Saturday, July 27, 2024

ఆనందం--పరమానందం -2 తేది : 12-07-2024 శీర్షిక : అంతరం గ్రహిస్తేనే…

 ఆనందం--పరమానందం -2

తేది : 12-07-2024
శీర్షిక : అంతరం గ్రహిస్తేనే… 
సహస్రాధికం .... 

మర్కటములు మారితేనే 
మనిషయ్యాడని సిద్ధాంతాలు...
రూపం మారినా తాపం మారక 
ఇంకా మర్కటపు ఛాయలే... 

అనుభూతులను అవపోషించడం 
అనువదించడం అంత సులభం అనుకోకు... 
అందున పొందుగ వైవిధ్యముల సారూప్యం 
తెలుపుట తటపటాయింపులే ... 

అనుపానుల అంతరం గ్రహిస్తేనే 
అనుగ్రహమై అవగతమయ్యేది… 
అంచున మారే వింతలను విడమరిచి
విశదీకరించలేకపోతే బొంతలో గంతే మరి…. 

నిర్గుణమైన తాత్విక చింతనతో 
రామ నామం నినదించుటయే ఆనందం... 
నిజరూపమున స్వామిని కనగలుగుటయే 
మనసుకు పట్టలేని పరమానందం... 

సంఘర్శణలో సంశయాలు బాపుకుని
ఎట్టకేలకు పట్టు దొరికెనా ఆనందం… 
మదిపొందిన ఫలితపు పాత్రను
ఎదఎదకు చేర్చగలిగితే పరమానందం… 
 
నగునూరి రాజన్న 

No comments:

Post a Comment