Saturday, July 27, 2024

పూజ్య దాశరథి కృష్ణమాచార్య

 పూజ్య దాశరథి కృష్ణమాచార్య


దాశరథీ దశ గుణ నిధీ తెలుగువారి పెన్నిధి. 
"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని నినదించిన కవి .  
బ్రహ్మ శ్రీ వెంకటాచార్యులు వెంకటమ్మ గార్ల కన్న బిడ్డ 
విప్లవాల గడ్డ తెలంగాణా  వారి ముద్దు బిడ్డ ... 

పూవు పుట్టగానే పరిమళించినట్టు 
పుణికి పుచ్చుకున్నారు కవితా స్నేహం పదవ ఏటనే 
అభ్యుదయ భావాలను అలవర్చుకుని.... 
అసమానతలను, అణిచివేతలను ఎండగట్టారు..... 
 
నిజాం పాలనను, దొరల పాలనను నిలువు దోపిడీని
నిలువునా ప్రశ్నించి ఎదురు నిలిచారు.  
వట్టికోట అల్వారు స్వామి వంటి వారి సాన్నిహిత్యంగా పని చేసి 
నాటి బానిస పద్దతులను, బడుగు జీవితాలను, 
ధన మాన ప్రాణాలను దోచుకున్న తీరును 
అగ్నిధార, రుద్రవీణలుగా అక్షరీకరించారు. 

కొంత కమ్యునిష్టు భావాలకు ప్రభావితమైనా ,
ఆధ్యాత్మికతను సైతం అవపోశన పట్టినారు . 
శ్రీ మద్రామాయణం , శ్రీ మహా భారతాలను సరళంగా 
తెలుగులో అనువదించి  కానుకగా మనకందించారు... 

భాషా సాహిత్యములో ఎనలేని సేవలందించి 
బహు చక్కని పాత్రను పోషించి -- సినీ గీత రచయితగా, 
గాలిబ్ గీతాలు అనువాద కర్తగా, తిమిరం తో సమరం 
కవిత సంపుటిలతో, అనన్య సామాన్యమైన రాష్ట్ర, కేంద్ర 
ప్రభుత్వాల అవార్డులు, రివార్డులు అనేకం అందుకున్నారు
ఆంధ్ర ప్రదేశ్ ఆస్థాన కవిగా నిలిచారు. 

లెక్క లేనన్ని నవలలు, అనువాదాలు, జీవిత చరిత్రలు, 
కథలు, కవిత్వాలు, శతకం,వ్యాసాలే కాకుండా ఆత్మకథ  మరియు 
ఉమ్రావ్ జాన్ అదా అనే ఉర్దూ నవల సైతం అందించారు. 
పూజ్య దాశరథీ అందుకోండివే మా నివాళి. 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment