తీర్థ యాత్ర
తేది: 23-05-24
శీర్షిక : ఆరోగ్యం ... విజ్ఞానం ... వికాసం
జీవితములో ప్రతీది సబబే
సమయోచిత సమాంతర
సంఘటన... సద్బుద్దికి
సంకేతమయ్యే తీర్థయాత్ర ...
ఊరికి దూరంగానో ... నదీ
తీరంలోనో ... కొండ శిఖరం
పైననో ...
ప్రకృతమ్మ ఒడిలో ..
ఆరోగ్య రక్షణలకు నెలవుగా ... .
సంసార సాగరంలో ఈదుతూనే
పాలల్లో వెన్నకు పాకులాడినట్టే
సమాజములో సర్దుకున్న
సర్వేశ్వరుని వెదుకులాటలో ...
మనసుకు నచ్చిన తీర్థం
ఊపిరి చేసుకుంటే ....దైవ
దర్శనం ఓ నయానందకరం
ఆత్మానందకరం ... తన్మయత్వం ....
మర్మంగా బోధించు అనేకం
విజ్ఞానం వివేకం వికాసం పరులతో
నడవడిక ....దానాలు ధర్మాలు
పరమత సహనం ... ఇత్యాది ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment