Friday, July 26, 2024

బడుల పునఃప్రారంభం తేది : 08-06-2024 (1183) శీర్షిక : బడి బాట

 బడుల పునఃప్రారంభం 

తేది : 08-06-2024  (1183) 
శీర్షిక : బడి బాట 

తొలకరితో వరమిచ్చి 
వానమ్మా పలకరించే 
మృగశిరతో మలయములు 
వేడిగాలి ఉపశమనములు .... 

కువకువల పక్షులవలె 
కులాసాగా తరలండి ... 
బడిబాటకు సమయమాయె 
బ్రతుకులలో వెలుగు నింప .... 

దొంగాట దోబూచిలా 
ఎండావాన ఆడుతుంటే 
గమ్మత్తుగా తుడుచుకుంటూ 
తరగతిగదికి నడవండి .... 

పంతుళ్ళ పాఠాలు 
వంతులుగా చదవండి .... 
విలువైన విజ్ఞానం 
విజయములనే పొందండి.... 

ముత్యమంటి అక్షరముల 
మురిపమైన చేతి వ్రాతలు 
పదములను పద్దతిగా 
ముదము తీర నేరవండి ... 

భావితరం పౌరులు 
బంగారు శిక్షణలతో 
భవితను తీర్చి దిద్దుకోండి 
పట్టభద్రులై ఎదగండి .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment