్లు ... పొలాలు ... గెట్లు 
గట్లు... ఒడ్డు... మీ ఊరు ... 
మా ఊరు ... పొలుమారు...
లెక్కలు పత్రాలు ... 
వాదోపవాదాలు గొడవలు ....  

అయినా ... ఏమ్మాయనో 
ఏమిటో గాని ... ఊరెళ్ళివస్తే 
రా రమ్మని పలకరిస్తుంది ... 
అమ్మ చేతి స్పర్శలా గాలి 
ఒంటినంతా  తడుముతుంది .... 

చదువులకని కొన్నాళ్ళు 
కొలువుకని మరి కొన్నాళ్ళు 
దూరాభారాల పొరుగూరి 
బతుకులతో పొద్దెళ్లదీస్తే .... 
 
అమ్మ నాన్న ఉన్నన్నన్నాళ్లు 
ఆత్మీయపు పలకరింపులే 
అనురాగపు పులకరింపులే .... 
ఆలింగనాల పవన వీచికలే .... 

No comments:

Post a Comment