చిత్ర కవిత (జగన్నాథుని చిత్రం )
తేది : 14-07-2024.
శీర్షిక : బ్రహ్మాండ నాయకుని రథ యాత్ర బ్రహ్మాండ నాయకునికి
బ్రహ్మరథము పట్టు జనులు....
గ్రీష్మము దాటుకుని వర్షఋతువేతెంచ
పులకరించు ప్రకృతి ఆషాడ ఏకాదశికి ....
నభూతో నభవిష్యత్తన్న చందంగా
పూరి పట్టణం జనసంద్రములతో
ఓలలాడు... భువనభాండములెల్ల
ముక్తికై భక్తితో అనుభూతి చెందుదురు ....
పది రోజుల యాత్ర పరమపవిత్రం ....
ధనిక పేదల తారతమ్యం లేని
దండి యాత్ర ... వందలేళ్ళ నుండి
వర్ధిల్లుచుండె ప్రజలకు ముక్తినిస్తూ ....
గాలికి వ్యతిరేక దిశలో పతాకమేగురుతూ
గగుర్పొడిచే వింతగొలుపు కొంత ...
శాస్త్రీయతలకందని ఆధ్యాత్మికత నిండి
అబ్బురపరుచు అనుభజ్ఞులను సైతం ....
సుభధ్ర బలరామ జగన్నాథుల
సుందరమైన విగ్రహాలు ప్రతియేటా
ప్రతిష్టించుతూ పవిత్ర పూజలే
పండగలా ఉత్సవాలు ప్రతిఇంటా ....
వందల ప్రసాదాల నివేదనలు
వేలమంది పోషింపబడు నిచట ...
లక్షలమంది పాల్గొని తరించ
కోట్ల మంది వీక్షించి తరించెదరు ....
జయజయద్వానాల దద్దరిల్లుతూ
భక్తసందోహం నాట్యభంగిమలతో ....
విశ్వములోనే వింతగా ప్రసిద్ధికె క్కె
అనంతశయనుని ఘనమైన రథయాత్ర...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment