ఏరువాక గీతాలు
తేది : 08-06-2024
శీర్షిక : కర్షకుడు ... కార్మికుడు ...
సహస్రాధికం
నేలతల్లి ఒడిలోన
దుక్కి దున్నే రైతన్నా …
తోడూనీడై నడిచే
భుజబలాల శ్రామికా ....
మేలుకోర రైతన్న మేలుకోర
కోడికూతకన్న ముందుగనే ..
హలమును చేబూనరా
పొలమున విత్తేయంగా …
కర్షకుడు కార్మికుడు
భుజం భుజం కలిపితేనే…
కదులునురా ఈ ప్రపంచం
కడుపు నిండునురా ప్రజలకంత ....
నేలతల్లి ఒడిలోన
దుక్కి దున్నే రైతన్నా …
ఏరువాక పున్నమికి
ఎవుసం పని మొదలాయె
విశ్వబ్రహ్మ చేతులలో
నాగండ్లు సిద్ధమాయె ....
పంటపొలం దున్నంగా
పండగేను రైతులింట…
ఇంటింటా పూజలే
పనిముట్లకు పశువులకు ....
నేలతల్లి ఒడిలోన
దుక్కి దున్నే రైతన్నా …
ఏరువాక పున్నమొచ్చి
మబ్బులను పలకరించె …
చినుకమ్మ కురవగానే
అవనిమాత పులకరించె ...
ఎత్తుమురా అరకలను
కట్టుమురా జోడెద్దులను …
ఇడుగిరువాలు దున్నగనే
ఏరై పారదా ఏరువాక పండగ ....
నేలతల్లి ఒడిలోన
దుక్కి దున్నే రైతన్నా … ...
అడుగడుగున మీ నీడలే
అన్నపూర్ణగ నిలుపును ....
పట్నం పల్లెన పూసేది
మీ రెక్కల కష్టములే....
మీరు లేని నిమిషములో
మరుభూమే విశ్వమంతా ....
మీరున్న ప్రతి చోటన
స్వర్గములే బ్రతుకంతా .....
నేలతల్లి ఒడిలోన
దుక్కి దున్నే రైతన్నా …
హలమును చేబూనరా
పొలమును నువు దున్నరా…
.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment