చిత్ర కవిత
10-06-2024
శీర్షిక : ఆడవారి అందం
అరవిరిసిన కనుదోయి
విచ్చుకున్ననల్ల కలువల
మధ్యన కాపలాగా దిద్దిన
అరుణ వర్ణం అచ్చంగా
పోలెనే ఉదయించే సూర్య బింబం...
హైందవాన నిలిచెనే
ఘన ఆచార సంప్రదాయమై
సంస్కృతికి చిహ్నంగా
ఐదవతనమునకు చిరునామాగా ....
ఆడవారికి అమిరేనే
అందంగా నుదుటిపై
సుందరతను పెంచేటి
సమున్నత సంస్కారంగా ....
అలంకరణలో భాగంగా
అందమైన సింధూరం ...
ఆడపిల్లలకు గౌరవం
సంఘములో సమున్నతమై ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment