ఆహ్వానాలన్నీ అంతర్జాలంలోనే- 2
తేది : 19-06-2024
శీర్షిక : మార్పుతో విలువలు పెరగాలి
ప్రత్యక్ష భాషణ భూషణాలేవి ?
పరామర్శల అనుభూతులేవి ?
కరస్పర్శల కమ్మదనాలేవి ?
అన్నీ అంగట్లో సరుకులే ....
అరచేతిలో స్వర్గంలా ... అది
ఇమిడిపోయాక ... అన్నీ అందులోనె
ఆనందాలకు విచారాలకు
మంచికి చెడుకు మాటల పొట్లాలు...
ఇల్లు కట్టి చూడు .. పెళ్లి చేసి చూడు
అన్నారు ... కష్టం సుఖం కలబోసుకోని
కమ్మని కబుర్లు చెప్పుకుని ...కలకాలం
జ్ఞాపికలను చేసుకునే పిలుపులేవి ? ...
ఐదవతనానికి సంకేతం
ఆత్మీయతలకు నిదర్శనం
అనురాగాల సదనం ...
బొట్టుపెట్టి పిలుపులే లేవు ...
ఆదిత్య 369 లో చూపినట్టు
అంతర్జాలయంలోనే ఆశీర్వచనం
పంపే రోజులు కూడా దగ్గరే...
మార్పు ఎప్పుడు మానవతా విలువలకు
హారతి పట్టాలి కానీ మంగళం పాడకూడదు.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment