వాన కురిస్తే
తేది :05-07-2024
శీర్షిక : పులకరింపులే ....
సహస్రాధికం
తొలకరితో పులకరించిన
అవనిమాత పచ్చలు పొదువుకుని
పాడి పంటల సమృద్ధితో
జీవానికి ప్రాణమై జీవరాశి
మనుగడలకు మూలమై
విశ్వం ఫరిఢవిల్లుతుంది....
కొండా కోనా మురిసి ముద్దై
స్వచ్ఛమైన సెలయేళ్ళు
చెవులపిల్లి దూకుళ్లతో
సంబరాలు అంబరాన్నంటుతాయి ...
పిల్లా పీచు గొడ్డు గోదా
పిట్టా గుట్టా గూడు మురిసి
ఆటాడుతాయి ... జలచక్రం
ఆడితేనే బలాలన్నీ పుంజుకుని
పురి విప్పి నాట్యమాడుతాయి ...
జలమేరా అన్నింటికీ మూలం
ఆ జలం విలువ తెలుసుకొనుట
మానవ ధర్మం....తెలుసుకుని
జనం మనసు గెలుచుకోవడం
ప్రధానం ....
జవసత్వాలను కుదువపెట్టి
అలసత్వాలను చుట్టుకుని
కాలుష్యాలను ప్రబలింపజేసి
జలాలను మట్టుబెట్టి
గళాలను ఎండబెడుతూ
కాసులకు కక్కుర్తిపడి
అమ్ముకుంటున్నాడు ....
మెరిసే ప్రకృతంతా
సమస్త జీవరాశి సొంతమైనా
ఆధిక్యతలను సాధించిన
ఆది మానవుడు పాగా వేస్తూ
పయనిస్తున్నాడు....
అధికారంలో ఉన్నా
ప్రతిపక్షంలో ఉన్నా
నీళ్ళల్లో సొర చేపలా
రాయి రప్ప ఇసుక అన్నీ
దోచేసుకుని దాచేసుకుని
ఊసరవెల్లిలా రాజకీయ
రంగులు మార్చుతున్నాడు...
మారని మనస్తత్వాలతోఁ
ప్రళయంలో పాఠాలు
నేర్చుకుని.. పవిత్రతలు
మూటగట్టుకుంటాడేమో ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment