Friday, July 26, 2024

అనురాగ పాశం తేది 18-06-2024 శీర్షిక : జీవరాశిలో భావరాశి

 అనురాగ పాశం 

తేది 18-06-2024
శీర్షిక :  జీవరాశిలో భావరాశి  

కడదాకా నిలిచినా లేకున్నా 
కని పెంచిన ప్రేమలు ... 
తోబుట్టువుల అనురాగాలు ... 
బంధుమిత్రుల భవబంధాలు ... 

జీవరాశికి సర్వసాధారణమైన భావరాశి  
మానవాళిలో మరికొంత ఎక్కువ... 
పడమిటింట పదిలమౌనేమో 
అవసరానికి అనుకున్నంత ... 
కానీ హైందవాన మాత్రం అద్భుతం .... 

సాంకేతికత సంఘర్షణలో 
అతంతమాత్రమై అతుకులీనుతుంది ... 
గతుక్కుమని ఎప్పుడైనా తెగి 
తీగ కాటకల్సిపోతోందేమో .... 

ఇక రాజకీయాలలో రచ్చ రచ్చలే  
బంక బెల్లం సింహాసనంలా… 
బొంబాయి మిఠాయి తీగల్లా.... 
కుటుంబపాలనల కుంపట్లతో 
ప్రజాపాలనలంటూ నామమాత్రం ... 

కేంద్రీకృత వాణిజ్యములలో 
ఇచ్చకమై ఇనుమడిస్తున్నది .... 
తప్పని పోరాటమోలే చేసే 
తెప్పలు కుప్పేసే తిప్పలులా .... 

పేరుకే పెద్ద చాంతాడు పట్టిక 
అంతా అయినవాళ్లేనని అనుకోవడం ... 
పేర్లన్నీ కుమ్మరించుకుంటే గాని 
సత్తా తెలియదు మనమంటే....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment