Monday, February 12, 2024

తెలుగు భాష ఔన్నత్యం తేది: 22-03-2023 శీర్షిక : అజరామరం

 తెలుగు భాష ఔన్నత్యం 

తేది: 22-03-2023
శీర్షిక : అజరామరం 

వేల సంవత్సరాల వేలుపు 
ముత్యమంటి అక్షరములతో 
ముద్దులొలుకు పదసంపదలతో 
ఆత్మీయతలను జోడించుకుని 
అలరారుతున్నది నా తెలుగు .... 

ఎప్పటికప్పుడు తత్సమ  తద్భవ 
దేశ్య  అన్య దేశ్య గ్రామ్య పదాలను 
కలుపుకుంటూ సాగుతున్నది 
సార్వజనీనతల సందర్శిణియై ..... 

వ్యాకరణ నిర్వచనాల దిట్టగా ... 
అలరించే  ఛందోబద్ధతల పద్యాలతో .... 
సుందరమైన అలంకారాలతో  ... 
శాస్త్రీయతల చలువ పందిరి .... 

రాయలకాలములోనే  రాచమర్యాదలు  
అందుకుని అష్టదిగ్గజాలతో అపర 
ఖ్యాతినార్జించి ....భౌగోళమును పోలిన 
అక్షరాకృతులతో  భువనవిజయమును
కూర్చినది ....   

అది ఇది అను తేడా లేకుండా ... 
అన్ని రకముల  సాహిత్యాలను  
అక్కున చేర్చుకుని .... అజరామరమై 
ఆచంద్రతారార్కంగా వెలుగులీనుచున్నది .... 

చిత్ర కవిత తేది : 20-02-2023 శీర్షిక : గోకర్ణమా ?

 చిత్ర కవిత

తేది : 20-02-2023
శీర్షిక : గోకర్ణమా ? 

వందనాలో వందనాలు 
వందనాలో లింగమయ్యా 
వందనాలో వందనాలు 
జగములేలే జంగమయ్యా... 

తెలిసీ తెలియక చేసిన పాపముల 
తేట తెల్లముగా కడిగి తేలిక చేసే గంగాపతి 
కైమోడ్పుల వందనముల నందుకుని 
మమ్ము  కరుణించుమో…  కైలాసపతీ ..... 

లింగ రూపమున ఏలుకునే 
వెండి కొండల దండి దొరవని 
నిండు మనసున మమ్మెపుడూ 
కాచి మమ్ము కాపాడమని మొక్కెద .... 

అపర జ్ఞాని ఆ రావణబ్రహ్మ 
ఆత్మ లింగము తేవాలన్న ఆశలను  
విఘ్న నాయకుడు విషమ పరీక్షల   
వింతచేష్టల చేజార్చి ప్రతిష్టించిన గోకర్ణమా .... 

ఏమని వర్ణించము నీ లీలలు .... 
అభిషేకప్రియమని అలలతో 
నిండిన సంద్రపు ఒడ్డే నీకు 
పసందైన ప్రదేశమని ఎంచితివా .... 

దేవాలయాల బిల్లు పార్లమెంటులో ఈనాడు ... తేది : 19-02-2023

 దేవాలయాల బిల్లు 

పార్లమెంటులో ఈనాడు ... 
తేది : 19-02-2023

ఓడెక్కేదాకా ఒడామల్లప్ప అంటూ  ... 
తదుపరి అంతా బోడ మల్లప్పలేలా  ....
గుంభనంగా  దాచి వివరాలు 
గుటుక్కుమనిపించారు చివరి క్షణాన ... 

ప్రజాక్షేత్రంలో పరాభవమైనా 
బోళాశంకరుణ్ణి మనసు పెట్టి 
స్తోత్రించి మంత్రించి  బోల్తా కొట్టించి ... 
వరాల జల్లులు కురిపించుకున్నారు .... 

ఆనక అసలు విశ్వరూపాలు చూపిస్తూ ... 
ప్రజల మనోభావాలతో పరాచికాలాడుతూ 
అల్లల్లాడిస్తున్న....పెను మూకల 
ముక్కున  కళ్లెం వేసినట్టవుతున్నది ..... 

మీ ఇంటికి వస్తే ఏమిస్తావు 
మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు ... 
అన్న చందంగా ఉంది ... 
స్వాతంత్యానంతర పాలనలు .... 

చాప కింద నీరులా మెత్తగా మాట్లాడి 
ఒత్తి పారేయడం లో ఆరితేరిన ఆనాటి 
కోటరీలు చేసిన అనేక అక్రమార్జన 
కార్యక్రమాలలో ఇదీ ఒకటి .... 

కపట నాటకాలతో కబ్జా మంత్రం 
పాటిస్తూ  దర్జాలు వెలగబెట్టే 
సన్మార్గులకు ...సలాకల వాతలా 
సన్నాయి వాయిద్యం ... ఈ బిల్లు. 

ఎవ్వరికి  లేని వెసులుబాటు 
మనకు మాత్రమే ఇచ్చిన నాటి 
కుతంత్రాల కుల పెద్దలైన 
మిత్రబృందానికి అశనిపాతమే... 

ప్రతిపక్షం ఊసులు లేకుండానే 
ఏకపక్షంగా పాలకపక్షం ప్రజలను 
వంచిస్తూ వచ్చిన  ఆటపాటలకు 
కళ్లెం వేయగలిగే రౌతు దొరికాడు ... 
  
మనం చేస్తే సంసారం .... ఎదుటి 
వాళ్ళు చేస్తే వ్యభిచారం ముద్రల్లా  
చడీ చప్పుడు లేకుండా మొదలెట్టిన 
తప్పుడు కార్యక్రమాలకు... 

అప్పుడు వాళ్ళు చేసిన తప్పులను 
సరిచేస్తుంటే .... తట్టుకోలేక 
తప్పని తెలిసినా...పరాయి శత్రువులతో 
చేతులు కలిపి ఎవ్వారాలను తమకు 
అనుకూలంగా తిప్పుకోవాలని చక్రం 
అదేపనిగా తిప్పుతూనే ఉన్నారు ...

దర్బారు దూలాలను ఒక్కొక్కటిగా 
విచ్చుకుంటూ రంధ్రాలను సరి చేస్తూ ....
ఇంటిమీది రావి లేదా మర్రి మొక్కలను 
చిక్కులు విడదీసుకుంటూ కూకటి వేళ్ళతో  
ఒక్కొక్కటిగా పెకలిస్తూ పీకేస్తుంటే .... 
తట్టుకోలేక తటపటాయిస్తున్నారు ...

గ్రంథ పఠనం తేది: 20-02-2023 శీర్షిక : విజ్ఞాన వంతం

 గ్రంథ పఠనం 

తేది: 20-02-2023
శీర్షిక : విజ్ఞాన వంతం 

అక్షరాస్యతల అలుపెరగని 
పయనం ...చల్లుకుంటూ పోతే 
కలుపు మొక్కలు లేని కమనీయమైన 
విజ్ఞాన పంటల విస్తీర్ణం పెరుగుతుంది  ....  

మొక్కలన్నీ సారవంతమై... మొగి 
పురుగుల్లాంటి అవినీతిని పారద్రోలి 
పుష్టి కలిగిన పుష్కలమైన మొక్కలతో 
ఆరోగ్య సంఘమై వెలుగులీనుతుంది ... 

అమ్మలా అక్కున చేర్చుకుని 
గుండెల్లో నిబ్బరాన్ని నింపుతుంది .... 
అప్పుడప్పుడు తడిని  తడిమి 
కన్నీరు రప్పించి కరుణ చూపుతుంది ... 

రాతి గుహలలో రంజిల్లిన జీవితం 
రంగు భవనాల్లోకి మారినట్టుగా .... 
సంఘమంతా సమృద్ధి చెందితే ...
బలమైన ఆలోచనల తేజమౌతుంది ...  

ఆనాటి గ్రంథాలయాల ఉద్యమం 
అనితరమై నిలిచింది....స్వాతంత్ర 
పోరాటంలో సమిధలను కూర్చి 
వీరులను చేర్చి  మాతృభూమి సేవలో .... 

సాంకేతికత చంకలో దూరాక.... 
కొంత తగ్గి ... అన్నీ చరవాణి లోనే 
ఇమిడిపోయి ... వింతగా మనిషిని 
తన గుప్పిట బందించుకున్నది .... 

ఇప్పుడేది తెలిసినా తెలియక పోయినా ... 
అన్నీ గూగులమ్మతో గుసగుసలే ....
సోషల్  మీడియాల సొల్లు కబుర్లతో 
కాలమంతా హరించుకు పోతున్నది .... 
 
నగునూరి రాజన్న 

కవన రవళి .... భక్తి గజల్ తేదీ: 19-02-23

 కవన రవళి .... 

భక్తి గజల్ 
తేదీ: 19-02-23

ఆది లేదు  అంతమెరుగ 
మన్నించుము  జగదీశా ... 
వెండికొండ హిమాలయం 
పులకించును  జగదీశా .... 

మనువాడే రోజు కదా 
మాఘ శుద్ధ  చతుర్దశిన 
మనసారా వేడుకొందు 
కరుణించుము  జగదీశా ... 

పండ్లు పూల అర్చించెద 
పాట పాడి మెప్పించెద 
దయా కరుణ కిరణాలను 
కురిపించుము జగదీశా .... 

విషము దాచి అమృతమును 
పంచుకొనుట తెలిసి నీవు 
మాకు కూడ  ఆ గుణమును 
నేర్పించుము  జగదీశా .... 

పంచాక్షరి పటియిస్తే 
రాజగుణం నీదయ్యా 
అభయమిచ్చి కాపాడే 
భక్తసులభ  జగదీశా 

నగునూరి రాజన్న 

ప్రేమ ఎంత మధురం తేది : 14-02-2023 శీర్షిక : జ్ఞాపకాల దొంతర

 ప్రేమ ఎంత మధురం

తేది : 14-02-2023
శీర్షిక : జ్ఞాపకాల దొంతర 
కవిత సంఖ్య : సహస్రాధికం 

మననమే మహోన్నతమైన పులకరింపు
ప్రాణమివ్వాలన్నంత పరితపనలతో 
పలకరిస్తుంది ....కనపడకపోయినా 
కమ్మని మధురిమల ఆస్వాదనలను 
అందిస్తుంది ...వినపడకపోయినా 
వింతగా ప్రాణాలను రక్షిస్తుంది  ... 

ప్రేమ ఎప్పుడూ మధురమే 
సర్వకాల సర్వావస్థలలో 
సప్తవర్ణాలు పొదువుకున్న 
ఇంద్రధనుస్సులా ..... 

అవనిమాత కాలుష్యాల కాటుకు 
బలి కాకముందున్న సెలయేటి 
చెలిమెల నీరంత స్వచ్ఛమైనది 
హిమాలయాల్లో పుట్టిన నదులంత 
పవిత్రమైనది .... 

పరిసరాలను మైమరిపించి 
పరస్పర హృదయాలను మీటి 
రాగాలు పలికించి జతులకు గతులను 
తాళాలను జత చేసేది .... 

ధనిక పేదల  బేధాలు మరిచి 
ధునిలా ప్రజ్వలించేది .... 
స్వార్థాలను సాంతం  వదులుకుని 
త్యాగాలను నిత్యం అనుసరించేది .... 

ప్రేమను ఎంత వర్ణించినా ... 
ఎన్ని రకాల తెలియజేసినా .... 
అసలు సిసలైన ఆ మధురం 
అనుభవిస్తేనే ... అవపోశన 
పడితేనే తెలుస్తుంది .... 

ఓడినా ... గెలిచినా....మధురిమలనే 
జ్ఞాపకాల దొంతరలుగా మనసు 
గదిలో బందీ అవుతుంది .... 
కావ్యంలా మనసు అరలలో 
నిక్షిప్తం అవుతుంది .... 

మహాశివరాత్రి తేది : 18-02-23 శీర్షిక: శివ శివ శివ యని పలికెను తనువు…

 మహాశివరాత్రి

తేది : 18-02-23
శీర్షిక: శివ శివ శివ యని పలికెను తనువు…
సంఖ్య : 


శివ శివ శివ యని పలికెను తనువు… 
భవ భవ భవ యని నుడివెను మనసు … 

దక్షయజ్ఞమును నీవు దద్దరింపజేసి…
ముద్దుగొలుపు సతిని ముభావమున
స్వీయ దహనమునకు తానె శ్రీకారమవ్వగా… 
పార్వతీ  జన్మకు పదిలమైతివి స్వామీ…. 

శివ శివ శివ యని పలికెను తనువు… 
భవ భవ భవ యని నుడివెను మనసు … 

కుసుమ విల్లునెక్కుపెట్టి
కుమార సంభవ బీజమేసిన..
చెరుకు విలుకాన్ని నీవు చెరపంగ..
చలించి కొంత జ్వలించి మాడ్చి…
మసి చేసినావు…మహాదేవుడా…. 

శివ శివ శివ యని పలికెను తనువు… 
భవ భవ భవ యని నుడివెను మనసు … 

మనసుతో నామంబు మననము చేయగనే
మరులు గొలిపిన ప్రేమ మత్తులు వదలక…
ఇత్తువన్ని కోరికలు ఇలవర్ష చేయకనే
అసురులైననేమి అడిగినన్నియును…దేవా

శివ శివ శివ యని పలికెను తనువు… 
భవ భవ భవ యని నుడివెను మనసు … 

ఆలికి తనువు పంచి అమరత్వం పొంది 
అర్దనారీశ్వరుడవయ్యావు… నీవు
ఉత్తుంగ తరంగమైన గంగ నెత్తిన నిలిపి 
జీవకోటికి దేవుడవయ్యావు… 

శివ శివ శివ యని పలికెను తనువు… 
భవ భవ భవ యని నుడివెను మనసు … 

వెలుగు వెన్నెలపైన వెండికొండల రేడు 
భక్తసులభుడతడు బహుదొడ్డ దేవుడు… 
సగరుల శాపములను బాపి 
సర్వేశ్వరుడవు ఇయనావు ఇలలో…. 
భం భం భోలే మహాదేవా…యని. 
డం డం భోలే సదాశివా...  అంటూ… 

శివ శివ శివ యని పలికెను తనువు… 
భవ భవ భవ యని నుడివెను మనసు … 


నగునూరి రాజన్న 

మహాశివరాత్రి తేది: 17-02-23 శీర్షిక: శివ శివ

 మహాశివరాత్రి 

తేది: 17-02-23
శీర్షిక: శివ శివ 


శివశివ హరహర కైలాసవాసా 
శంభోశంకర మహాదేవ 
హరహర శివశివ సదాశివా
భక్తుల బ్రోవగ రావేరా ....  

భక్తసులభుడవని భావించేరు 
భక్తితో నిన్నుసదా కొలిచేరు 
బోళానాథుడు నీవే కదా ... 
సోమసుందరుడు నీవే కదా .... 
                 // శివ శివ // 
అవినాశుడవని కొనియాడేరు 
అధినాథుడని కీర్తించేరు 
గరళకంఠుడువి  నీవే కదా 
నిటలాక్షుడవు నీవే కదా .... 
                   // శివ శివ // 
పరమశివుడవని ప్రార్థించేరు 
సోమశేఖరుడవని పూజించేరు 
మహేశ్వరుడవు  నీవే కదా ... 
మృత్యుంజయుడవు నీవే కదా ... 
                    // శివ శివ // 
ఆది తెలియదు అంతు చిక్కదు 
ఆదిభిక్షువుగ కీర్తించుదురు 
అపురూపముగా కొలిచెదరు 
ప్రళయకాళుడవు నీవే కదా ... 
పాపవిమోచనుడవు నీవే కదా .... 
                      // శివ శివ // 
మనమున నిన్నే తలిచెదము 
మననముతో తరియించెదము
మాస శివరాత్రి  మహా ప్రీతిపాత్రము. 
మహాశివరాత్రి గొప్ప పర్వదినము …

నగునూరి రాజన్న 

తలపుల తపనలు తేది: 17-02-23 శీర్షిక: తీయని శ్వాస

 తలపుల తపనలు 

తేది: 17-02-23
శీర్షిక:  తీయని శ్వాస 
కవిత సంఖ్య: సహస్రాధికం 

మనసు పొరలలో మౌనంగా 
బంధించుకున్నప్పటి నుండి 
తీపి కలవరింతలే ....మౌనంగా 
మననమే ఆలోచనల సవ్వడిలో 
ప్రతి క్షణం .... 

పనులలో లీనమై మునిగినా ... 
పయనంలో సాగినా ... అలసట 
తోటలో అలమటించినా ....నీ 
తలపులే తీయని శ్వాసలైనాయి ....  

నా తపనలన్నీ  తదాస్తులై 
ఎదురుచూపులన్నీ ఎదురొచ్చినవేళ
తలపులలో తడిచిన మొహం 
తలంబ్రాలై మురిపించాయి .... 

తొలి యాదుల గమ్మత్తులొ ... 
మలి చూపుల మాయలో ... 
బ్రతుకుబాటను బంగారంగా మార్చి 
నిత్యం చెరగని చిరు నవ్వుల 
నవరత్నాలను పూయించావు .... 

నడిచొచ్చిన కుసుమ తోటలోని 
అనుభవాలను అక్కున చేర్చుకున్న 
ప్రతీ నిమిషం .... ఆనందాల 
వెల్లువలై  ... పరిమళభరితమై 
శోభిస్తుంటాయి  ...  

నగునూరి రాజన్న 

దాంపత్య రేఖ తేది: 16-02-23 శీర్షిక: పాలు నీళ్లు లా

 దాంపత్య రేఖ 

తేది: 16-02-23
శీర్షిక: పాలు నీళ్లు లా 
కవిత సంఖ్య: సహస్రాధికం 

పూర్వ బంధమో ... పుణ్య ఫలమో ... 
చూపులు కలిసిన శుభవేళ అంటూ 
మాటల వంతెనలు దాటుకుని 
బాసల బ్రతుకులకు  తెరతీసి 
అన్యోన్యతల లతలై అల్లుకునేది ..... 

ముద్దు మురిపాలతో మొదలయ్యి 
హద్దుల పొద్దులు తెలియకుండగనే 
సుద్దులు కూడా తెలుపుకోలేనంతగా 
పద్దులు రాసుకున్న పుటలతో ప్రారంభం .... 

ఒకటొకటిగా పేజీలు తిప్పుతుంటే 
ఒద్దికలన్నీ  సద్దిముల్లె కట్టినట్టుగా 
పాలు నీళ్లుగా కలిసి పోయేది .... 
ప్రాణవాయువులై శ్వాసించేది ..... 
ఒకరికొకరై కలిసి సాగేది ..... 

అనుక్షణం అరమరికలు లేకుండా
కనుపాపలు రెండైనా చూపులు ఒకటిగా 
దినములు గడిచినను... ఘనములు 
పెంచుతూ ....ఒకరికొకరు బలమై ... 
బలగమై .... బ్రతుకు సాగించేది .... 
 
అప్పుడప్పుడు అప్పు తచ్చుల్లా 
చిలిపిగా చిటపటలాడుకున్నా  
అంతలోనే అవగాహనలు తలకెత్తుకుని 
వంతలు పాడుకుని అనురాగపు పాటను 
ఆలపించేదే .... దాంపత్య రేఖ .... 

నగునూరి రాజన్న 

కళాశ్రీ చిత్ర కవిత తేది : 17-02-2023 శీర్షిక : అపర ఝాన్సీ

 కళాశ్రీ చిత్ర కవిత 

తేది : 17-02-2023
శీర్షిక : అపర ఝాన్సీ 

ప్రభుతలెన్ని మారినను 
ఫలములేమి ? పాలకులెంత 
మంది మారినను పరిణామమేది ? 
ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది ... 

అక్షరాస్యతలు నేడు అందుకొన లేదు 
వందశాతం పొందుగాను దేశమందు 
వరుసబెట్టి వత్సరములు గడుచుచున్న 
వజ్రోత్సవముల జాడ వరకైనను ..... 

పట్టుబట్టి చదివినా ... ఐదు లేదా 
పది దాటారు నేటికి పల్లెపట్టున .... 
చదివినా దొరకవు తదునుగుణమున 
తర్ఫీదు పొందిన ఉపాధి కల్పన .... 

కడుపులు నింపుకొనవలెనన్న 
కాళ్ళు చేతులాడవలెనన్నట్టుగా .... 
కదిలింది స్త్రీమూర్తి కదనరంగమంటి 
కార్మికలోకమునకు కట్టుకుని వీపున 
చిట్టి తండ్రిని  అపర ఝాన్సియై 
ఆ ద్విచక్ర వాహనముపైన ..... 

సంసార రథ చక్రము సాఫీగా 
నడవవలెనన్న ... చేదోడు వాదోడు 
చేయవల్సినదే ఆడకూతురైనా ... 
అంతోటి ... ఇంతోటి పని ఏదైనా ... 
వేన్నీళ్ళకు చన్నీళ్ళ వలె .... 

నగునూరి రాజన్న 

ఈ శ్వాస నీ కోసం తేది : 09-02-2023 శీర్షిక : నమో పరంధామా .

 ఈ శ్వాస నీ కోసం 

తేది : 09-02-2023
శీర్షిక : నమో పరంధామా . 
కవితాసంఖ్య : సహస్రాధికం 

పూర్వ బంధమో ... పుణ్య ఫలమో ... 
ఉన్నపళమైన ఊసుల మయం కాదు 
ఉచితమో ...కాదో చెప్పడం ...కానీ ... 
ఉడతాభక్తిగా ఉన్నది నివేదించడమే ... 

బ్రహ్మ లిఖితమో బ్రాహ్మణ ఆశీర్వచనమో 
సతతం నీ మననమే ఓ మహాత్మా 
పగలు పనిలోనూ ... నిశీధి నిద్రలోను ... 
చిత్తానికి కొక్కెమేసి లాగినట్టు ....  

ఎన్ని మార్లు దర్శించినా .... 
అన్ని మార్లు కోరిక తీరక ... మరోమారు 
మరోమారంటూ మానసం మారాము 
చేస్తూనే ఉంటుంది.... 

నామమెత్తుకుంటే.... భావం 
హోమ ధూమంలా శ్వాసల పరిమళం .... 
రూపం చూస్తుంటే ... మొహం 
తీరక కుసుమ వనాల సుందరం ... 

సర్వస్య శరణాగతి శ్రేష్టమని ... 
దాసోహమే సరోత్క్రుష్టమని .... 
నమో పరమాత్మా... నమో పరంధామా... 
పరమాణువునైన నా ఈ శ్వాస 
నీ కోసమే...స్మరణ పునశ్చరణలే 
ముక్తికి మార్గమని నమ్మినాను ....    

నగునూరి రాజన్న 

కాశీనాథుని విశ్వనాథ్ తేది: 03-02-2023.

 కాశీనాథుని విశ్వనాథ్

తేది: 03-02-2023. 

కళామతల్లికి ముద్దు బిడ్డడు 
సినీ రంగానికే మహారాజు .... 
తోడికోడళ్ళుతో అడుగిడినా 
ఆత్మగౌరంతో నిలబడినాడు ... 

సిరిసిరి మువ్వల రవములతో 
జలతారుల్లో సిరి తానై కురిసాడు
నిరక్షరాస్యురాలైన సీతామాలక్ష్మికి 
నీరాజనాలను అందించాడు .... 

శంకరాభరణంతో జనుల మనములో
శంకలన్నీ తీర్చేసి... కళలకు కాలం 
చెల్లిపోలేదని... కణికట్టుగ కథలను 
జోడించి కమనీయతలను కూర్చాడు. ... 

ఒక్కొక్క చిత్రమును స్వాతిముత్యంలా 
ఒడిసిపట్టి తపస్సు చేసిన మహర్షి .... 
సిరివెన్నెలతో చల్లదనాలను  కురిపించి 
సాగరసంగమంతో సరిగమలు పలికించాడు.... 

అంకితతత్వమే ఆతని పెట్టుబడి 
సంస్కృతికి సదా పట్టం కట్టి ... 
సంప్రదాయానికి పెద్ద పీట వేసి... 
విలువలున్న వలువలనే ధరించాడు..... 

సాంఘీక సమస్యలను సైతం  సున్నితంగా 
ఎప్పటికప్పుడు స్పృశిస్తూ మెప్పించిన ధీశాలి .... 
పుష్కలమైన పురస్కారాలతో బాటుగా
సుందరమైన నందులెన్నో పొంది 
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పద్మశ్రీతో 
సత్కరించబడినాడు .... 
 
నగునూరి రాజన్న 

హైకూలు తేది: 15-02-23

 హైకూలు 

తేది: 15-02-23

పల్లె జీవనం
పట్నపు వీధులలో… 
వలస జీవి

నిజం చాటైతే
అబద్దం ఊరేగును
పారాహుషార్… 

ఈ రోజులలో 
రాజకీయమంతయు 
ఒళ్ళమ్ముతోంది

చెత్తకుప్పలు
బాల్యాన్ని దోచుకుంటే…. 
పేదబతుకు

ఉప్పుకల్తీలు
చప్పటి నీళ్ళు కల్సి… 
ఆరోగ్యదాడి

ఊహించని వరం తేది: 15-02-23 శీర్షిక: నా జీవితమే .....

 ఊహించని వరం

తేది: 15-02-23
శీర్షిక: నా జీవితమే ..... 
కవిత సంఖ్య: సహస్రాధికం 

పల్లెలో పరిమళించిన జీవితం 
నిరక్షరాస్యతల నడుమ నిలిచినా .... 
ఒకటొకటిగ  చిక్కులన్నీ ఒద్దికగా 
విడదీసుకుంటూ ....పిల్లలను 
మరో మెట్టెక్కించాలనే తపనలతో 
చదువులవైపు పురికొల్పిన వైనం .... 

ఉద్యమాల గాలి ఊపిరాడనీయక 
పోయినా .... పట్టుదలలే ప్రాణవాయువులుగా  
పెట్టుబడి చేసుకుని... అడుగులో అడుగులు 
వేస్తూ ... తడబడక పట్టుబట్టి సాధించిన 
పట్టభద్రతలు ... 

బతకలేనోళ్లే బడిపంతుళ్ళంటూ ....   
ఉద్యోగాలను ఊదురు పుల్లలాగా 
తీసేస్తున్న రోజుల్లో .... ఊపిరి ఉగ్గపట్టుకుని 
చిన్న మొత్తాలతోనే చింతలను దరి 
చేరనీయక ... ఆత్మస్థైర్యాలను పొదువుకుని 
అడుగులేసి బడుగుతనాలను ఎదిరించి 
నిలిచిన రోజులు ..... 

నవ్విన నాపచేను పండినట్టుగా  .... 
నత్త నడకల జీవితం ... పరుగులు 
పెట్టి ... పిల్లల ఉద్యోగాల పుణ్యమాని 
గగనపు వీధులలో తేలియాడుతూ 
ఖండాంతరాలు కలియ తిరగడం 
ఊహించని వరమే ... మా అమ్మానాన్నల 
కడుపున పుట్టడం ..... 

నగునూరి రాజన్న 

యాతం గూడ మోట

 యాతం  గూడ   మోట


పారే జలధారలను పట్టి బంధించి 
పంట పొలాలకు పారించడానికై… 
పచ్చదనాలను పొదగడానికి 
పగడపురాశులు పండించడానికై…
లోతునున్న నీటిని గట్టుపైకి తేవడం .... 

మనిషి చేసిన నాటి నీటి మర
రైలు గేట్ లాంటి గెడ కర్రకు మరో కర్ర  
నిలువుగ జత చేసి .... కర్రకు తాళ్లతో
కట్టి బంధించగ బొక్కెన తగిలించి... 
నిట్ట నిలువు కర్రకు సమాంతరంగా 
తాను నిలబడి బొక్కెన నీటిలో ముంచి 
పైకెత్తుతూ ....ఎత్తి పోయడమే యాతం ..... 

 
కొద్దిపాటి లోతు తేడాతో నీరుంటే .... 
కొలను గట్టి నీటినంతటిని పోగేసి…
ఇద్దరేసి మనుషులు ఇరు వైపుల 
తాళ్లతో కట్టిన అండాకారపు బొక్కెనతో 
నిండుగా నీరెత్తి ... గట్టుపైకి తాళ్లతో 
విసరడమే ...గూడ .... 

పెద్ద పెద్ద మొత్తాలలో నీటిని లోతు నుండి
ఎత్తి గట్టుమీద కుమ్మరించుటకై ....రెండు 
ఎద్దుల సాయంతో ....ముందుకు...వెనకకు 
నడుస్తూ.....గిలకపై నుండి దందెడతో 
దండిగా బంధించిన నీటి గుమ్మటాన్ని.... 
తోలు సంచి తొండముగా కట్టి ఎత్తిపోయడమే .... 
మోట కొట్టడం .... 
 


నగునూరి రాజన్న 

ప్రేమ పెళ్లి తేది : 14-02-23 శీర్షిక : సంస్కరించుకోవడం ...

 ప్రేమ పెళ్లి 

తేది : 14-02-23
శీర్షిక : సంస్కరించుకోవడం ... 

పరిచయాల వర్ణమాలకు 
మమతల గంధపు మాటలద్ది  
ఆత్మీయత కుసుమాల వాక్యాల 
జోడింపుల మూటలు గట్టి పుటలన్నీ 
నింపడమే ...... 

నింపిన పుటలలోని ముగ్ధ భావాలకు 
రాగం ఒక్కటైతే ... అడుగులు కలిపి 
ఏడేసి ....ముడులు మూడైతే ....జీవన 
పయనమంతా వెలుగులు నింపడమే .... 
కలకాలం నీతోనేనని బాసలు చేస్తూ ...

ప్రేమించిన మనిషితో పెళ్లి 
జీవించిన కాదా అమరత్వం ... 
కలలను రంగరించి కాచి వడపోసుకుని 
కార్యరూపం దాల్చుకోవడమంటే .... 

అనుక్షణం మననం ... 
ఆరాటాల మధనం .... 
అడుగువేస్తే సాధనం .... 
ఆలోచనల పందిరి వేసి 
గమ్యపు చేరికకు గమనం సాగిస్తే .... 

కనిపెంచిన తల్లిదండ్రులను 
కనిపెట్టుకుంటూనే  .... 
కట్టుకోబోయే వారిని ఒప్పించి 
సమన్వయ పరచడం.... 

కట్టు బొట్టుల కమనీయం
కళాత్మకమైన శుభ సూచకం
కనుబొమల నడుమ కాంతివలయం
కనికట్టుగ  కట్టిపడేసే హైందవం...

వరుడు వధువులు విశిష్టములై నిలువ
సంస్కృతీ సంప్రదాయ సంపదల
సంస్కరింపబడటమే... ప్రధానమై
ఆయురారోగ్యముల భోగమే అవనిలో
మేలైన భాగ్యమై నిలిచె .....  

మూడు ముళ్ళే ముఖ్య భూమికలయి
సత్సంతాన వ్యవస్థార్థం సంక్షిప్తమయ్యే 
వేదోపనిషత్తుల విస్తృత మార్గదర్శకమైన
ముప్పదారు పెళ్ళిముచ్చట్ల ముద్దు తీర్చే వేదిక ....   

నగునూరి రాజన్న 

ఆ నీలి మబ్బుల దారిలో .... తేది 13-02-2023 శీర్షిక : ప్రజా సంక్షేమం ....

 ఆ నీలి మబ్బుల దారిలో ....

తేది 13-02-2023
శీర్షిక : ప్రజా సంక్షేమం .... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

వర్ష ఋతువులో అల్లన సాగే  
ఆ నీలి మబ్బులు అవనిమాతకు 
అవనిమాతను నమ్ముకున్న 
జీవరాశికి ... ప్రాణవాయువులు .... 

గుంభనంగా సాగే నీలి మబ్బులు 
అవనికి ముచ్చట చెప్పి  ముద్దాడితేనే 
మురిపమై ఆనందాలు పంచేది. 
మట్టికి మనిషికి ఉన్న సంబంధం 
లాంటిది.... 

కాట కలిసిపోకుండా చూసుకోవాలి 
నేల విడిచి సాములా కాకుండా ... 
కర్మసాక్షిగా కర్తవ్యం నిర్వర్తించాలి ... 
కలుషితం కాకుండా కాపాడుకోవాలి .... 

గ్రీష్మంలో భీష్మించిన వాతావరణానికి 
ఎక్కడో పుట్టి ... ఎక్కడో తిరుగుతూ 
ఇక్కడికి చేరుకుంటాయి ... సంచార 
జాతుల బందు బలగంలా .... 

తాత్కాలికంగా నివాసమైనా సరే ... 
ఆనందంతో మురిసిపోగానే ... 
నందనమై విచ్చుకుంటుంది పచ్చలు 
పొదిగిన పుచ్చపువ్వులా అవని మాత..... 

ప్రకృతి మాత ప్రసాదించే వరం 
ప్రజలందరి సంక్షేమమే లక్ష్యం .... 
డేగల్లాంటి పెద్దోళ్ల దిష్టి తగలకుండా 
రక్షించుకోవడం మనందరి కర్తవ్యం .... 

కవన రవళి చిత్ర గజల్ తేది : 11-02-2023

 కవన రవళి 

చిత్ర గజల్ 
తేది : 11-02-2023
6/6/6/6

మనసునిండ నీ రూపం 
నింపినాను ప్రియసఖుడా 
తనువంతా కనులుచేసి 
నిండినాను ప్రియసఖుడా 

సుమశరమూ తగలగనే 
వలపువాన తడిపినదీ
మనసంతా మురిసినదీ 
తలచినాను  ప్రియసఖుడా ... 

అపురూపపు ఆలోచన 
ఆనందం నింపినాది
కలలలోన కవ్వించగ 
వేగినాను ప్రియసఖుడా... 

మూగబాధ భావనలను 
గుండుమల్లె వింటున్నది 
తమకంతో  వివరించగ 
కలచినాను ప్రియసఖుడా ... 

నీదానిగ  గైకొమ్మని
రాజసమై వలచినాను 
గాంభీర్యం పొదువుకుని 
వేచినాను ప్రియసఖుడా ... 

నగునూరి రాజన్న 

ప్రేమ గీతాలు తేది : 05-11-2022 శీర్షిక : ఇదేనేమో ....

 ప్రేమ గీతాలు 

తేది : 05-11-2022
శీర్షిక : ఇదేనేమో .... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ప్రేమంటే ఇదేనేమో 
ఇలాగే ఉంటుందేమో ... 

ఆలోచలల్లుకుని 
కులుకు పలకరిస్తోందా ... 
అవనిమాతా మీదా 
కాలు నిలవనీయదా ... 

మదిలోన పదిలమై 
మననంతో ఘనమవుతూ 
తరువు గాలి సైతం  
తపన వేడినిస్తుందా .... 

ప్రేమంటే ఇదేనేమో 
ఇలాగే ఉంటుందేమో ... 

మత్తు ఏదో  ఆవరించి 
మధురిమలు పంచుతూ 
సెలయేటి గలగలల 
జలతారు మీటుతుందా .... 

కూ అంటే కుహూ  అంటూ 
కుతూహలం పెంచేసి 
కొండ కోన కోటి ధ్వనుల  
సంగీతమౌతుందా ...  

ప్రేమంటే ఇదేనేమో 
ఇలాగే ఉంటుందేమో ... 

మనసంతా నిండుకుని 
పరవశాల పులకరింపు ... 
కుసుమ కోమలం కూడా 
కుదురుగ తోచనీయదా .... 

పరధ్యానం ఆవరించి 
పిలుపులకు పలకలేనా ... 
పెన్నిధిలా పెనవేసుకుని 
సన్నిధిలా తోడుంటుందా ... 

ప్రేమంటే ఇదేనేమో 
ఇలాగే ఉంటుందేమో ... 

గుండె అంతా బరువెక్కి 
గుక్కబట్టి తపిస్తుందా .... 
హృదయమంత ఆవరించి 
హరివిల్లుగ తోస్తుందా...

మెలకువలో కలవరిస్తూ 
కలలోన విహరిస్తానా .... 
నన్ను నేను మరిచిపోయి 
మయూరాన్ని అవుతానా...  

ప్రేమంటే ఇదేనేమో 
ఇలాగే ఉంటుందేమో ... 

అద్దంలో చూసుకుని
నాకు నేను మురుస్తానా .... 
ఎవరెవరినో  పిలిచినా
కోయిలలా పలుకుతానా .... 

మనసంతా విచ్చుకుని
విరిసే పువ్వై తోస్తుందా ... 
హృదయమంతా పరుచుకుని 
గువ్వలా ఎగురుతానా .... 

ప్రేమంటే ఇదేనేమో 
ఇలాగే ఉంటుందేమో ... 

నగునూరి రాజన్న 

చిత్రకవిత తేది : 31-08-2020 శీర్షిక: సాంకేతిక సౌరభం.

 చిత్రకవిత 

తేది : 31-08-2020
శీర్షిక:  సాంకేతిక సౌరభం. 
సంఖ్య : 503


అమ్మలకు హడావుడి లేదు 
అయ్యలకు పరుగు పయనం లేదు 
పాఠ్య పుస్తకాల బరువులు లేవు 
నోటుబుక్కుల్లో రాతలు లేవు.... 

నల్ల బల్లలు నారాజయినయి 
తెల్ల బలపాలు మోటైపోయినయి
ఆట మైదానాల ఊసే లేదు 
బడి బంగళాల జాడలు లేవు ...... 

కలం కాగితాల గలాటా లేదు 
కళ్లన్నీ కంప్యూటర్ తెరలకే 
చెవులన్నీ వినికిడి సాధనాలకే 
గురువైన గూగులమ్మ గుసగుసలకే ....

మనిషి జీవిత గమనాన తరానికో
మార్పు సహజమే అయినా ... 
మహమ్మారి మర్మంతో  
ఉలుకు పలుకు లేకుండానే 
ఉలిక్కిపడి నిలిచిన సాంకేతిక సౌరభం ... 

మార్పులోని మర్మాన్ని నేర్పుగా
పసికట్టి ఓర్పుగా ఒడిసి పట్టి... 
మానవీయత మరుగున పడకుండా
విజయ బావుటా ఎగరేయడమే 
మన ధ్యేయంగా, గమ్య తీరంగా మలుచుకోవాలి..... 

నగునూరి రాజన్న

చిత్ర కవిత తేది : 11-02-2023 శీర్షిక : వ్యసనం ...

 చిత్ర కవిత 

తేది : 11-02-2023
శీర్షిక : వ్యసనం ... 

తనను తాను మరచినదా... ఏమి ?
తనువు పంచుకున్న చిన్నవాడిని 
సైతం.... కాదని తలమునకలయ్యింది 
తలా తోకా లేని ... కాని ... చరవాణిలో ... 

ముసి ముసి నవ్వుల మురిపములే 
ముక్కు మొహం తెలియని వారితో సంభాషణలు...  
ముంచుకొచ్చే ప్రమాదం పసికట్టక 
ముదితకు పిడికిట ఇమిడిన చరవాణితో .... 

సాంకేతికత పెరిగిందని సంబరపడాలో ... 
సందు దొరికితే అనకొండలా మారిపోయి 
మనిషిని సాంతం మింగేస్తుందని భయపడాలో ... 
మితమే మనిషికి హితమని బోధనలు .... 
అతి సర్వత్ర వర్జయేత్  అన్నారు...అయినా 
పెడచెవిన పెడుతున్న దాఖలాలు .... 

ఆలోచనా వివేచనల సంపదలతో 
జీవరాశిలో మిన్నంటూ మురిసిన 
మానవాళి... భస్మాసుర హస్తములా 
అదే ఆయుధమై ....అంతరిస్తుందేమో .... 

గురువనే భ్రమలతో గూగులమ్మతో 
గుసగుసలలో మునిగి తేలితే ....అంతా .   
నీవేనంటూ అన్నింటికీ నీవేనంటూ ... 
చరవాణిపై ప్రేమలు పెంచుకుంటే .... 
కొన్నాళ్ళకు ఆలోచించలేని పుచ్చుపడిన 
మెదళ్లను కొక్కేలకు తగిలించుకోవాలి .... 

అల్పమైన వాటికి దాస్యత్వమే... 
పదే పదే ధ్యానించడమే వ్యసనం ... 
వ్యసనాలకు బానిస కాకుండా....
వ్యసనం బారిన పడకుండా... ఎదగాలి ... 
 
పరికరాల తోడూ నీడలు లేకుండా 
పరిస్థితులను అవపోశన పట్టగలిగి 
విపత్తులను ముందే పసిగట్టే పశు 
పక్ష్యాదులలా మానవాళి  ఎదగాలి ...

నగునూరి రాజన్న 

చిత్ర కవిత ... తేది : 10-02-23 శీర్షిక : కరుణించవే ... ఓ చెలీ ....

 చిత్ర కవిత  ... 

తేది : 10-02-23
శీర్షిక : కరుణించవే ... ఓ  చెలీ .... 

నిర్వహణ : డా చక్రపాణి గారు 
                   శ్రీమణి గారు 

తొలిసారి చూసింది మొదలు 
తొలిచింది చిత్రమై గుండెలో 
మీటింది  రాగమై మనసులో 
కుసుమ కోమల శోభితగా .... 

పూర్వజన్మల  బంధమో .... 
పుణ్య రాశుల  ఫలమో .... 
ఎదురుపడి నను మురిపించావు 
ప్రేమ గులాబివై పెనవేసావు .... 

అరుణవర్ణ సుశోభితమై 
కరుణించగ రావేలా .... 
కువకువలోలికే పక్షిరాజములై 
పయనించెదమా ఆకాశ మార్గాన .... 

నన్ను నేను మరిచిపోయాను 
నీవు మాత్రమే నిండి ఉన్నావు .... 
ఉగ్గపట్టుకున్న ఊపిరితో 
నా శ్వాసంత  నీ ధ్యాసలే ... 

చలనశీలతల గుండె కాస్తా 
లబ్ డబ్  లబ్ డబ్ ల  నిన్నే 
పలవరింతల కలవరిస్తుంటే .... 
ఆగుతుందేమో ... కాదంటే.... 
కరుణించవే ... ఓ  చెలీ .... 

నగునూరి రాజన్న 

పక్క చూపులు తేది : 08-02-2023 శీర్షిక : అమ్మ దయ

 పక్క చూపులు 

తేది : 08-02-2023
శీర్షిక : అమ్మ దయ 
కవితాసంఖ్య : సహస్రాధికం 

మాతా హంసవాహిని వింధ్యవాసిని 
పక్క చూపులో ... కొస చూపులో 
కిరణం మెరియగనే  భరణమై కురిసింది 
మానసంలో కావ్య కన్యకై చిలికింది .... 

అక్షరాస్యత తోట ఆసరా అవుతుందని ... 
కాసుల వేటలో కాలం కలిసి వస్తుందని ... 
విజ్ఞాన వివేకాలు విజయాలు చేకూరుస్తాయని ... 
అమ్మా నాన్నలు ఆరాటపడి .. పంపిస్తే .... 

కాలమంతా కరగదీసి వడియగట్టి 
మణికట్టుకు బలపం కట్టుకుని ఆచార్యులు 
గొంతు చించుకుని... తుమ్మెదలా చెవిలో 
ఇల్లుకట్టుకున్నట్టు అరిచి గీ పెట్టినా  .... 

బుర్రను కొక్కానికి తగిలించి ..ఆలోచనల 
రాశులను కుమ్మరించుకుని ... చూపులు 
గాలాలను ఎక్కడో వేలాడదీసి ....మానస 
మూసను వీధిలో వదిలేసిన .... చందంగా ... 

పరాకంత... చిరాకులనే మిగల్చగా ... 
పట్టుబట్టిన పక్కచూపులు పగబట్టిన
ఫలితమేమో ....  పంతం నెగ్గించుకోగా  
పరీక్షల  కాలాన బిక్కమొఖమేయించినది ... 

నగునూరి రాజన్న 

ఎప్పుడెప్పుడా అని తేది: 07-02-2023 శీర్షిక : ఆధునిక పూరిళ్ళు

 ఎప్పుడెప్పుడా అని 

తేది: 07-02-2023
శీర్షిక :  ఆధునిక పూరిళ్ళు
సంఖ్య : సహస్రాధికం 

ఆ వాకిటంతా కోలాహలమే .... 
ముడుతలు పడిన శరీరాలతో 
సరిగ్గా వినపడీ వినపడక పోయినా ... 
మళ్ళీ మళ్ళీ అడుగుకుంటూనైనా  
ముచ్చటలంటే మూతి చాపే శాల్తీలు .... 

మూలుగుతూ ముక్కుతూ మూడు కాళ్లతో  
తంటాలు పడుతూ లేస్తూ పచార్లు 
కొడుతూ పక్కవారి యోగ క్షేమాలు 
అడిగి తెలుసుకుని ఆనందిస్తూంటారు .... 

జారిపోతున్న కళ్లజోళ్లను సరిచేసుకుంటూ 
చిట్లించిన కళ్ళతో  బంధాల తాలూకు 
తీగలకోసం... అల్లంత దూరాలను తేరిపార
చూస్తూనే  .... వాలిపోతున్న పొద్దులు....  

చేజారిపోతున్న ఆత్మీయతలను 
చీర చెంగున ముడి వేసుకున్న తీరున 
తడిమి తడిమి తండ్లాడుకుంటూ చూసుకుని 
పొగిలి పొగిలి ...లోలోపలి మాటలతోనే  
కుములుకుని ... చంపలపై జాలువార్చుకునే 
చాదస్తపు శాల్తీలు .... 

కడుపులు కట్టుకుని ... కపటత్వం 
లేకుండా.... కన్నవారికి కడుపులు 
నింపిన స్వార్థమెరుగని సరంగులు ... 
కర్మ కాలి కాలు కాలిన పిల్లులై ... కలియ 
తిరుగుతున్నారు .... 

మానవ బంధాలను మలినపరుస్తూ 
ఆర్థిక బంధాలే అంతా  అనుకుని 
అర్రులు చాపుతున్న పిల్లల అమ్మలు.... 
అయ్యలకు  ఆశ్రయం ఇస్తున్న 
ఆధునిక పూరిళ్ళు ...వృద్ధాశ్రమాలు....  

ఎంతోమంది  ఎపుడెపుడా అని 
 ఎదురుచూస్తూనే ఉన్నారు .... 
ఇకనైనా ఇలాంటి వృద్ధాశ్రమాల 
సుద్దులు సద్దుమనగాలని ... 
కడుపుల పెట్టుకుని చూసుకునే 
కన్నబిడ్డల ప్రేమలో తరించాలని ... 
ముసలి కళ్ళల్లో కాంతులీనాలని .... 

అతి త్వరలో ఆశ తీరుతుందని .... 
అందరి ఆశయం నెరవేరుతుందని... 
ధనాత్మకంగా ఎదురుచూద్దాం....  

చిత్రకవిత తేది: 06-02-2023 శీర్షిక : మన్మథ సమ్మోహనం .... 1100

 చిత్రకవిత 

తేది: 06-02-2023
శీర్షిక : మన్మథ సమ్మోహనం .... 
కవిత సంఖ్య : సహస్రాధికం . 

నల్లనయ్య వేళ్ళన్నీ ధీమాగా నాట్యమాడగ  
నవరసాలను పలికించే సప్తస్వరాలను 
సంధించగ హస్తములలో బందీ అయి 
సుషుప్త చేతనావస్థలను చేధించే వేణువు .... 

అల్లంత దూరం నుండి రాగం 
వినపడగానే ఒళ్ళంతా తుళ్లింతలే ... 
మనసు పరవశాలే ... మననమంతా 
మమతల తీగలే ....కన్నయ్య కమనీయమే ... 

రేపల్లెలో చెట్టు చేమ పుట్ట గుట్ట అన్నింటా 
సుపరిచితమైన సురుచిర సరాగమే ... 
మదిని తట్టి పరవశాలను కుమ్మరించే 
మన్మథ సమ్మోహన  సమానమే .... 

మూగమనసులను సైతం ముగ్దమై 
రంజింపజేసే ముచ్చటైన వేణువు.... 
ఆధ్యాత్మికతలను సైతం అలవోకగా 
ఆస్వాదింపజేసే అసలైన ఆయుధం ... 


నగునూరి రాజన్న 

బాలల గేయం తేది: 04-02-2023 శీర్షిక : వినరండోయి

సమూహ సంఖ్య: 41 
అంశం : బాలల గేయం 
తేది: 04-02-2023
శీర్షిక : వినరండోయి
సంఖ్య : సహస్రాధికం 

వినరండోయి వినరండోయి 
బాలల్లారా వినరండోయి 

భావి పౌరులు మీరండి  
భవితను తీర్చి దిద్దుకోండి...  
అమ్మానాన్నలు  ఆదిదైవం 
ఆదరిస్తూనే  జీవించండి .... 

వినయాలను అక్కునచేర్చుకుని 
విధేయతలను పాటించండి... 
విద్యలు నేర్పే గురువులను 
విరివిగా మీరు గౌరవించండి ... 

వినరండోయి వినరండోయి 
బాలల్లారా వినరండోయి... 

పరిశుభ్రతలను పాటించి 
పరిమళాలను వెదజల్లండి ... 
వ్యాయామాలకు పెద్దపీటతో 
ఆరోగ్యాలను కాపాడండి .... 

బడిబాటలలో బాల్యమంతా 
అన్నదమ్ములుగ మెదలండి...  
నీతి నియమం రెండు కళ్లుగా 
ధర్మం న్యాయం ఆచరించండి ... . 

వినరండోయి వినరండోయి 
బాలల్లారా వినరండోయి 

సంస్కృతిని గౌరవిస్తూనే 
సంప్రదాయం  ఆచరించండి ....
పరమత సహనం పాటిస్తూనే  
సర్వులనుఁ ఆదరించండి .... 
  
సమర వీరుల చరితలన్నీ 
సగౌరవంగా  చదవండి ...  
నిత్యం మీరు ప్రేరణ పొందే 
స్వచ్ఛ చరితలు తెలియండి... 

వినరండోయి వినరండోయి 
బాలల్లారా వినరండోయి 

పిట్ట కొంచెం కూత ఘనంలా 
పెద్ద  కలలనే  మీరు కనండి ... 
కార్యదీక్షులై కద లి రండి ...  
కలాములాగ  ఎదగండి ... 

పూరించండి శంఖారావం 
శ్వాసించండి దేశభక్తిని .... 
వినమ్రతలను అభ్యసించి 
విజయాలను  సాధించండి .... 

వినరండోయి వినరండోయి 
బాలల్లారా వినరండోయి 

నగునూరి రాజన్న
కరినగరము 


కవన రవళి చిత్రానికి గజల్ తేది : 04-02-2023

 కవన రవళి 

చిత్రానికి గజల్
తేది : 04-02-2023
మిశ్రగతి  34 34 34 34  

మొదటి సారిగ చూసినానులె 
ప్రియా నీవే   ప్రేమదేవత 
మనసు దోచిన మహా రాణిగా 
చూసు కుంటా ప్రేమ దేవత 

ఎన్ని జన్మల  బంధమోకద
ఎరుగనైతీ  నా ప్రియసఖీ 
వలచి వచ్చిన భామామణిని 
ఏలుకుంటా ప్రేమదేవత 

ఎదను తాకే ప్రేమ ఊసులు 
జవ్వనినోట వింటూంటాను 
గుండెలలోన  గుడిని కట్టించి 
పూజిస్తుంటా ప్రేమదేవత 

దరహాసాన  చిరునవ్వునూ 
తొలగనీయక చూసుకుందును 
కనులలోనా కాంతులన్నియు 
కాచుకుంటా ప్రేమదేవత 

కౌగిలిలోన కరిగిపోయే 
కాంతామణికి దాసుడిగానె 
కాలంమరిచి  తోడునీడగా 
దాపునుంటా  ప్రేమదేవత 

నగునూరి రాజన్న 

బాల గేయం తేది: 29-08-2020 శీర్షిక : ప్రబోధము

 బాల గేయం    

తేది: 29-08-2020
శీర్షిక : ప్రబోధము
సంఖ్య : 502 

బాలల్లారా రారండి 
మంచి మాటను 
వినరండీ 

అమ్మానాన్నల 
ఆశయాలుగా
చదువుల బడికి
తరలండి ......

గురువుల మన్నన
పొందండి 
చదువులు దండిగ 
నేర్వండి       // బాల // 

ఆటలు పాటలు
ఆడండి
ఆరోగ్యాలను ఒడిసి 
పట్టండి.....    

స్వతంత్ర వీరుల
తెలియండి
రేపటి పౌరులుగ
ఎదగండి.     // బాల// 

చెట్లను బాగా 
నాటండి .....
శుచి శుభ్రతల
పాటించండి. 

చుక్కల్లా మీరు 
మెరవండి 
మొక్కల్లా ఎపుడు
ఎదగండి     // బాల //

వ్యవసాయాన్ని
గమనించండి 
రైతు క్షేమం  
కోరండి    

జవాను వీరుల
మరవద్దు
భరత మాతకు 
ప్రణమిల్లండి //బాల// 

నగునూరి రాజన్న

మధురమైన వ్యధ తేది :03-02-23 శీర్షిక : ఖండం దాటిన కన్న పిల్లలు

 మధురమైన వ్యధ

తేది :03-02-23
శీర్షిక : ఖండం దాటిన  కన్న పిల్లలు 
కవిత సంఖ్య : సహస్రాధికం 

గుర్తుకొస్తున్నాయి ఆ మధురక్షణాలు 
మమతల పందిరిలో సేద దీరిన 
మరువ ధవనాల మల్లెగులాబీ వాసనలు 
మరిచిపోలేని భవ బంధాల సుందరం ..... 

మననంతోనే మనసు పరిమళభరితమై 
కనిన క్షణముననే  కనులు వర్షించి 
తనువంతా పులకరింపులమయమై 
హృదయకమలం విప్పార్చుకునేది ..... 

పాలకుల పట్టింపులేనితనమో... 
పగబట్టిన పరిస్థితుల మాయలో ....  
అర్హతలన్నీఅగ్రగామిగా  పొదువుకుని 
అర్ధాకలికి జవాబులు చెప్పలేక .... 

పస్తుంచలేని పొట్టలను చేతపట్టుకుని ... 
ఖండం గాని ఖండాలన్నీ దాటుకుని
అనుక్షణం కన్నవారిని మననం చేసుకుంటూ 
రోజులు వెళ్లదీస్తున్న రోజ్ గార్  ప్రేమికులు .... 

గొప్పలకు గోత్రనామాలుగా నిలిచినా 
ప్రతీక్షణం కన్నవారిని కళ్ళల్లో నిలుపుకుని 
కడుపులు నింపుతున్నాననే తృప్తిని 
బాసటగా చేసుకుని బతుకుతున్న బాటసారిని ....  

నగునూరి రాజన్న 

అలజడుల ఆవాసాలు తేదీ 31-01-2023 శీర్షిక : నాగరికతకు అవతలి తీరం

 అలజడుల ఆవాసాలు 

తేదీ 31-01-2023
శీర్షిక : నాగరికతకు అవతలి తీరం 
కవిత సంఖ్య : సహస్రాధికం 

నాగరికతలకు అవతలి తీరం 
నదీమతల్లుల ఒడిలో సేద దీరే మాలోకం ...  
పూటల కొద్దీ  పస్తులున్నా సరేగాని  
మాటలు పోనీయని పెద్ద తనం  .... 

భూమి పుట్టా.... మాతృ సమంగా 
చెట్టు చేమ ..దగ్గరి చుట్టంలాగా 
వాగు వంకలు  ... వరసైన బంధు మిత్రులుగా 
పశువు పక్షి ....రాయి రప్పయినా  
గుట్ట బోరైనా  ... ప్రాణ మిత్రులుగా 
సల్లగుండాలని కోరుకునే మనస్తత్వం ... 

నడిచి నడిచి నాగరికత..... 
నదీమ తల్లి సిరులను చూచింది .... 
పుచ్చ పువ్వులా వెలిగి పోతున్న 
పచ్చని లోకం చూడగానే ... 
కళ్ళల్లో నిప్పులు పోసుకుంది ..... 
రాయి రప్పలను చూడంగానే 
స్వార్థం బుసలు కొట్టింది .... 

ఇంకేముంది....ప్రజలందరి పేరు 
చెప్పి పంచాయితీ పెట్టింది ... 
ప్రభుత్వం దఖలు పరిచిన ఫత్వాలను 
చూపించి ... డొక్క నిండని బక్కోడని 
చూచి వెక్కిరించింది ...బలాన్ని బలగాన్ని 
నడిపించి... బంగళాకు  దారి వేసింది ... 
అత్యాశల గుర్రాలను రంగంలోకి 
దింపి అంతా తానేనని ఢంకా బజాయిస్తూ 
అక్కరలేకున్నా అలజడులకు 
ఆజ్యం పోస్తున్నది .... 

నగునూరి రాజన్న 

ఒక్క మాట తేది:01-02-2023 శీర్షిక : ఒక్కటంటే ఒక్కటే మాట

 ఒక్క మాట 

తేది:01-02-2023
శీర్షిక : ఒక్కటంటే ఒక్కటే మాట 
కవిత సంఖ్య :  211

సనాతనమైనా ... సంప్రదాయమైనా ... 
సవినయముగా సన్నుతించె కదా ... 
నిజమెప్పటికైనా నిప్పుల వర్షమేనని .... 
స్వార్థాలను వదలమని సంకేతిస్తూ.... 

సంఘమైనా...దేశమైనా ..ప్రతినిధులంతా 
సగటు మనిషికన్నా సమున్నతమే కదా ... 
ఇంత  చిన్న లౌక్యాన్ని తర్కాన్ని  గాలికొదిలి 
కోటరీల కనుసన్నలలోనే  కిరీటాలు 
పెట్టుకున్నంత  మాత్రాన ...విలువలేల ? 

కాలం కరుణించి కకావికలమైన 
దేశమాతను... వేలు ... లక్షల వీరులు 
తమ దేహాలను తృణప్రాయంగా సమర్పిస్తేనే 
ప్రజా స్వాతంత్య్రం ఫరిడవిల్లినది .....  

బంగారు బాల్యం గుర్తుకొస్తే విలువల వలువలు 
తొడుక్కున్నామన్న సంతృప్తి కలగాలి .... 
కానీ అదేమిటో ....భారతమ్మ బాల్యం నిండా  
ముచ్చటలన్నీ ముచ్చెమటలు పోయిస్తున్నయి ... 

భూస్థాపితమై పోతుందనుకున్న భూతకాల
విషయాలు ఒక్కొక్కటిగా భూతద్దాలలో 
చూస్తుంటే...స్తుతించిన నోటితోనే...రోతతో   
గతించిన ఆనవాళ్లతో  మతి చలిస్తున్నది .... 

ఇంత జరుగుతున్నా ...ఇంగితం మరిచిన 
వర్ధమాన నాయకగణం ... వర్తమానంలో 
మారతారనుకుంటే.... మన అమాయకతలతోనే మరో 
భవితల చరితకు శ్రీకారం చుడుతున్నారు .... 

ఇకనైనా ... ప్రజాతంత్రం... మేల్కొని 
ఎప్పటికప్పుడు పక్కాగా లెక్కలు సరిచేసే 
బొక్కలు పూడ్చడం నేర్చుకోవాలి .... 
తక్కెడ మొగ్గు చూపకుండా నిక్కచ్చిగా ... 

చేతులు కాలాక ... ఆకులు పట్టుకోకుండా.. 
సహాయ నిరాకరణలతో షెడ్యూళ్లను సర్దుతారో ... 
సత్యాగ్రహములు చేసి  సూత్రాలను నిగ్రహిస్తారో .... 
ఉద్యమాలతోనే  ఊదరగొడతారో ....

పాలక వర్గాల ఇనుప సంకెళ్ళ పట్టునుండి 
పవిత్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి  
కావాల్సిన పాలనా మార్పులను కాముక చేసుకొని 
తీరవల్సిందిగా ఒక్కటంటే ఒక్కటే మాట .... 
 
నగునూరి రాజన్న 

ఒక వేడుకోలు తేదీ 31-01-2023 శీర్షిక : అవును వాస్తవం....

 ఒక  వేడుకోలు

తేదీ 31-01-2023
శీర్షిక : అవును వాస్తవం.... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

సనాతనమైనా ... సంప్రదాయమైనా ... 
సవినయముగా సన్నుతించె కదా ... 
నిజమెప్పటికైనా నిప్పుల వర్షమేనని .... 
స్వార్థాలను వదలమని సంకేతిస్తూ.... 

సంఘమైనా...దేశమైనా ..ప్రతినిధులంతా 
సగటు మనిషికన్నా సమున్నతమే కదా ... 
ఇంత  చిన్న లౌక్యాన్ని తర్కాన్ని  గాలికొదిలి 
కోటరీల కనుసన్నలలోనే  కిరీటాలు 
పెట్టుకున్నంత  మాత్రాన ...విలువేల ? 

కాలం కరుణించి కకావికలమైన 
దేశమాతను... వేలు ... లక్షల వీరులు 
తమ దేహాలను తృణప్రాయంగా సమర్పిస్తేనే 
ప్రజా స్వాతంత్య్రం ఫరిడవిల్లినది .....  

బంగారు బాల్యం గుర్తుకొస్తే విలువల వలువలు 
తొడుక్కున్నామన్న సంతృప్తి కలగాలి .... 
కానీ అదేమిటో ....భారతమ్మ బాల్యం నిండా  
ముచ్చటలన్నీ ముచ్చెమటలు పోస్తున్నయి ... 

భూస్థాపితమై పోతుందనుకున్న భూతకాల
విషయాలు ఒక్కొక్కటిగా భూతద్దాలలో 
చూస్తుంటే...స్తుతించిన నోటితోనే...రోతతో   
గతించిన ఆనవాళ్లతో  మతి చలిస్తున్నది .... 

ఇంత జరుగుతున్నా ...ఇంగితం మరిచిన 
వర్ధమాన నాయకగణం ... వర్తమానంలో 
మారతారనుకుంటే.... మన అమాయకంగానే మరో 
భవితల చరితకు శ్రీకారం చుడుతున్నారు .... 

ఇకనైనా ... ప్రజాతంత్రం... మేల్కొని 
ఎప్పటికప్పుడు పక్కాగా లెక్కలు సరిచేసే 
బొక్కలు పూడ్చడం నేర్చుకోవాలి .... 
తక్కెడ మొగ్గు చూపకుండా నిక్కచ్చిగా ... 

చేతులు కాలాక ... ఆకులు పట్టుకోకుండా.. 
సహాయ నిరాకరణలతో షెడ్యూళ్లను సర్దుతారో ... 
సత్యాగ్రహములు చేసి  సూత్రాలను నిగ్రహిస్తారో .... 
ఉద్యమాలతోనే  ఊదరగొడతారో .... 
కావాల్సిన మార్పులను కాముక చేసుకొని 
తీరవల్సిందిగా ఒక వేడుకోలు .....అవును వాస్తవం....  


నగునూరి రాజన్న 

ఒక సయోధ్య కోసం తేదీ 01-02-2023 శీర్షిక : సాధు గుణములు పొదువుకుంటే ...

 ఒక సయోధ్య కోసం 

తేదీ 01-02-2023
శీర్షిక : సాధు గుణములు పొదువుకుంటే ... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

అహం దుప్పటి కప్పుకున్నవాడికి 
స్థాయి మరిచి సాము చేసేవాడికి 
నెత్తిమీద మొట్టికాయ పడినప్పటికీ 
ఫలితాల అంచనా లెక్కలేని తనమే ... 

బూచీలు చూపిస్తూ పేచీలు పెట్టి 
కన్ను మిన్ను కాననీయని తనంతో 
కథా ... కమామీషులు  నడిపిస్తూ.... 
పరోక్ష సన్నివేశాల పడగలతో ... 
మనుషులు.... భావాలు .... ప్రత్యక్ష 
చర్యలకు ఉసిగొలిపుతూ....తమాషాలు 
తక్కెడలో పోసి లెక్కలు చూస్తుంటాయి .... 

గడ్డ మీద కూర్చుని కాకమ్మ 
కథలెన్నయినా చెప్పవచ్చు .... 
అనుభవిస్తున్న వాడికి మాత్రమే... 
కష్టముయొక్క సాంద్రత తెలిసేది .... 
నష్టముయొక్క బాధలు బాధపడేది ... 

సగటు ప్రజలను బలి పశువులను చేస్తూ...  
సంకుచిత స్వార్థాల మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ .... 
యుద్దములో కూడా సిద్ధమయ్యే 
లాభ నష్టాల బేరీజులు వేసుకునే సన్నాసులు 
కొంతమందయితే ..... 

స్వార్ధము నీడను తాకని తపోధనులై
తమ పర భేదములు చూపని మహాత్ములై
సర్వే జనా సుఖినోభవంతు అని 
మనసారా కోరుకునే సాధు గుణములు 
పొదువుకుంటే....సయోధ్యల సాధన
ఫలితం మన స్వాతంత్య్ర సమరంలో 
సాధించిన విజయంలా గోచరించదా... 
 
నగునూరి రాజన్న 

సబ్కో సన్మతి దే భగవాన్ తేది : 30-01-2023 శీర్షిక : యుగానికొక్కడు....

 సబ్కో సన్మతి దే  భగవాన్

తేది : 30-01-2023
శీర్షిక :  యుగానికొక్కడు.... 
కవిత సంఖ్య : సహస్రాధికం   

తమ పర భేదమెరుగక తనువు 
సమర్పించిన స్వాతంత్య్ర సమర 
యోధుడు.... 

అల్లనల్లన మెల్లగా సాగిపోతూ 
అలితేరుతున్న స్వాతంత్య్ర సమర 
పోరుల సందళ్ళ సెలయేళ్ళను...  
సంద్రపు అలల లాంటి సత్యం ...అహింస 
ఆనకట్టలతో ఒకటి చేసి ...అనుసంధించాడు ... 

బక్కోడేలే ఏంచేస్తాడనుకున్న 
ఆంగ్లేయులకు చుక్కలు చూపించాడు ...
దిక్కులన్నీ పిక్కటిల్లేలా ఒక్కటి చేసి 
బానిసలనుకున్న భారతీయుల సత్తా 
చాటాడు.  

సహాయ నిరాకరణ ... సత్యాగ్రహాలతో     
నీతిగా... నిజాయితీలకు నిలువెత్తుగా 
నిలిచి .... నెత్తురోడాకుండానే ఆంగ్లేయుల 
మత్తు దించాడు..... 

లెక్కలేనన్ని వేదాలు పురాణాలు 
ఇతిహాసాలు మన సొత్తయినా...మనల్ని 
తెలివితక్కువ వాళ్ళకింద జమకట్టిన 
తెల్లోల్లతో ... సమరమేమి చేయకుండానే 
సంధి కుదిర్చాడు .... 

రఘుపతి రాఘవ రాజారాం...  
పతిత పావన సీతారాంగా  ... 
కొలుచుకున్న ఆత్మీయ దైవచింతనలో 
కూడా...ఈశ్వర్ అల్లా తేరో నాం ..
సబ్కో సన్మతి దే భగవాన్...అంటూ 
ఏకత్వములో భిన్నత్వమును 
జోడించిన యుగానికొక్కడు .... 

ఆయన నడిచిన బాటలు 
ప్రేరణలై పెద్దన్న పాత్రలా 
వద్దన్నా నచ్చి నేడు విశ్వ 
వ్యాప్తమై విరాజిల్లుతున్నవి .... 

నగునూరి రాజన్న 

మాకూ ఒక రోజుంటుంది తేది: 25-01-2023 శీర్షిక : ఓటరు ....

  మాకూ ఒక రోజుంటుంది

తేది: 25-01-2023
శీర్షిక : ఓటరు .... 
కవిత సంఖ్య : సహస్రాధికం 

పైస మందం పరిశ్రమ లేకుండానే 
అనుపానుల ప్రత్యక్ష సాక్ష్యమెరుగని  
అదృశ్య శక్తంటూ ఏదీ లేదని .... 
అంతా నేననే...అహం బ్రహ్మాస్మి ... 

నేననుకునే .... నేను కాని నేనును 
నమ్ముకుని... ఏమి తేకుండా వచ్చి 
ఏమి తీసుకుపోలేనని తెలిసినా .... 
స్వార్థాల సంచులు నింపుకుంటున్నారు .... 

ఉత్తర  దక్షిణాల ఊసులతో 
బంధు బలగాలను కాచుకున్నట్టు 
జన సామాన్యులను పట్టించుకోక 
బలగమే బలమని విర్రవీగుతున్నారు  .... 

మన అనే జనం మాటలు చెవికెక్కించుకోక 
నా  అనే భావనలే హద్దులు దాటించుకుని  
బుద్దుల సుద్దులను దరిచేరనీయకుండా 
అహం ముసుగులో నిగ్గదీసుకుని ... విర్రవీగి 
వీధులలో పతాకం రెప రెపలాడిస్తున్నారు .... 

అవసరానికి కాళ్ళు పట్టుకుని ... 
ఆసీనమయ్యాక .... తీరు మార్చుకుని ... 
నేనే సేనానినని... నేనే మంత్రినని ... 
ఎదురులేని రారాజునని... దర్జాలు 
వెలగబెడుతున్నారు .... మాట్లాడితే 
కొట్లాడి ... తప్పు లేకున్నా ... తప్పులు 
పడుతూ ... తిప్పలు పెడుతున్నారు ... 

భూమి గుండ్రమన్న విషయం 
తెలియనిది కాదు... శిశిరంలో 
తలలు దులుపుకున్న తరువులు 
వసంతంలో చిగురించినట్టు .... 
చీకటి తదుపరి వెలుగులా .... మాకు 
మంచి రోజులొస్తాయని మరిచినట్టున్నారు ... 

చెడుగుడు ఆడించే చెడుకు ... ఒకటి 
రెండు అవకాశాలు చిక్కినా .... మంచికి 
కంచుకోటలా ఎప్పుడూ  అవకాశాలే .... 
గుర్తించి ... నర్తించితే ... ఆనందం ..... 
మాకూ ఒక రోజొస్తుంది .... 

నగునూరి రాజన్న 

వసంత పంచమి తేది : 26-01-2023 శీర్షిక : భారతీ దేవి ... 1094

 వసంత పంచమి 

Saturday, February 10, 2024

74 వ గణతంత్రం తేది : 26-01-2023 శీర్షిక : నా పాఠశాల 1093

 74 వ  గణతంత్రం 

తేది : 26-01-2023
శీర్షిక :  నా పాఠశాల 

ఒకటా...రెండా....అంతకంతకు  
ఇకమతుగా ఇన్నేళ్లు కళ్ళు గప్పిన 
చరితంతా భళ్ళుమని బజారులో 
పడిపోయే సరికి ....ఒళ్ళు హూనం 
అయినట్టనిపించి భుజాలు 
తడుముకుంటున్నది..... 

కపట కల్మషమెరుగని భారతీయం 
ఉసురు తీస్తున్న మాయరోగానికి 
ఉడతాభక్తిగా  వంద దేశాలకు 
ఉచితంగా  వాక్సిన్లను పంపి 
ఉద్ధరించిన విషయం... ఇటు లోపల ... 
అటు బయట ...ఆనందించినా.... 
 
ఉద్యమాల పురిటిగడ్డగా  పేరొంది ... 
నాటి నుండి నేటివరకు  నలిగిపోయి ... 
అంకురించిందన్న ఆనందం కంటే ... 
సంక్రమించని  విద్యావిధానంతో 
ప్రాణవాయువులందక సతమతమైపోతూ
వెంటిలేటర్ పైన వెళ్లదీస్తున్నది బ్రతుకు ... 

పల్లెల్లో బడి బంగళాలు శిథిలమై
జీర్ణావస్థలో కొట్టు మిట్టాడుతుంటే ... 
అక్కరలేని మిరుమిట్లు గొలిపే కొత్త కొత్త 
బంగళాలతో ... కొత్త కొత్త అంతర్నగర
యానములతో  చిత్తవుతున్నది పట్నం 
నుమాయిషు ..... 

ఎందుకో ... కలుపు మొక్కలతో ... 
కంటకాలతో ... మొండి గోడలతో ... 
నా పాఠశాల... మనసును కకావికలం 
చేసింది ... ఈ నాటికి సరైన  సౌకర్యాలు 
లేక ... బాలికలకు బాధలను మిగుల్చుతూనే  ... 

ఏ విషపు కన్ను పడిందో ... నా పల్లె 
ఇంకా  పంతొమ్మిది వందల డెబ్భై 
రొండు లాగానే పుణికి పుచ్చుకున్నది 
ఏ మాత్రం మార్పు కానరాక .... 
ఇరువది రెండున ... మా పూర్వ విద్యార్థుల 
సమ్మేళనం మిగిల్చిన  భావం ...  

నగునూరి రాజన్న 

కళాశ్రీ అహంకారపు పొర తేది : 25-01-23 శీర్షిక : సంకరజాతి ....

 అహంకారపు పొర 

తేది : 25-01-23
శీర్షిక :  సంకరజాతి .... 
కవిత సంఖ్య : 209

సంకరజాతి అంకురములా 
సభ్యత సంస్కారాల మూట 
నెత్తికెత్తుకోకుండా ... మృదుత్వం 
తెలియని మొరటుతనం పొదువుకుని ... 

ఆత్మీయతలకు ఆమడ దూరంగా 
అనురాగాలను అలుముకోకుండా 
ఆప్యాయతలంటే చిరాకుపరాకుగా 
అహంకారాలను  అలంకరించుకుని...  

కానీ కష్టమంటే తెలియకుండానే 
విల్లులా ఒళ్ళు వంచకుండానే... 
కావాల్సినవన్నీ సమకూరిపోయి 
కనులముందు కదలాడుతుంటే.... 

అత్తారింటిలో అల్లుడి మర్యాదలా 
అడిగిందల్లా దొరికిపోతూంటే .... 
అడగకముందే అమిరిపోతూ 
అవసరాలన్నీ తీరిపోతుంటే .... 

ఓడెక్కేదాకా  ఒడామల్లప్పలైపోయి  
ఓడెక్కినాక  బోడ మల్లప్పలా  తయారై .... 
కళ్ళు నెత్తికెక్కి కాననీయని తనంతో 
కత్తులు దూస్తుంది అహంకారపు పొర .. 

నగునూరి రాజన్న 
కరినగరము 

కళాశ్రీ సుభాష్ చంద్ర బోసు 23-01-23 శీర్షిక : శత్రువుల గుండెల్లో శతఘ్ని

 సుభాష్ చంద్ర బోసు

23-01-23
శీర్షిక :  శత్రువుల గుండెల్లో ఫిరంగి 
కవిత సంఖ్య : 208

ఉన్నత ఉద్యోగాన్ని తృణప్రాయంగా 
వదులుకుని ... స్వార్థమెరుగని   
స్వరాజ్య పోరాటంలో అడుగిడిన 
అచంచల మాతృ దేశభక్తుడు .... 

మితవాదపు ఆలోచనావిధానాలు 
మింగుడుపడక పదవులను త్యజించి 
అతివాదపు ముద్ర వేసుకున్న 
అనితర సాధకుడు అకుంఠిత దేశ భక్తుడు.... 

ఆకాశమే హద్దంటూ నిద్ర పోకుండా 
అహరహరం శ్రమించి విశ్వమంతా 
తిరిగి ఎందరినో కట్టుకుని...ఏకంగా 
సైన్యాన్ని నడిపించిన ధీరో దాత్తుడు .... 

రవి అస్తమించని ఘన సామ్రాజ్యమని 
విర్రవీగిన తెల్లోని గుండెల్లో నిద్రపోయి 
కంటిమీద కునుకు లేకుండా చేసిన 
భారతీయ కొదమసింహం ..... 

సింహంలా గర్జించి .... రక్తాన్ని 
ధారపోయండని యువతను కోరి  .... 
స్వతంత్ర్యాన్ని సాధిస్తానన్న..
ఆత్మాభిమానం కలిగిన ధైర్యశాలి ..... 

జననం తెలిసి .... మరణం ఎరుగని 
మహానుభావుడు .... చివరకు 
నా అనుకున్న వాళ్ళ ఆలోచనలకు 
బలైన బంగారు భరత బిడ్డడు .... 

నగునూరి రాజన్న 

కళాశ్రీ చిత్ర కవిత తేది: 20-01-2023 శీర్షిక : ఎవరివో ?

 కళాశ్రీ సాహితీ వేదిక ... 

చిత్ర కవిత
తేది: 20-01-2023
శీర్షిక :  ఎవరివో ? 
కవిత సంఖ్య : 207

కర్ణ కుండలముల కాంతులీనంగా  
నుదుట తీర్చిదిద్దిన సూర్యచంద్రుల 
సూదంటు రాయి చూపులతో నిలిచె 
కొప్పున పూలెట్టుకున్న కోణంగి .... 

చమికీల గాజులు సక్కంగా మెరువంగ 
కంఠమున హారములు కాంతులీనంగా 
జరి అంచు చీరలో జిగినీలు కురువంగా 
ధగ ధగల మెరుపులా దండి దరహాసం .... 

పసిమి వెన్నెలతో పైటను చెక్కి 
చురకత్తుల్లాంటి చూపులతో 
కొమ్మొక చేత కొడవలి మరోచేత 
అచ్చంగా నండూరి గారి వెంకివా ? ... 

చూడచక్కనైన కుందనాల బొమ్మ 
చూపరులను ఆకట్టుకోగలిగే 
అందమంతా  పొదువుకున్న
పదహారణాల తెలుగు పడుచు .. 

కనకాంబరాలు తురిమిన కాంతామణి 
తీరైన కను ముక్కు తీరుతో 
నిర్మలమైన చూపులతో నిలిచిన 
విశ్వనాథులవారి కిన్నెరసానియేమో ... !

ఎవరివో ... నీవెవరివో .... 
సెలవీయగా రాదా ... చెలీ .... 

నగునూరి రాజన్న 

కళాశ్రీ చిత్ర కవిత తేది: 13-01-2023 శీర్షిక : తరుణీమణి .....

 చిత్ర కవిత

తేది: 13-01-2023
శీర్షిక : తరుణీమణి ..... 
కవిత సంఖ్య : 206

చిత్తరువెంత విచిత్రమో
చిత్రకారుని మది లోతులా ... 
బిక్కుబిక్కుమంటున్న మహిళ 
బీరువై భీతిల్లి నిలిచిన తీరు  .... 

విశ్వమెంత విస్తారేమో ... 
విచలిత విచార వదనయై  
వీక్షించుచుండె  వనిత ... 
మోడు వారిన చెట్టు నీడన .... 

కలవరపడి  కలత చెందిన 
కలికి  మనము... కలం పట్టి 
కదం తొక్కితే కాలంతో పోటీ 
పడవచ్చేమోనని సంశయమా ? 

తరువును పోలిన తరుణీమణి 
పరుల సేవలే పరమార్థంగా 
తరాల వారధిగా తనువును 
సమర్పించే సమున్నతం ..... 

అర్ధనారీశ్వరుడై ఆ శివుడు 
బోధించినా ... బాధించుడే 
పనిగా పెట్టుకున్న నరుడు 
యుగాలనుండి ఊరిస్తున్నదే 
కాదనకుండా .. లేదనకుండా ... 
ఇవ్వకుండా కాలయాపనలు ... 

నగునూరి రాజన్న 

కళాశ్రీ చిత్ర కవిత తేది : 06-01-23 శీర్షిక : కుసుమ పొత్తిలి

 చిత్ర కవిత

తేది : 06-01-23
శీర్షిక : కుసుమ పొత్తిలి 
సంఖ్య : 205 

నిర్మలమైన ప్రకృతి ఒడిలో .... 
నిశ్చింతగ టుంగుటుయ్యాల పై 
జో జో పాప జో జో లాలి 
నిదుర పో కన్నయ్యా ...!

చీకూ చింత లేని చిన్నారి నీవు 
అన్నీ మరిచి ఆదమరిచి నిదుర పో
యశోదమ్మ ముద్దుల తనయా ... 
యదునందన  చిన్ని కృష్ణా ... !

నీరెండ కిరణాలు నిను తాకి మురువంగ  
తరువుల పవనాలు తుళ్ళింతలవగా 
తన్మయత్వం చెంది తనివితీరా 
నిదురపోవయ్యా  బలరామ సోదరా ... !

ఏడేడు లోకాలు ఏలవలసి ఉంది ... 
మున్ముందు మురిపించి పాలించవయ్యా ... 
నిదురపో కన్నయ్య నిదురపో నా తండ్రి 
నీలాల కన్నులు నిర్మలింపంగ .... !

మతి భ్రమించే లతల తోరణాలు 
ఒత్తిగిలి పడుకున్న కుసుమ పొత్తిలి 
హాయి గొలిపెనేమో అచ్చెరువుగా ... 
అయినా సరితూగదేమో  అమ్మ ఒడికి  ... 

నగునూరి రాజన్న 

చిత్ర కవిత తేది :23-01-23 శీర్షిక : ప్రకృతి కానుక 1092

 చిత్ర కవిత 

తేది :23-01-23
శీర్షిక : ప్రకృతి కానుక 
కవిత సంఖ్య : సహస్రాధికం 

ప్రకృతెంత రమణీయమో  
పరితపించి పరిచయించ 
ప్రతీది సుమ మనోహరమే 
పరిమళించు పరివ్యాప్తియై .... 

మరకతమై శోభించే పచ్చిక 
బయలు ... కొండా ... కోనలు  .... 
గలగలల హొయలు పోయే 
వాగు ... వంకలన్నీ... గమ్మతులే.... 

హేమంతపు తుషారమైనా 
ఉషోదయాల సీమంతమై 
పూల కొమ్మలై పూసినట్టు 
వెలుగుల రెమ్మలై విరిసినట్టు ...

నిశిలో ఆయుష్షు పోసుకుని 
అల్పమైనా స్వల్పమైనా 
రవి కాంతికి  తుర్రుమనే 
కవి కాంతుల మనోహరం .... 

ముత్యాలై భ్రమింపజేస్తూ 
మురిపాలను పంచే  హిమ 
సోయగములు... ప్రకృతి 
ఒడిలో విరిసిన పరమ విశిష్టమైన 
కానుక .... 

నగునూరి రాజన్న 

యుగళ గీతం తేది :21-01-23 శీర్షిక : ప్రేమ మననం 1091

యుగళ గీతం 
తేది :21-01-23
శీర్షిక : ప్రేమ మననం 
కవిత సంఖ్య : సహస్రాధికం 

పల్లవి ... ఇద్దరు 
క్షణమొక యుగమే 
తలవక నిలవడము  
దినమొక కల్పమే 
మనమున నిలపడము ...  

అతడు :
మరుమల్లెల పరిమళాలే 
కలహంసల కదలికలు 
కుసుమ రాగరంజితమే 
ఎద కోయిల కూతలు ... 

ఆమె :
ప్రేమ అంకురించగనే 
పెదవులపై నర్తించు .. 
సరిగమల  సరాగమై 
సందడుల మనోగీతం 

అతడు 
మనసులోన మననములే 
మధురమైన అనుభూతులు...   
తేనియలా  గ్రోలుటలో 
సుందరమే  భావనలు ..... 

ఆమె : 
పెదవులారు తడబడి .... 
మాట పెగులు మడతబడి 
బిడియంలో గడబిడ 
జీవితమే ముడిపడి ..... 

పల్లవి  ఇద్దరు 
క్షణమొక యుగమాయె 
తలవక నిలవడము  
దినమొక కల్పమాయె 
మనమున నిలపడము ...  

నగునూరి రాజన్న 

మణిదీపం తేది : 14-12-2022 శీర్షిక : మహిళామణులు 1090

 మణిదీపం 

తేది : 14-12-2022
శీర్షిక : మహిళామణులు 

ఆకాశంలో నక్షత్ర రాసులెన్నున్నా 
అశనిపాతం లాంటి చీకటిని పంచే 
అమావాస్యను తరిమికొట్టేంత 
వెలుగులు పంచె వెన్నెల రేడులా  .... 

అందరూ ...అలా అలా బతికేస్తుంటే 
కొందరు మాత్రమే చిచ్చరపిడుగుల్లా 
చెలరేగుతూ చండ్రనిప్పులు కక్కుతూ 
దిక్కులు పిక్కటిల్లే ప్రతాపాలను 
దిగంతాలకు ప్రదర్శిస్తారు.  

నూటికో .. కోటికో .. ఒక్కరులా 
ఓ ఝాన్సీరాణిలా ...ఓ రుద్రమదేవిలా ... 
నాతినన్న భావాలను చెరిపేసి 
జాతి కొరకు మాత్రమే బ్రతుకుతారు .... 

నాడే కాదు ... నేడు కూడా ... 
రూఢిపరిచిన అపర రుద్రమలెంతో 
మంది ... క్రీడలలో....రాజకీయాలలో... 
శాస్త్ర సాంకేతికత రంగాలలో ..... 

వెలలేని వెలుగులు ప్రకాశిస్తూ 
ప్రతివారి జీవితంలో పరితపించి 
దాపున నిలిచే అమ్మైనా ... ఆలైనా 
ప్రత్యక్ష మణిదీపాలు ... నమో నమ:  ... 

నగునూరి రాజన్న 

నీ కోసం తేది : 20-01-2023 శీర్షిక : పరితపనలు ... 1089

 నీ కోసం 

తేది : 20-01-2023
శీర్షిక : పరితపనలు ... 
కవిత సంఖ్య: సహస్రాధికం 

ఏ క్షణాన నిను దర్శించానో 
ఎదలో నిలిచిన చిత్రానివై 
పదే పదే మదిలో తలుచుకునే 
నా పాటకు పదనిసల పల్లవివైనావు  .... 
  
సొంతమని సాంత్వన పొందాక 
జీవిత పయనంలో ...మననమే 
ప్రతి క్షణం ... ప్రతి పనిలో .... 
ఇంటయినా ... కార్యాలయమైనా .... 

అప్పుడప్పుడు బాధ్యతలతో 
సతమతమైనా ... మరుక్షణమే 
మనోఫలకంపై ముద్రించుకున్న 
మంద్రహాసం మదిలో సడి చేసేది ..... 

చిన్న చిన్న ఇబ్బందులలో 
చిందులాడే సమయాన ... నీ 
ఇందువదనమే సుందరమై 
గందరగోళాలను దూరం చేసేది   .... 

ముప్పిరిగొన్న తిప్పల తోటలో 
అలసటలతో   అల్లాడుతుంటే ... 
జ్ఞాపకాల పరిమళాలు అల్లుకుని 
ప్రాణవాయువులై పలకరించేవి  .... 

మనసు దోచిన మాయలో ... 
తొలి చూపుల చిత్రమో ... 
నీ కోసం తలచిన జ్ఞాపకాల 
పుటలన్నీ కుసుమ రాగరంజితమే ....  


నగునూరి రాజన్న 

అప్పుడప్పుడు నేను తేది : 19-01-2023 శీర్షిక : కాలయంత్రంలో సంచారం 1089

 అప్పుడప్పుడు నేను 

తేది : 19-01-2023
శీర్షిక : కాలయంత్రంలో సంచారం
కవిత సంఖ్య: సహస్రాధికం 

వెండి జలతారుల నిండు భాండాగారం 
అపూర్వ నిధి నిక్షేపాలతో ఓలలాడుతూంటే  
సమయ నియమాలను అధిగమించ 
సన్నివేశాలను ఆవిష్కరించుకుంటున్నాను...   

నవ వసంతపు  సంధ్యారాగంలో 
చల్లని మలయమారుత వీవెనలో 
జ్ఞాపకాల పందిరిలో సేదదీరుతుంటే 
పుటలన్నీ దొర్లిపోతూ .... ఒక్కొక్కటి 
పలకరిస్తుంటే .... ఒళ్ళంతా పులకరింతలే .... 

ముందో ...వెనకో ....అందరు చేరే గమ్యమే ... 
అనంతమైన ఆలోచనల కేంద్రాగారం 
పరమ పవిత్రమైన దివ్య సందోహం .... 
ప్రతివారికి అనుభవైక సందర్భం ... 

బాల్యపు పూర్వాశ్రమ మిత్ర బృందంతో 
బాతాఖానీ చేస్తూ అప్పుడప్పుడు నేను 
కాల సమయ సూచీ యంత్రంలో సంచారం 
చేస్తూ ....  తప్పొప్పుల తనిఖీలతో 
ముప్పులేని ఒప్పుల కుప్పగా వెలిగి పోతుంటాను .... 

అలా పుణికిపుచ్చుకున్న అనుభవాల 
దొంతరలలోనే ...ఏరుకుంటే ఎంతో 
చక్కని ఆరోగ్య చిట్కాలుంటాయని 
అనుభవాలన్నీ వల్లె వేస్తున్నాయి .... 

నగునూరి రాజన్న 

విశ్వమంత విశ్వాసం తేది : 18-01-2023 శీర్షిక : స్థిత ప్రజ్ఞత 1088

 విశ్వమంత విశ్వాసం

తేది : 18-01-2023
శీర్షిక : స్థిత ప్రజ్ఞత 
కవిత సంఖ్య: సహస్రాధికం 

శీఘ్రగతి  ప్రాప్యతలని పొందాలని 
అడ్డదారుల్లో చిందులేస్తూ ఆనందాలను 
వెదుక్కుంటుంటే తప్పుడు 
సంకేతమై తిప్పలు కూడా రావొచ్చు ... 

ప్రభవించాలని పరితపిస్తుంటే... 
అవరోధాల గోడలు అడ్డుపెట్టి 
అడ్డంకులుసృష్టిస్తూ...అణచాలనే 
ఆలోచనలకు...స్థితప్రజ్ఞతలతో 
స్థిరచిత్తాల సైఅంటూ నిలవడమే ....  

ధర్మం నీ దాపున నిలిస్తే ... 
ఎన్ని అధర్మాలు ఒక్కటైనా ... 
ఆలస్యమౌతుందేమో కానీ 
అంధత్వమైతే ఆవరించదు .... 

ప్రణాళికల పందిరిలో 
ఆశల గమ్యాలన్నీ న్యాయ 
కోవిదమైతే ... ఆశయాల గమనాలు 
నీతి నియమ సూత్రాలైతే ... 
విశ్వమంత విశ్వాసంతో 
కృషి పట్టుదలలు పెట్టుబడైతే .... 
నీరాజనాలన్నీ నీకే సొంతం ....  

సార్వజనీన విజ్ఞానాలను 
అందిపుచ్చుకుని ... సామరస్య 
వివేకాలను జోడించి .... 
అందరు బాగుండాలి ... అందులో 
నేనుండాలని కోరుకుంటే .... 
విశ్వమంతా నీ  వెనుకే ..... 

నవ్విన నాప చేను పండినట్టు 
పూగుచ్ఛం చేతికందించి 
పబ్బతి పట్టి నిలిచే విధంగా 
అందిపుచ్చుకో అసమాన 
విజయాలను అప్రతిహాతంగా ... 

నగునూరి రాజన్న 

నువ్వు నూటొక్క కత్తులు నూరుకుంటేంది ... ? తేది : 17-01-2023 శీర్షిక : రాత మార్చుకో .... 1087

 నువ్వు నూటొక్క కత్తులు 

              నూరుకుంటేంది ... ? 
తేది : 17-01-2023
శీర్షిక :   రాత మార్చుకో .... 
సంఖ్య : సహస్రాధికం 

సవాలక్ష సార్లు విరమణలను 
ఉల్లంఘించి సాధించిందేమిటి .... 
ఆదరించారనుకున్న వాళ్లంతా 
ఆకు చాటు పిందెలా ముఖం 
చాటేస్తున్నారు ... 

నీ భుజం మీద బరువు మోపి 
నిన్ను ప్రత్యక్ష దోషిగా నిలబెట్టినా 
తెలుసుకోలేక ... చెప్పుడుమాటలకు  
చెవులంగలార్చి చేటుగా... 
ఇంక ఎన్నాళ్లకు గుర్తిస్తావు.... 

కుప్పమీదొచ్చే తెప్పలాటలా 
అప్పనంగా అందినంత దోచుకుని 
జలసాలను సాగించి .... చేతులు 
కాలాక ఆకులు పట్టుకోని 
అడుక్కున్నా పాపమనే వారేరి ... 

అనువు కానీ చోటుకు వచ్చినా  
అమ్మలాంటి భూమాతను 
పంచి ఇచ్చిన పాపానికి .... 
పదే పదే కాలుదువ్వుతున్నావు 
పరాభవాలను రుచి చూస్తున్నావు .... 

మొండి వాదనల కొండ మీద 
కూర్చుంటావు ...స్వతహాగా తోచదు 
చెబితే వినవు ....కాలికి పెడితే 
వేలికి .... వేలికి పెడితే కాలికి లంకె... 

పొరుగు క్షేమం పొందు లాభమంటే 
వినవెందుకు .... ఒంటెత్తు పోకడ... 
అసిద్దమంటే ... ఆశ పడతానంటావు ... 
ఎక్కడ మొదలెట్టి ఎక్కడివరకు చెప్పాలి ... 

శాంతంగా బ్రతుకు సాంత్వన చెందు ... 
నువ్వు నోటొక్క కత్తులు నూరుకుంటే 
ఏమి జరిగింది ..... ఏమి సాధించావు ... 
బ్రతుకనియ్యి .... బ్రతుకును ఇయ్యి ... 
తెలుసుకో జీవిత పరమార్థం .... 
గీతలో బోధించినట్టు ... రాత మార్చుకో .... 

నగునూరి రాజన్న 

అలకలు మొలకెత్తిన వేళ తేది :16-01-2023 శీర్షిక : చెప్పుడు మాటల చేటు ... 1086

 అలకలు మొలకెత్తిన వేళ 

తేది :16-01-2023
శీర్షిక : చెప్పుడు మాటల చేటు ... 
సంఖ్య: సహస్రాధికం 

మందరలు మాట నాటితే 
మనసంతా ఊగిసలాడదా ....  
కాలనాగులాంటి కల్మషములు 
కైకేయిగ  కస్సుమనుగదా .... 

పరితపించిన కన్నతండ్రి మనసు 
ప్రాణములు ఉస్సూరుమనగా...  
కట్టుబడిన రామయ్య కానలకు బైలెల్ల 
కట్టుబట్టలతో సీతమ్మా సౌమిత్రితో 
కాల చరిత్రలో చీకటి పేజీగా .... 

కష్టాలకు చిరునామాగా 
కదిలిపోయిన సీతా రామయ్యలను 
కక్ష్య గట్టిన కాల ప్రభావం 
విడగొట్టి వింత చూసింది ... 

అపర విజ్ఞానియైనా ... చెల్లె 
చెప్పుడు మాటలకు చెడిపోయి.... 
కాలగమనంలో రావణ బ్రహ్మైనా 
కడు నీచములాచరించె కదా .... 

కాలమంతా కాటకలిసిపోయి 
వెదుకులాటలకే జీవితాలైపోయి ... 
పెను ధ్వంస రచనలకు 
పెద్ద తలలెగిరిపోయే .....  

చర్యకు ప్రతిచర్యలా .... 
ఉరిమి ఉరిమి మంగళం మీద 
పడినట్టు ...ఒకరి అలకల మొలక 
మరొకరి  వినాశనానికి దారైంది.... 

నగునూరి రాజన్న 

కనుమ పండుగ తేది : 16-01-2023 శీర్షిక: కృతజ్ఞతా భావం .. 1084

 కనుమ పండుగ 

తేది : 16-01-2023
శీర్షిక:  కృతజ్ఞతా భావం .. 
కవిత సంఖ్య : 

సనాతనమైనా..  సంప్రదాయమైనా... 
ఆచారమైనా ... వ్యవహారమైనా ....  
అంతా సశాస్త్రీయమే  హైందవాన... 
బ్రతుకు ... బ్రతుకనీయు .... 
 
మడి ఆచారం మైలలు 
శుచి శుభ్రతల మెళకువలు
జప తపాల యోగ రీతులు  
పాప పుణ్యాల ప్రతిఫలాలు 
ఆధ్యాత్మికతల అవపోశనలు .... 
అన్నీ ఆరోగ్యవంతమైన 
మానవాళి  మనుగడలకే...... 

విశ్వ కాల గమన రీతులో .....   
ఆనవాయితీ ఆయనాల మార్పులో .... 
శీతోష్ణస్థితుల మాయ ఉత్సులో  .... 
సూక్ష్మ క్రిముల ఉరుముల మెరుపులో .... 
నియతి  కాల నియంత్రణలే 
నిత్య జీవిత సత్యాలుగా గుర్తింపు ...... 

ప్రకృతి సంపదల ప్రతిఫలాలయిన 
మనిషి...  పశువు...  పరిసరాలు ...... 
కావేవీ మినహాయింపు .... అన్నీ అర్హమే..... 
ఆరోగ్యాల నిర్వహణలకు .... 
పూర్వీకుల అనుభవాల జోడింపులే 
పుణ్యకాల పర్వదినముల నిర్ణయాలు. 

ఆది మానవ దశల నుండి 
అన్నీ తానై నిలిచిన పశువులను  
అలంకరించి ఆనందించే 
అమృత ఘడియలే  "కనుమ పండుగ" మనకు .... 

ఏరువాకతో మొదలయ్యి 
ఎడతెగని సేవలందించి
చేను చెలకలన్నింటిని తెర్లించి
ధాన్య రాశులను ధారబోసిన 
పశువుల బాగోగులే కనుమ పండుగ .... 

పశువులకు స్నానాలు 
పెట్టి పుట్టు అలంకారం  
అనారోగ్య నివారణకు 
అనువైన మందులు ... 

కొమ్ములకు కుప్పెలు 
మెడలోన  గజ్జెలు 
ఇంద్రధనస్సు వర్ణాలు 
ఇగురించే అందాలు ..... 

పక్షులకు వరిగొలుసులు  
కువ కువల గమ్మత్తులు 
అందరికి అన్నిచ్చి 
తెలుపుకునే కృతజ్ఞతలే 
కనుమ పండగ   .... 

నగునూరి రాజన్న 

వన రవళి చిత్ర కవిత (ముగ్గేస్తున్న మహిళ) 14-01-23

 కవన రవళి 

చిత్ర కవిత (ముగ్గేస్తున్న మహిళ ... గంగిరెద్దు  చెరుకుగడలు ... 
                 గాలిపటాలు .... )

పచ్చలు పొదిగిన పల్లె తల్లి 
ఒడిలో ఇనుమడించే పండగ శోభలు .... 
చుక్కలు దిగివచ్చి చక్కగా 
అమిరేనా ఇంద్రధనస్సులాంటి 
రంగవల్లిలో ..... 

తెల్లవారక ముందుగానే 
కళ్ళాపి చల్లి కాంతలంతా 
రంగు రంగుల ముగ్గులతో 
రమణీయత కుమ్మరించు .... 

వింత వింత ఆకారాలతో 
వినీలాకాశంలో విహరిస్తున్న 
సప్తవర్ణ సుశిక్షుతులైన 
బాలల ఆనందాల గాలిపటాలు ... 

ఎరుపురంగు వస్త్రముతో 
మెరుపులీనే  బసవన్న 
తురుపుముక్క తీరులా 
చెఱుకుగడల చెంత నిలిచె .... 

చేలంతా  పంటలతో 
చేవకలిగిన రైతన్న 
సిరులొలికించే ధాన్యాలతో 
సంతసించు హాలికుడు .... 

నలుగుపిండి తలంట్లు 
ఉదయాత్పూర్వపు తల స్నానాలతో 
నూతన వస్త్ర ధారణలతో,
దైవ దర్శనములతో, 
మాతృ మూర్తుల ఆశీస్సులు .... 

పట్టు పరికిణీలతో ఉట్టిపడే 
చిట్టి చెల్లెళ్ళ ఆనందోత్సాహాలు 
పల్లె పడుచుల కూని రాగాలు 
సంధ్య వేళలో గోధూళి తరంగాలు... 


కవన రవళి చిత్ర గజల్ తేది : 14-01-2023 5/5/5/5

 కవన రవళి  

చిత్ర గజల్ 
తేది : 14-01-2023 
5/5/5/5

మదిగదిన దోబూచు 
భావనలు ఎన్నెన్నొ ... 
గజిబిజిల గడబిడల 
ధారణలు ఎన్నెన్నొ ... 

అందియల సుందరం 
అతివలకు బందురం 
అయిననూ కదలనీ 
కవనములు ఎన్నెన్నొ ... 

ఎరుపంచు కోకతో 
మురిపించె నాతినీ 
యతులతో ప్రాసతో 
పద్యములు ఎన్నెన్నొ... 
 
శిఖిపించి పచ్చలూ 
లిఖియించె శాయిలూ 
రాగంకు  అందనీ 
ఎదసొదలు  ఎన్నెన్నొ ... 

మనసుంచి మదిస్తే 
చిలకొచ్చు కవితలూ 
రాజసం ఒలికేటి 
రాగములు ఎన్నెన్నొ 

నగునూరి రాజన్న