ఓ చిరుగాలి అల
తేది : 17-07-2024
శీర్షిక : దేవతయ్యింది ....
సహస్రాధికం ....
అలితేరే మనసులకు ఆల్చిప్పలు
దొరికిన చందంగా ... యవ్వనంలో
మంచి ముత్యం పట్టుకుందామని
ముచ్చట చెప్పా చిరుగాలికి చిటికేసి ....
చిరుగాలమ్మా నా మాట వినిపో
నా శ్వాసల ఊపిరియే పంటగ
జంటై నిలిచే జీవన సహచరికై
నా మనసు తెలుసుకోవమ్మా అంటూ ....
నా ఉనికిని నిండుగ కనమంటూనే
ఈడు జోడయ్యే జోడుకై వెదకమ్మాయని ...
కనువిందులు చేసే కమ్మని జంటకు
కలలన్నీ పండించగా కరుణించమని....
అలా విన్నదో లేదో పూనకంలా
పరుగెత్తి సమ జోడీల సమాచారం
కుప్పలు తెప్పలుగా కలబోసుకొని
కట్టలు కట్టుకుని నమ్మిన బంటులా
నను ప్రసన్నం చేయాలన్న తపనలే ....
గాలి ఊయలై ఈల వేసింది ....
దారి చూపి నాకు దేవతయ్యింది ....
కలతలెరుగని కమ్మని జంటగ
అనురాగాల పంటగ కట్టబెట్టింది....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment