Friday, July 26, 2024

ఆహ్వానాలన్నీ అంతర్జాలములోనే తేది 19-06-2024 శీర్షిక : ఒకప్పుడైతే వ్యక్తిగతం ...

 ఆహ్వానాలన్నీ అంతర్జాలములోనే 

తేది 19-06-2024
శీర్షిక : ఒకప్పుడైతే వ్యక్తిగతం ... 

పెళ్లైనా పేరంటమైనా 
అంతా వంత పాడటమే రివాజు.... 
హలో బాగున్నారా...ఏమనుకోవద్దండి… 
ఫలానా సమయానికి ఫలానా చోటికి 
రండంటూ ఆహ్వానాలు లోకసామాన్యం .... 
దారినపోయ్యే దానయ్యలను పిలుపుల్లా…

సాంకేతికత చంకల్లో ఇరుక్కున్నాక 
బంధుత్వం బంధనాలై పోతున్నాయి ... 
బజారు పలకరింపుల చిలకరింపులు… 
ఇబ్బందిగా మొదలై...రాను రాను 
అదే తంతుగా మిగిలి పోయింది... 

వందల్లో అతిథులు వందిమాగదులు 
వరసపెట్టి పిలవడమే డాంబికం .... 
వరుసలో నిలపడమే ఆశీర్వచనాలకు 
భోజనాలకు ఓ గొప్ప దర్పం .... 
ఫోటో షూట్ల పాట్లు...అతిథులొచ్చిన 
విషయమే గుర్తుండదు ... కానీ 
వంతుకు మనమూ చేయాడించడమే.... 

హల్దీలని .. సంగీత్ లని ... ప్రీ షూట్లని 
క్రేన్ కెమెరాలు డ్రోన్ కెమెరాలంటూ
లక్షల్లో ఖర్చులు హంగామాల మోజులు 
వంద రకాల వడ్డనలు పలకరిస్తాయి ... 
ఒంటికెంత...మంటికెంత....లెక్క తేలదు ... 

మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో 
మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరంలా... 
వస్తుంటే పోతుంటేనే బంధుత్వం... 
ఆరాటం ఒకవైపుంటే లాభమేంటి?…. 

ఒకప్పుడైతే  మంచి చెడులు పంచుకునే
వారే...  దగ్గరి బంధు మిత్రులే... 
స్వయంపాక  భోజనాలతో  సరస 
సల్లాపాలతో ఆత్మీయతల నడుమ 
అనుబంధాల మాటల మూటలతో  
వ్యక్తిగత ఆహ్వానాల వరుసలుండేవి... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment