నిజం నీ నైజమైతే ...
తేది: 17-05-2024
శీర్షిక: నిర్భయమే ...
అబద్దాలతో అడుగడుగునా
అలితేరేకన్నా... నిజం భుజాన
వేసుకున్నామంటే నిర్భయమే
శ్రీరామరక్ష మనకు జీవితాంతం ....
అయినా కొంతమంది ఎప్పుడు
అబద్దాలతోనే కాపురం
చేస్తారు ... నిప్పులాంటి నిజాల
మీద తాత్కాలికంగా నీళ్లు చల్లుతూ ...
కొన్నిసార్లు నిజాలు కడుపులు
నింపకపోవచ్చు ... కానీ మనసుల
నిండా ప్రశాంతతలను..కంటి నిండా
నిద్రను..ఒంటి నిండా ఆరోగ్యాలను
కానుక చేసి పర్వాలను రుచి చూపిస్తాయి ...
మహాభారతంలో నన్నయ్య గారు చెప్పినట్టు
ఎన్నెన్నో గొప్పగొప్ప విషయాలకన్నా
ఒక సత్యవాక్యం మేలన్నట్టు ....
నిజం నిప్పులాంటిది ... నిలకడ
మీదైనా తెలుస్తుంది ....
నిజాలు కష్టాలు మిత్రుల్లా
అబద్దాలు సుఖాలు మిత్రుల్లా ...
భ్రమింపజేసినా ... నిజం బ్రతుకులకు
శాశ్వతత్వాన్ని సంక్రమింపజేసి
నిజ జీవితానికి చల్లని నీడనిస్తుంది……
నగునూరి రాజన్న
No comments:
Post a Comment