కలం గళం - భక్తి గేయాలు
తేది : 13-07-2024
శీర్షిక :
మంగళ మనరే
సహస్రాధికం ....
మంగళ మనరే జయ మంగళ మనరే
స్థితి కారక మూలకుడైన
శ్రీహరికిదే మంగళ మనరే .....
శ్రీహరికిదే మంగళ మనరే .....
పాల కడలిపై పవళించిన
శేష శయనునికిది...మంగళ మనరే
మంగళ మనరే జయ మంగళ మనరే
వేదములను రక్షించిన
వేలుపునకిదే మంగళ మనరే
వేలుపునకిదే మంగళ మనరే ...
జగములనేలే జగన్నాథునకు
అంగనలంతా జేరి మంగళమనరే
మంగళ మనరే జయ మంగళ మనరే
మునిశాపముల విమోచనార్థం
కూర్మావతారునికి మంగళ మనరే
కూర్మావతారునికి మంగళ మనరే ....
సురలందరిచే వందనమందిన
సుందరరూపుకు మంగళ మనరే...
మంగళ మనరే జయ మంగళ మనరే
హిరణ్యబలుల మదమనచిన
స్తంభరూపునకు మంగళ మనరే
స్తంభరూపునకు మంగళ మనరే ....
ప్రహ్లాదుడిని పరిరక్షించిన
పావనమూర్తికి మంగళమనరే .....
మంగళ మనరే జయ మంగళ మనరే
ఇనవంశోత్తమ ఇందీవరశ్యామకు
శ్రీరామచంద్రకు మంగళ మనరే
శ్రీరామచంద్రకు మంగళ మనరే ...
జగములనేలిన పురుషోత్తముడు
పుండరీకాక్షునకి
మంగళ మనరే ...
మంగళ మనరే జయ మంగళ మనరే
యదుకుల భూషణుండు
యశోద తనయకు మంగళ మనరే
యశోద తనయకు మంగళ మనరే ....
కంస చాణూర మర్దనుండు
కేశవమూర్తికి మంగళ మనరే....
మంగళ మనరే జయ మంగళ మనరే
వకుళమాత వరపుత్రుడికి
కలియుగదైవానికి మంగళ మనరే
కలియుగదైవానికి మంగళ మనరే ....
జగములనేలే వెంకటేశునికి
జగన్నాధునికి మంగళ మనరే ....
మంగళ మనరే జయ మంగళ మనరే
మంగళ మనరే జయ మంగళ మనరే
నగునూరి రాజన్న
No comments:
Post a Comment