Friday, July 26, 2024

లలిత గీతాలు - నాగార్జున సాగర్ 31-05-2024

 నాగార్జున సాగర్

31-05-2024

కరుణించగ  రావమ్మా    
కాంతులీను కృష్ణమ్మా 

నల్గొండ  పల్నాడుల  
సరిహద్దులు నీవమ్మా 
నందికొండ  జాడల్లో 
నగారాలు మోగించగ .....  

బిరబిరల  నీపరుగు
బీజములు వేయంగా 
తలిచిరో మా యమ్మా  
తరలించ పంటలకు .... 
 
కరుణించగ  రావమ్మా    
కాంతులీను కృష్ణమ్మా 

నాగార్జున సాగర్ గా 
నామకరణం గావించి 
బహుళార్ధ సాధకమైన  
బహు గొప్ప ఆనకట్టకు 

శాతవాహన చరితవు  
నాగార్జునుడి నడకనీది… 
బుద్ధుడేమో నడయాడే 
భువనమందు నీజాడలలో  

కరుణించగ  రావమ్మా    
కాంతులీను కృష్ణమ్మా 

కంట నీరు తుడిచిన  
బంగారు పంటలే ..... 
వెలుగులనే పంచేటి 
జిలుగుల విద్యుత్తులే .... 

పురావస్తు రూపకమున 
పర్యాటక రంగములతో
బహు విధముల మేలుతోడ
బహు గొప్ప కట్టడము.... 

కరుణించగ  రావమ్మా    
కాంతులీను  కృష్ణమ్మా 

హాలికుల దరహాసం 
మెరుపులీను నీ చూపుతో.... 
కుడి ఎడమల కాలువలు 
కుబేరములే  పంటపొలం .... 

లక్షల ఎకరాల బీడుకు
లక్షణముగ నీరందించి 
అన్నపూర్ణ  చేసినావు 
ఆంధ్ర తెలంగాణలను .... 

కరుణించగ  రావమ్మా    
కాంతులీను  కృష్ణమ్మా 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment