Saturday, July 27, 2024

కవన రవళి వచన పద్యాలు మకుటం: ఈ కలలు సాకారమయేదెప్పుడో రామా ! తేది: 13-07-2024

 కవన రవళి వచన పద్యాలు

మకుటం: 
ఈ కలలు సాకారమయేదెప్పుడో రామా !
తేది: 13-07-2024

1. గుణమున్న రాజకీయం గురుతరమై 
    మచ్చలేని నాయకులు మాకు దొరుకుట 
    రచ్ఛలేని సంఘములు ఇచ్ఛమై నిలువ 
   ఈ కలలు సాకారమయేదెప్పుడో రామా !

2. నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండి 
    నిర్మలమైన పురోగతి దేశమున 
    నిశ్చలమైన జీవితములు కుదురుట 
    ఈ కలలు సాకారమయేదెప్పుడో రామా !

3. సకారాత్మక పాలకులకు నెలవై 
    సాధారణ జీవన రీతుల సత్సంగమై 
    సాధువంటి నాయకులకు పదవులు 
    ఈ కలలు సాకారమయేదెప్పుడో రామా !

4. దేశమ్ము ప్రథమమను దేహాలు చూడు 
    దోషమ్ము లేని సుగుణశీలురతోడ 
    భాష్యమ్ములై ఉదాహరించు భాగ్యజీవితం 
    ఈ కలలు సాకారమయేదెప్పుడో రామా !

5.  పలురకాల కల్తీ కాలుష్యాలు లేకుండా 
     లంచగొండి బంధుప్రీతి పాలు కాకుండా 
     సర్వజనులు సమసమాజమై బ్రతుకు జూడ ...  
    ఈ కలలు సాకారమయేదెప్పుడో రామా !


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment