Saturday, July 27, 2024

పలకరింపుల పదనిసలు తేది :02-07-2024 శీర్షిక : ఆణిముత్యాలను ఏరుకోవాలి…

 పలకరింపుల పదనిసలు 

తేది :02-07-2024
శీర్షిక :  ఆణిముత్యాలను ఏరుకోవాలి… 

పలుకే బంగారమాయె 
అన్న చందంగా ... కొంతమంది 
నవరత్నాలను మూటగట్టుకోరు
ఆణిముత్యాలను ఏరుకోరు .... 

సొమ్ములు కరుగునో అరుగునో
అన్నట్టుగా…అత్తిపత్తిలా ముడుచుకుని 
హావభావాల్లో ముభావాల సోదదరులై
గిరిగీసుకుని బరిలో నిలబడుతారు… 

సుందరమైన దరహాసాన్ని కూడా
సుదూర తీరాలకు విసిరేసి…. 
సుమనోహరమైన వదనాలు
మాడ్చుకున్న మందారాలౌతాయి….  

జీవితమంటేనే ఓ రైలుప్రయాణం
ఎక్కేవారు దిగేవారికి లెక్కలేదు… 
కలిసిన క్షణాలు కలహంసలమైతే
కలకాలం తీపి గురుతులే కద…. 

ఆత్మీయతలకు అచ్చుయంత్రంలా
అనురాగాలకు జోడు మంత్రంలా
కలిసిన క్షణం కలబోసుకుంటూ 
మానవీయ విలువలను జతకట్టుకుని
కమ్మని అనుభవాలను మూటగట్టడమే..

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment