Friday, July 26, 2024

ఒక్క గెలుపు కోసం తేది 04-06-2024 శీర్షిక : ప్రపంచమే నీ వెంట

 ఒక్క గెలుపు కోసం 

తేది 04-06-2024
శీర్షిక : ప్రపంచమే నీ వెంట 

గెలుపెప్పుడు దుర్లభమే 
అనుభవాల నిచ్చెనను 
ఆసరాగా చేసుకుని 
అకుంఠితమై అడుగేస్తేనే .... 

ఎక్కడ తగ్గాలో తెలిస్తే 
ఎక్కడైనా గెలవవచ్చు ... 
పట్టుదలలు పట్టువిడుపులు 
నీ పెట్టుబడైతే చాలు ... 

నూరయ్యేదాకా నీవంతు 
నూరయ్యాక నావంతందట 
డబ్బుల మూట ... స్వీయ 
క్రమశిక్షణల శిబిరమైతే చాలు ... 

దృఢదీక్షల దిగ్గజమై 
మడమ తిప్పని మనస్తత్వమై 
ప్రణాళికల పల్లకిలో 
ఊరేగితే చాలు ఫలవంతమే .... 

ఎంత దూరమైనా సరే 
ఒక్క అడుగుతోనే ప్రారంభం .... 
ఒక్కసారి గెలిచావో 
ప్రపంచమే నీ వెంట .... 

విర్రవీగక వినయం 
ఆభరణం చేసుకుంటే 
మళ్ళీ మళ్ళీ పలకరించి 
పరవశాల పందిరిలో 
సేద దీర్చుతుంది .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment