Friday, December 20, 2019

ఏ దేశమేగినా....

ఏ దేశమేగినా.... 
తేదీ 19-12-2019     
శీర్షిక - పొగడాలి మిత్రమా  ! 
సంఖ్య - 336

బుద్ది కలిగినవాడే పెద్దోడు 
విశ్వం కన్ను తెరవకముందే 
విశిష్ట సంస్కృతిని సంతరించుకున్నాం 
అక్కడక్కడా అల్పులు అరిచినా 
అద్వితీయమైన చరితకు ఆనవాళ్లు.... 

మాతృ మూర్తి మనకు జన్మనిస్తే 
మాతృ భాష మమతా సమతలు నేర్పినది  
మాతృ భూమి అక్కున చేర్చుకుని పోషిస్తున్నది  
మనిషికి  ....  మరో ప్రపంచానికి... వారధిగా నిలుస్తున్నది   
ఏదేశమేగినా ఎరుకకు ఇదే  ఆనవాలౌతున్నది.... 

ఎన్నెన్నో కులాలు  మతాలు 
ఎన్నెన్నో వర్ణాలు  వర్గాలు..... 
అయినా భిన్న సంస్కృతుల ఏకత్వం..... 
ఎందరెందరో  మహానుభావులు 
ఈ స్థితికి ఆద్యులు... కొనసాగింపులు...  
అందరికి వందనాలు.... 

వేద సంస్కృతికి వేదిక  ఈ దేశం 
ఇతిహాసాలకు పుట్టినిల్లు ఈ దేశం 
సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మ ఈ దేశం 
ఉనికి మూలాలకు ఉన్నత విలువలకు  మూలం ఈ దేశం.... 
ఏదేశమేగినా ఎందు కాలిడినా ..... మూలాలు 
తెలపడమే కాదు ... పొగడాలి మిత్రమా! 

నగునూరి రాజన్న 
కరీంనగర్

మనిషికి మరోవైపు

మనిషికి  మరోవైపు  
తేదీ 18-12-2019
శీర్షిక -  మమతల హంసలు
సంఖ్య - 335

పలు జన్మల పయనం తదుపరి 
ప్రశస్తమైన మానవ జన్మన్న ....  
వేద ఘోషల పలుకులన్నీ వెతలౌతున్నయి 
పురాణ వాక్కులన్నీ పుక్కిటపాలవుతున్నయి  
మర్మమెరుగక మర మనుషులై పోతున్నారు ...... 

బొమ్మ బొరుసుల నాణెమైన మనిషి మరోవైపు 
మూల విలువల మారక విలువల మనసులతో    
మక్మల్ మడతల ముసుగులో మసలుతున్నాడు  
గాజు కళ్ల లోతుల్లో గమనించలేని  భావనలు 
మధురమైన మాటల మాటున వంచన పరదాలు 
చేసే చేష్టల వెనుక చెడుగుడు ఆడే జుగుప్సలు... 

నాగరికత నేర్చుకున్నా....  ఆటవిక నరరూపులై  
స్వార్థపు అశ్వమై స్వైర విహారం చేస్తున్నది 
సంకుచిత నత్తగుల్లగా  బిగుసుకుంటున్నది 
భరోసా హస్తం భలేగా కొంగ జపం చేస్తున్నది.... 

మల్లెపూల ఖద్దర్ల వెనుక మురుగుజ్జుల అవతారాలు  
ఖాకీ రంగుల కాననలోన కాకమ్మల కమామీషులు  
దక్ష పాలకుల వనాలలోన  దమనకుల అడుగుజాడలు 
ఆదరణ లేని అధికారుల రూపంలో రుధిరపానపు జలగలు  
పొరుగు క్షేమం కోరలేని ఆటవిక మోటు స్వభావులు 
మొత్తానికి మనిషి నడవడికే అష్ట వంకర్లు ........పోతున్నాయి....  

మానవత్వపు కోవెలలో మమతల హంసలు కావాలి....  
ఆత్మీయతల జవసత్వాలు నింపుకుని 
ఆప్యాయతల సుగంధాలు వెదజల్లాలి 
ప్రేమ పావురాలను ఎగురించాలి.... 
అప్పుడే  కదా..... అసలైన మనిషి 
విలువలు ముందు తరాలకు  అందించగలిగేది......  

నగునూరి రాజన్న 
కరీంనగర్   

ధనుర్మాసం

ధనుర్మాసం
16-12-2019 
శీర్షిక - మార్గళి   వైష్ణవారాధన 
సంఖ్య - 334

ఉత్తరాయణం పగలై వెలుగొంద 
దక్షిణాయనం నిశిగా నిలువంగఁ  
ఉషాకాలమాయె సురలకు మార్గశీర్షము
బ్రహ్మీ ముహర్తమై బాసిల్లుచుండ.... 

మాసోహం మార్గశీర్షోహమంటూ 
మధుసూదనుండే సెలవిచ్చే కదా !
విభూతి యోగంలో వివరించె 
మద్భగవద్గీతయందు ప్రీతిపాత్రంగా....  

తులసీవనమున జన్మించిన 
విష్ణు చిత్తుని తనూజ భక్తిమీరగ 
పూదండల హారములు కూర్చి 
మధురమైన మేల్కొలుపు పలుకులతో 
పాశురములుగా పాడి తన్మయించె .... 
పాంచజన్యుణ్ణి కీర్తించె పవిత్రంగ .... 

తెల్లవారెనని భామలందరిని 
పరుగు పరుగున రారండంటూ....  
పక్షుల కిల కిలా రవముతో రమణులందరిని   
రంగధాముని సేవకు వెళాయేనంటూ.....  
మనకు విశదపరచె  వ్రతమాచరించి 
మాస విశిష్టతను మనసుబెట్టి గోదాదేవి ..... 

ముక్తిమార్గమునకు శీర్షమై నిలిచె మార్గళిగా !

నగునూరి రాజన్న 
కరీంనగర్

Sunday, December 15, 2019

వృత్తి ధర్మాలు

నగునూరి రాజన్న 
వృత్తి ధర్మాలు
తేది -14-12-2019
శీర్షిక - మోక్ష సూక్ష్మాలు 
సంఖ్య - 333

పాలకులు కూడా ప్రజలేనంటూ 
ప్రజలే అన్నింటా ప్రధానమంటూ 
పాలనలు పకడ్బందీగా పాటించ
పరంధాముడే మానవుడయ్యాడు ........ 

కర్మ సిద్ధాంతపు మర్మం తెలుప 
ధర్మ సూక్ష్మాన్ని దార్శనికత జేయ 
జన్మ మార్చుకుని జగతిన చేరే... కదా 
జగన్మోహనుడే యుగపురుషుడై ఈ జగాన.... గీత బోధించ 

అందరు బాగుండాలి అందులో నేనుండాలి
ఒకప్పటి మాట..... 
ఎవ్వరేమైనా.... నేను మాత్రమే బాగుండాలి .... 
ఈనాటి మాట...... 
చెప్పుకుంటూ పోతే.... చాంతాడంత ..... 

రంగులు మార్చే రాజకీయాలు
చేతులు చాచే అధికారగణాలు
దళారులే దండి దళపతులుగా   
బొక్కసాన్ని దక్కించుకుంటుంటే.... 

కల్తీల కండలు కాలరెగరేసుకుంటుంటే  
కాలుష్యాలు విర్రవీగి కబాడి ఆడేస్తుంటే
విషనాగులై  వీర విహారం చేస్తుంటే
అనారోగ్యాల కార్చిచ్చులు  దావానలమై వ్యాపిస్తుంటే 
వైద్యం బస్తీమే సవాలంటూ కుస్తీలకు దిగుతుంటే... 
ప్రజారోగ్యాలన్నీ అప్పనంగా కుప్ప కూలుతూంటే ...... 
విద్య వినయ విధేయతల దారి మార్చుకుంటుంటే... 
ప్రజాసంక్షేమం పతనదారుల పయనిస్తుంటే......

కుల మతాల కుళ్ళు మనకొద్దు .... గానీ ... 
వృత్తి ధర్మాల ఊసులు మాట్లాడకుండా ఉండలేకున్నా.... . 
కవాతు చేయడానికి ధైర్యం కూడగట్టుకుంటున్నా.... 
వాణిజ్యనీతి వరస మారిపోయిందని .... 

అడ్డగోలు దొడ్డి దారుల రాబందులు కాలేదు 
అత్యాశల కరటక దమనకులుగా ఎదుగలేదు... ఆనాడు  
వస్తు నాణ్యతలు వసివాడని సతతహరితం ..... 
వణిక్ ల  చెంత ఉన్నంతకాలం..... 
వ్యాపారం వాణిజ్యం కూడా నీతి నియమాలతో సాగింది
గుప్తుల కాలం స్వర్ణ యుగంగా కీర్తించబడింది.....
అందుకే వృత్తి ధర్మాలు సైతం మోక్ష్మ సూక్ష్మాలు....... 

నగునూరి రాజన్న 
కరీంనగర్

సరాగాల పల్లకి

అంశం - సరాగాల పల్లకి 
తేది - 12-12-2019
శీర్షిక - ఆనందాల చిరునామా...
సంఖ్య - 332 

మనిషి బతుకు బాటలో 
నిత్యo పరుగుల పందేరం
మంచి చెడుల ఎత్తు పల్లాలు....
కష్ట సుఖాల కలబోతలు ....
కలిమి లేముల మిశ్రమాలు....

ఎన్నున్నా ఎదను మీటే మంత్రం 
వినోదాల వల్లరి పాటల పల్లకి 
సరిగమల సరాగాల సవ్వడులు 
మదిని దోచే స్వరాల సర్వస్వాలు.... 

అంతులేని ఆనందాల అవధులు 
సర్వోన్నత సంభ్రమాల శిఖరాలు 
పదమైనా.... పద్యమైనా.... 
పాటైనా.... గీతమైనా...... 
కీర్తనైనా....... సంకీర్తనైనా.... 
సరాగాల పల్లకిలో సావధానమైనేతేనే....  
శృతిలయలొలకబోసి కృతిగా  ఊరేగేది.... 

సెలయేటి గల గలల నుండి 
పక్షుల కిల కిలలు ..... 
ఎండుటాకుల గల గలలు 
బుజ్జి పాపాల ఉంగా ఉంగాలు 

భాష ఏదైనా భావముంటే చాలు 
దేశమేదైనా మనసును అలరిస్తే చాలు 
దక్షిణమైనా... ఉత్తరమైనా.... 
పాశ్చాత్యమైనా...... పరవశమే.... సుమా.... 
ఆరోగ్యాలకు  ఔషధం ...... 
ఆనందాల  చిరునామా...  
 
నగునూరి రాజన్న 
కరీంనగర్

Thursday, December 12, 2019

ఆనంద నిలయం

ఆనంద నిలయం 
తేదీ - 11-12-2019
శీర్షిక -  సర్వమతాదరణం.....
సంఖ్య - 331  

విశ్వ దేశాల వినీలాకాశంలో 
వింత పోకడల విధి విధానాలు .... 
ఎవరికి వారే యమునాతీరే .......  
అవిభాజ్య కుటుంబాల  ఊసులు లేవు ....... 
అంటు సొంటుల ఆత్మీయతలు కానరావు .... 

విశ్వ దేశాలను విడమరిస్తే.... 
అవుతే ఇస్లామో కాదంటే కిరస్థానమో... కానీ.. 
ఆనవాళ్లన్నీ స్వార్థ సంకేతమే 
అనుపానులు సర్వ హితం నాస్తి... 

అక్కడక్కడా చెదురు మదురైనా 
అన్ని జాతి మతాలకు ఆలవాలం...
అందరికి  అందుబాటు  ప్రశాంతం  ..... 
అన్నీ కుదిరేది ఇక్కడే.....మన దేశాన   

కక్షలు కార్పణ్యాలకు నెలవు కాదు
కఠిన నియమాల జాడలు లేవు.... 
భాష ఏదైనా మతమేదైనా దేశమేదైనా 
బహు చక్కని బతుకు సీమ ఇదే...... భారతం 

అల్లాహో అక్బరన్నా....  
ఆ యెహోవానే రక్షకుడన్నా.... 
పరమత సహనం పరమ విశిష్టం 
సర్వమతాదరణ  సరళతరం  ఇక్కడే......మన దేశాన....   
అందుకే  ఆనంద నిలయం మన భారతం..... 

నగునూరి రాజన్న 
కరీంనగర్

మంచు కురిసే వేళలో....

మంచు కురిసే వేళలో.... 
తేదీ - 09 -12 -2019                 
శీర్షిక- అవని వధువుకు మంచి ముత్యాలు
సంఖ్య- 330 

శ్రావణ భాద్రపదాల చినుకు పలకరింపులకు 
పచ్చకోక చుట్టుకున్న అవని వధువుకు 
మార్గశిర పుష్యముల మంచి ముత్యములు 
తలపించును తన్మయానందాల తలంబ్రాలు.... 

నులి వెచ్చని పొగలు కక్కే  ధవళ రాశులు 
చెలి కన్నుల్లో మెరిసే వెలుగుల ఛాయలు 
కురిపించును మదిలో  మోహన రాగాలు 
మెరిపించును ఎదలో వన్నెల వెలుగులు

మంచుతో నేసిన హేమంతపు వస్త్రం 
వత్తిగిలి నిలిచిన అవని మంచు దుప్పట్లు
యువతీ యువకుల  ఆనందాల ముచ్చట్లు 
హత్తుకునే మనోల్లాసాల మధుర క్షణాలు ...... 
చరిత్ర పాటలై చక్కిలిగింతలు చేస్తున్నాయి ..... 

ఇప్పుడు మాత్రం ..... 
పర్యావరణ కాలుష్యాలతో పలుచనై 
ప్రజల పడిగాపులేనాయె ప్రతి కాలానికి ..... 
చలి పులితో పులకరించాల్సిన మనం 
సేద దీరుతున్నాం పంకాల పైరగాలికి .....

మాటల ప్రవాహాలకు అనకట్టలువేసి  
చేతల చికిత్సల  శ్రద్ధలు  చూపక పోతే 
మనిషి ప్రశాంత మనుగడే ప్రశ్నార్ధకం...... 
ముందు తరాల ముందు మనమంతా దోషులమే ..... 


నగునూరి రాజన్న 
కరీంనగర్.  

చంద్ర హాసం

నగునూరి రాజన్న
చంద్ర హాసం 
తేదీ 05-12-2019
శీర్షిక - చంద్ర హాసం
సంఖ్య 328

ఖగోళ చక్రబంధములో ఉపగ్రహం 
నిశి రాత్రుల చెరబట్టే వెన్నెలకాడు 
ఆనవాయితీగ  అమ్మ తమ్ముడైనా 
అమృతం కురిపించే చంద్రుడు సుమా.....

గ్రహ పరిభ్రమణాల పరికల్పనలో 
ప్రభావవంతమైన నక్షత్ర రేడు 
దినకరుని అనుంగు ప్రకాశితుడు 
వేడి తెలియని వెలుగులిచ్చే వన్నెకాడు....   

కవి హృదయాలను కదిలించే సాహిత్యం 
యువ హృదయాలను ప్రేమించే సాన్నిహిత్యం .... 
కృష్ణమందు క్షీణిస్తూ..... శుక్లమందు వృద్ధి చెందుతూ 
పాలనురగల ప్రవహింపజేసి
కటిక చీకట్లను కరవాలమై ఝులిపిస్తుంది.... 

జీవితమంటే  కష్ట సుఖాల కలబోతలేనని 
కలిసి పయనించే బాటసారులేనని 
కాల గణనాలకు మూలమై నిలిచి  
మీన మేషాల పంచాంగమైనా స్థితప్రజ్ఞతకు సూచీ ......

నవీన నాగరికతల పోకడలతో  
నక్షత్రాల సాపేక్ష సిద్ధాంతాలతో 
సాంకేతిక సొబగులద్దుకుని 
నూతన ఖగోళ విజ్ఞానాలకు కేంద్రమయ్యింది..... 


నగునూరి రాజన్న 
కరీంనగర్

ఆకులో ఆకునై

నగునూరి రాజన్న
ఆకులో ఆకునై 
తేది - 03-12-2019
శీర్షిక - నందన వనాలు ...  
సంఖ్య - 

కోట్ల సంవత్సరాల చరిత్రల ఆధారం 
ప్రకృతినుండే  పయనం ప్రారంభించినా  .... 
పర తమ బేధం ఒంట బట్టించుకున్నాడు 
కోతినుండి పుట్టాడు మానవుడన్నది.....  

కల్లా కపటాల కవాతులు కానని
హొయలొలికే జలపాతాలు   
దగా మోసాల దాఖలాలు లేని 
హాయి గొలిపే పచ్చికబయళ్ళు   

స్వార్థ నీడల జాడలు తెలియని
చెట్లు పుట్టలు కొండలు కోనలు  
అలసత్వాల ఆనవాలు లేని చోటు.....  
ప్రకృతి ప్రసాదించిన పర్యావరణం 

ఇవ్వడమే ఇలవరుసగా తెలిసిన 
ఇహలోక  నందవన  ఆనందాలు 
చూస్తేనే మనసు పరవశిస్తుంది 
ఆకులో ఆకునై నేను వెల్లి విరిస్తే 
మమత పొంగి పొర్లాదా .......  

నగునూరి రాజన్న 
కరీంనగర్

Wednesday, December 4, 2019

శిలా ఫలకాలు

శిలా ఫలకాలు 
తేదీ - 04.12. 2019
శీర్షిక - ఫలకాలు ..... 
సంఖ్య - 327 

మర్కట మూలాల మనిషనే 
మతలబుల మూటలు విప్పిన 
చర్విత చరణాల చరిత్రలకు 
చెక్కు చెదరని నిలువెత్తు సాక్ష్యాలు ..... 

ప్రాచీన చరిత్రలకు పవిత్ర మూలాలు  
అంతులేని ప్రశ్నలకు అవే ఆధారాలు  
నాటి జీవన  విధానాలకు అసలైన ఆనవాళ్లు 
భావి గమనాలకు మార్గదర్శులు.. శిలా ఫలకాలు
తామ్ర ఫలకాలు.... రాతి ఫలకాలు.....అనేకాలు... 
నాటి మాటైతే...... 

రాజుల రోజులు పోయి రాజ్యాలు మారినా 
పేర్లు మాత్రమే మారాయంటూ సాక్ష్యంగా
కొన్ని ఫలవంతమైతే చాలా మాత్రం  
కాగితాలకే పరిమితమై కవాతు చేస్తూ 
అర్ధణా కోడికి అరకిలో మషాలా లాగా 
అక్కరకు రాని చుట్టం మొక్కిన వరమీయని చందంగా 
దౌత్య మర్యాదల  దండుగ నామాలతో 
చాంతాడంత చిట్టాలకే  పరిమితమయ్యి   
చెత్తంతా నింపుకుని వట్టిపోయిన 
బోరుబావుల్లా ఉరూరా ఉనికి పోరాటాలు 
చేస్తూ వెర్రి జనాలను వెక్కిరిస్తున్నాయి .....
అర్రులు జాపే  అధికార ప్రతిపక్ష
డాంబికాలకు దర్పమై  దర్శనమిస్తూ
కరటక దమనక కమామీషులలాగా   
నిష్క్రియా కార్యాలకు మూలమై  
పేరుకుపోతున్న ఖనిజరాశి.....  
 ఈనాడు.....    

నగునూరి రాజన్న 

లోకాభిరామాయణం

లోకాభిరామాయణం
తేదీ 02-12-2019
శీర్షిక -విజ్ఞానుల మౌనం వినాశనానికి నాంది.... 
సంఖ్య - 326

ఊరికే ఉంటె ఊరా పేరా ?
ఊసుపోక కబుర్లు వల్లించినా 
ఉడికించే ముచ్చట కావాలి 
ఊపు తెచ్చే విషయమై ఉండాలి.... 

అసలు పనికి ఆలస్యమైనప్పుడు 
సమయ దాటింపునకు  సరదాగా
ఎదుటివారు ఎవరైనా సరే అంటూ  
సన్నుతించుకునే సాగతీతలు ..... 

లోకాభిరామాయణమైనా  సరే  
లోకోద్ధరణకు ఉద్దేషించాలంటే 
పన్నులు కట్టి పక్కకు తప్పుకోవడం కాదు.... 
పక్కవారి క్షేమం కూడా కోరాలి..... 

స్వార్థాలను సంస్కరించుకుని 
సంఘ క్షేమం కాంక్షించే ఫలవృక్షం కావాలి..... 
విద్యనమ్ముకుంటూ విజయం
సాధించామనే బావిలో కప్ప కాకూడదు... 

మత్తు మందుల విషకోరల్లో 
మనమంతా సమాధి కావాల్సిందేనా ? 


అందరు బాగుండాలి 
అందులో నేనుండాలి అనే విశాల దృష్టి కావాలి. 

అప్పుడే దశ మారుతుంది 
"దిశ" లాంటి దిక్కులేని చావులు కొంతైనా తగ్గుతాయి.... 
విజ్ఞానుల మౌనం కొనసాగితే 
వినాశనానికి నాంది...... సంకేతం.... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ 

కడుపు తీపి

కడుపు తీపి  
తేది - 30-11-2019
శీర్షిక - ఓ కమ్మని అనుభూతి  
సంఖ్య :325

శాస్త్రాలు సమగ్రంగా నిర్వచించాయో లేదో  
సంప్రదాయాలు సవివరంగా  వివరించాయో లేదో ... కానీ  
సకల చరాచర ప్రాణకోటిలో.... సమమయిన 
మాటలకందని ఊహలకందని ఓ కమ్మని అనుభూతి..... 

ఎలా ఉంటుందంటే ఏం చెబుతాం ? 
కడుపున పడిన క్షణం నుండి 
కంటి చూపుకింకా కానరాకపోయినా 
కలలు కంటూ ... కదిలితే ఎక్కడ 
కందిపోతుందోనని కలవరపడ్డాననా .... 

ఎంత ఉంటుందంటే ఏం చెబుతాం?
పుట్టీ పుట్టగానే పుట్ట బొమ్మలా చూసుకుంటూ 
పుట్టిన ప్రతి క్షణం నుండి పట్టం కడుతూ 
పట్టి పట్టి ప్రతీది శక్తికి మించి సమకూర్చుకుంటూ  
పెట్టి పుట్టిన దాఖలాలు దకలు పరిచాననా .... 

ఎందుకుంటుందంటే ఏం చెబుతాం ? 
అణువణువున  మన తనువేనని 
అహోరాత్రుల మన ఆరాట పోరాటాలు    
ప్రతిరోజు  పడే తపన వాళ్ళ ఉన్నతికేనని .... 
తల్లిదండ్రులైతే తప్ప అర్థం కావనా ..... 
 
ఏ విధంగా తెలియ చేయను ?
ఢిల్లీకి రాజైనా తల్లితండ్రులకు సంతానమేనని 
ఆస్తులు అంతస్తులు మణులు, మాణిక్యాలు, 
నవరత్నఖచిత చీని  చీనాంబరాలు 
అన్నీ కడుపు తీపి ముందు దిగదుడుపేననా ... 
 
ప్రపంచాన పదిలంగా ఫరిఢవిల్లుచున్న 
కడుపు తీపి.... ఓ కమ్మని అనుభూతి.... 
కవితలకో..... కథలకో.... అంతుబట్టనిదని  
భాషకందని భావనని.......సాహిత్యానికందని...సంపదని 
సకల చరాచర విశ్వంలో సంభవించే 
ప్రకృతి మాత సంతరించుకునే సంపూర్ణత్వం.....   


నగునూరి రాజన్న 
కరీంనగర్ 

గమ్యం తెలియని పయనం

నగునూరి రాజన్న   
గమ్యం తెలియని పయనం 
తేది - 29-11-2019
శీర్షిక -  బహు దూరపు బాటసారి 
సంఖ్య :324

వద్దే వద్దు అలాంటి పయనం 
ప్రతి ప్రాణికి ఉందొక గమ్యం 
చిట్టి చీమకు ఉందొక గట్టి గురి  ... 
కాలం మారినా కడుపు నింపుకునే ఆశయం... 

విజ్ఞానవంతులమని విర్రవీగే మనకు 
వివేకం వివేచనలే తోడు ఆయుధం ... 
వినమ్రంగా తొంగి చూస్తే చిక్కుట ఖాయం.... 
విజయ తీరాలను చేరుట తథ్యం 

అత్యవసరాలు , అవసరాలు 
ఆనక కోరుకునే సంతోషాలు..... 
అన్నీ కలగలపక ఆలోచిస్తే 
అంతు పట్టదా తక్షణ కర్తవ్యం..... 

పట్టింపు లేని పాలకుల లాగా 
ఎట్టి చాకిరీల ఎత్తిపోతల లాగా 
భయం లేని బడా అధికారుల్లాగా  
భక్తి  లేని  భక్తుల్లాగా  వద్దే వద్దు.... 
శ్రద్ధ  లేని శ్రాద్ధం భూమికి భారం
  
కర్మ భూమి మన దేశం నమోనమామి 
కదలాలి గమ్యమెఱిగి మనమంతా  
కదం కలిపి బహుదూరపు బాటసారిగా  
కనకమై మెరవదా మన దేశ భవిత!

నగునూరి రాజన్న 
కరీంనగర్

కనురెప్పల సవ్వడి

నగునూరి రాజన్న   
కనురెప్పల సవ్వడి     
తేది - 28-11-2019
శీర్షిక -  కవల కనుదోయిల కంచె 
సంఖ్య : 323

కవల కనుదోయిలకు కాపలా కంచె 
కరుకు కోమల హావభావాలకు సాక్ష్యాలు 
కనుపాపల ఆయుష్షుకు  రక్షక  భటులు   
కాలానుగుణ ప్రకృతి కర్కశాలకు భద్రత.... రెప్పలు  

కవలలైన కనులు రెండే అయినా  
కదిలి కురిపించు భావాలనేకం.... 
కమ్మని అనుభవాలకు ఆలవాలమయి   
కనికట్టు చేసి కథలు నడిపించు ..... 

చూసీ చూడనట్టు నటించినా 
చూపులతోనే మాటాడినట్టు చేసినా 
మౌనంగా వేదనలు భరించినా 
మొహంగా భావాన్ని ప్రకటించినా...... 

నిప్పులు కురిపించి నిలువరించినా 
కరుణ వొలకబోసి కాపాడినా 
జాలి ప్రకటించి  దయ జూపినా 
దానవత్వం దర్షింపజేసి దహించివేసినా ....  

నవరసాల పోషణకు నాందీ అయిన 
నాడీ కేంద్ర ప్రాతినిత్య నాటక రాయుళ్లు.... 
నిశీధిలో అలసి సొలసి నిద్రిస్తే  
దృశ్య కవాటాల రక్షిత కాపలా తాళాలు .... 

నగునూరి రాజన్న 
కరీంనగర్

భగినీ హస్తాలు

భగినీ హస్తాలు 

వలసలు ..... 

కటికాలు కాకపోయినా కలిగి బతకాలని 
చదువులే కాదు.....బతుకు చదివిన బాలలు 
ఒరిస్సా ఉత్తప్రదేశ్  బెంగాలీ బిహారీలంతా 
దక్షణాది దాపులకొస్తుంటే .......

ఇంకొంచం ఇనుమడించుకుందామని 
సాంకేతికతను సంతరించుకున్న 
దక్షణాది వాళ్లేమో దాటుతున్నారు ఖండాలు 
అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికాలు 
లండన్ యూరప్  కెనడాలు

వలసలన్నీ వంతులవారీనే 
కట్టే గుడ్డయినా కడుపుకు తిండయినా
పండుగైనా పబ్బమైనా ఆచారమైనా 
అరయ సాంప్రదాయమైనా
చివరకు బతుకు పోరాటమైనా ...... 

భళారె భలి రంగు రంగుల హోలీలు 
బహు సుందరమైన బంధాల రాఖీలు 
విందు భోజనాల భగినీ హస్తాలు 
నిరాహార పూజల కడువా చవితీలు....
ప్రకృతిని పరవశింపచేయు బతుకమ్మలైనా...... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ 

ఆకులో ఆకునై

ఆకులో ఆకునై 
తేది - 03-12-2019
శీర్షిక - నందన వనాలు ...  
సంఖ్య - 

కోట్ల సంవత్సరాల చరిత్రల ఆధారం 
ప్రకృతినుండే  పయనం ప్రారంభించినా  .... 
పర తమ బేధం ఒంట బట్టించుకున్నాడు 
కోతినుండి పుట్టాడు మానవుడన్నది.....  

కల్లా కపటాల కవాతులు కానని
హొయలొలికే జలపాతాలు   
దగా మోసాల దాఖలాలు లేని 
హాయి గొలిపే పచ్చికబయళ్ళు   

స్వార్థ నీడల జాడలు తెలియని
చెట్లు పుట్టలు కొండలు కోనలు  
అలసత్వాల ఆనవాలు లేని చోటు.....  
ప్రకృతి ప్రసాదించిన పర్యావరణం 

ఇవ్వడమే ఇలవరుసగా తెలిసిన 
ఇహలోక  నందవన  ఆనందాలు 
చూస్తేనే మనసు పరవశిస్తుంది.... 
ఆకులో ఆకునై నేను వెల్లి విరిస్తే 
మమత పొంగి పొర్లాదా .......  

నగునూరి రాజన్న 
కరీంనగర్

Tuesday, November 26, 2019

వెలుగు నీడలు 2019

నగునూరి రాజన్న 
వెలుగు నీడలు 
తేదీ 26 - 11 -2019 
శీర్షిక - వెలుగు విరామమైతే నీడ నిరసిస్తుంది. 
సంఖ్య - 322

వెలుగు పూలు పంచే 
విశ్వ రేడు అయినా ...... 
పిండి వెన్నెలలు ఆరబోసే 
శశి వదనుడైనా చేరలేరు 
విశ్వపు అంచులు సాంతం ఏక సమయాన .... 

నీ వెంటే నేనంటూ 
నీ తోడు నేనంటూ 
అడుగడుగున అనుసరిస్తూ 
ప్రతిచోటా పలకరిస్తుంది.... 
నీడై వెంబడిస్తుంది నిక్కచ్చిగా  
వెలుగును కమ్మేస్తుంది 
అర్ధ భాగం అటుఇటుగా ..... 

వెలుగునంటిపెట్టుకునే వేగుచుక్క 
అద్దుకునిలిచే పొద్దుతిరుగుడు పూవు 
అసలు రూపాలకు ఆనవాళ్లు 
చుట్టూ తిరిగే దగ్గరి చుట్టం 
అలికిడి చేయని అనుచరుడు..... 
ముద్దుగా పట్టుమని పట్టుబడదు 
మురిపంగా గారాలు పోయి చంకనెక్కదు 
చిక్కని దొరకని చిగురుటాకు ......  

విడదీయరాని అనుబంధం 
వివరించలేని ఆత్మీయం 
విసుగు విరామం లేకుండా 
అంటిపెట్టుకునే ప్రతిరూపం..... 
వెలుగు విరామంలో
నీడ కూడా నిరసిస్తుంది......  

నగునూరి రాజన్న
కరీంనగర్

ఆత్మ విమర్శ

నగునూరి రాజన్న 
ఆత్మ విమర్శ 
తేదీ 25 - 11 -2019 
శీర్షిక - తొంగి చూస్తే కదా.....  
సంఖ్య - 321 

ప్రాణులన్నింటికీ ప్రత్యేకమే అయినా 
మానవులకేమో మహోన్నతం సుమా! 
తన పర బేధాలు పాటించకుండా 
మంచి చెడుల మతలబుల బేరీజులకు 
న్యాయాన్యాయాల సునిశితాలకు 
అంతరిక్ష శిఖర పురోగమనాలకు 
ఆత్మ విమర్శను మించినది లేదు....... 

ఎవరో వచ్చి ఎదో అన్నాక 
ఎందుకు భంగపడాలి....... 
లోపలకు తొంగి చూసుకోగలిగితే 
లోపాలు సరిదిద్దుకోగలం....... 

నిజానిజాల నిప్పురవ్వలు 
నిలకడమీదైనా దహించకమానవు..... 
నీడలా వెన్నంటే దోషాలను 
నిత్యం పరికించుకోగలిగితే 
నిగనిగల ముత్యమై 
నిండు శ్వేత వర్ణమై 
నిజ శోభల వర్ధిల్లవా...... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ 

శుభలగ్నం

నగునూరి రాజన్న
శుభలగ్నం 
తేదీ 23-11-2019
శీర్షిక - అత్యంత శుభలగ్నం 
సంఖ్య - 320

కోటాను కోట్ల జీవాలుగా పరిణామం.... 
కోట్లాది జీవాలపై  ఆధిపత్యం సాధించగల..... 
మంచి చెడుల విచక్షణల మానవ జన్మ .....  
అమ్మ కడుపున పుట్టడమే అత్యంత శుభలగ్నం... 

అయాచిత యాదృచ్చికాలు కొన్నయితే   
అనుభవాల జోడింపుల క్రోడీకరణలతో  
ఆశయాల అనుకూలతలకై  అనుభవజ్ఞుల 
అమలు ప్రణాళికల నిశ్చయాలు చాలా..... శుభయోగం

అపురూప సందర్భాల సన్నివేశాలు  
అప్రతిహాత గమనాలకు 
అలవోక గమ్యాల చేరికలకు 
గృహ ప్రవేశం,వివాహం,వ్రతాలు,దీక్షలు .... శుభకార్యం 

కాల మాన పరిస్థితులను 
కరుణించే వాతావరణాలను 
కర్మానుకూలతలకు అనువర్తింప 
చేసుకోవడమే ........... శుభకరణం 

ఇవన్నీ ఒకెత్తయితే ..... 
పరిసరాల పతనాలను పక్కవారి మంచి చెడులను 
పదే పదే గుర్థించడమే కాకుండా .  
మనలోని మంచి చెడులు గుర్తించుకుని  
మననం చేసుకుని మసలుకోవడమే   ....
ఈ జన్మకు....  ప్రపంచానికి....    అత్యంత  శుభలగ్నం ...... 
 
నగునూరి రాజన్న 
కరీంనగర్

Friday, November 22, 2019

యుగళ గీతం (కవిత)

నగునూరి రాజన్న
అంశం - యుగళ గీతం   
తేదీ 22-11-2019
శీర్షిక -  కళల కాణాచిలో  కలికితురాయి
సంఖ్య -319

శ్రమైక జీవన సంద్రాన కొట్టుమిట్టాడే వేళ 
ఆటపాటల ఆనందాలే  తీరం చేర్చే నావలు .... 
నిత్య బతుకు పోరాటాల కడలిని దాటించే 
కూని రాగాల కోయిల మధురిమల కూజితాలు... 

అలుపు సొలుపుల ఉపసంహరణలకు 
అంతరంగపు భావ ప్రకటనల రూపాలు 
అంగాంగ  ఉపాంగాలే  భాగవత నాటకాలు  
సామాన్యుల సప్తవర్ణ సంతోషాల నిలయాలు 

సమయానుకూలంగా  సంధించుకున్నది
సాంకేతికతల సొబగులద్దుకుని 
సంక్షిప్త భావాల శబ్ద చిత్ర రూపంగా.....  
పౌరాణికాలతో ప్రారంభమైనా 
చారిత్రిక సాంఘికాలతో సావాసం చేసినా 
విప్లవోద్యమాలతో విలసిల్లినా 
కుటుంబ కథలతో ఫరిడవిల్లినా   
దశాబ్దానికో దిశను మార్చుకుంటూ 
దూసుకెళ్తున్న మలుపుల సాధనం..... 
కాలమేదైనా కళల చిత్రమేదైనా 
కమ్మని భావాలు పంచే  యుగళ గీతం
నాయికా నాయకుల ప్రేమలకు సాక్ష్యం 
కళల కాణాచిలో  కలికితురాయి .  
నగునూరి రాజన్న 
కరీంనగర్. 

ధృవ తార

నగునూరి రాజన్న 
ధృవ  తార 
తేది 21-11-2019
శీర్షిక - మార్గదర్శకులు .... 
సంఖ్య - 318

కఠోర పరిశ్రమలను కంఠ హారాలుగ ధరించి 
క్రమశిక్షణలను చంకన బెట్టుకుని  
పట్టుదల దీక్షలను శ్వాసిస్తే   
పట్టుబడే ఉన్నత శిఖర గమ్యమే  .... 

అంధకారాలు  అలుముకున్న వేళ 
ఆర్తితో తలుచుకుంటే చాలు తమకమై  
పోల్చుకుంటే చాలు మార్గదర్శనమౌ ... 
అనితరమైన అనన్య సాధకులు 
అప్పుడప్పుడు మాత్రమే తారసపడతారు ......   

ఆదిశక్తి కాళీ మాత అభయాలను 
అందిపుచ్చుకున్న పరమహంస 
పరివ్రాజకులైన  రామకృష్ణుడి ప్రియ శిష్యుడు 
భరతమాత ముద్దు బిడ్డడు నరేంద్రుడు.... 

నిరంతర స్వయాన్వేశి,
స్వయం క్రమశిక్షణలు సంధించుకుని
సానబెట్టుకున్న సంయమన శీలి..... 
అతివాదాలను మితవాదాలను అధిగమించి... 
కఠోర నియమ నిష్ఠలు విధించుకుని   
సత్య సంధత, అహింస, సత్యాగ్రహం 
సహాయ నిరాకరణ, నిరాహారదీక్షలు 
ఆయుధాలుగా మలుచుకుని 
ఆసేతు హిమాచలాన్ని  ఒక్క మాటపై నిలిపి 
రక్తమోడని రక్షిత స్వాతంత్య్రం సముపార్జించి
పదవులాశించని ప్రజల మనిషిగా
సచివాలయాల జాతి నేతగా 
విశ్వానికే మార్గదర్శియైన వినయశీలి
మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ..... 

అందిపుచ్చుకునే అవకాశాలు లేకపోయినా 
ఆత్మ స్థైర్యం ప్రోది చేసుకుని 
అనితరసాధకుడై ఎదిగిన అబ్దుల్ కలాం గారు ....  
అందరూ దృవ తారలే..... 
ఎందరో మహానుభావులు  అందరికి వందనాలు ..... 

నగునూరి రాజన్న 
కరీంనగర్

దూది మేడ

నగునూరి రాజన్న 
అంశం - దూది మేడ
తేదీ - 20-11-2019
శీర్షిక -  దూరపు కొండల నునుపే..... 
సంఖ్య - 317 

చూసే వారికి  సునాయాసం .....  
చేసే వారికే భారం  బాధ్యత .....  
ముగింపు సులభమయినా కాకపోయినా.... 
ఆరంభం  ఆపసోపాలు ఆచరణ అష్టకష్టాలు... 

పండు వెన్నెలలను వెదజల్లుచు    
వెండి కొండలను తలపించే 
నిండు పున్నముల శ్వేత వర్ణపు 
కొండ రాశులను పండించడానికి 
ఆరుగాలం కష్టించే హాలికుడు సైతం.... 

ప్రతిఫలం అందుకోవడంలో 
దగాకోరు దళారుల దమననీతికి 
దశాబ్దాల కాలం నుండి 
బలవుతూనే ఉన్నాడు....... 

పరాచికాల పాలకుల 
పలకరింపులు వెక్కిరిస్తున్నా 
పసిమి సమయాల 
పచ్చదనాలకై  పడికాపులు కాస్తునే ఉన్నాడు.... 

రంగులే జీవితంగా 
రంగు రంగుల ప్రపంచంలో 
సరాగాలు పలికిస్తూ 
సకల జనులను సంతోషింపజేస్తూ 
రాజ్యమేలుతున్నారనుకునే వారిలో కూడా 
రాలిపోయే సమిధలెన్నో...... 

తరచి చూస్తే తప్ప దొరకని  
తీరం చేరని అలలని....    
మెరిసే మేలిమి లన్నీ 
దూరపు కొండల నునుపేనని  .... 

నగునూరి రాజన్న 
కరీంనగర్

విదుషీమణి

నగునూరి రాజన్న
అంశం -  విదుషీమణి 
తేదీ 19-11-2019
శీర్షిక - మానవతకు మచ్చుతునక ... 
సంఖ్య - 316

అల్బేనియాలో పుట్టిన ఆడపడుచు 
ఆదరించి నిలిచె అనాథలను వృద్ధులను 
ఆత్మీయతలు చాటి ఆదరించె కదా 
అతిక్లిష్టపు అనారోగ్యులను సైతం ...... 

ఒక్క అడుగుతో మొదలైన ప్రస్తానం 
వేల అడుగుల సావాసమై నిలిచె .... 
ఒంటరి పోరాట విజయ విహారం 
ఒనగూడె  మిషనరీస్ అఫ్ ఛారిటీ ద్వారా ..... 

అంటరాని అనారోగ్యాల బారిన పడిన 
అనేక దేశాల ఆకలి గొన్న అల్పాదాయులకు 
ఆమె కదా... విశ్వశాంతి మాతై వెలుగొందే 
విరిసిన మానవత్వానికి విశిష్ట మార్గదర్శిగా. 

పాల పొంగుల పండు వెన్నెలలను 
పంచే శశి సుందర సుదూర దృశ్య మాలికలా 
పల్లవించిన విదుషీమణి సైతం 
మూటగట్టుకునె కొన్ని నీలి నీడలు...... 

ఏమైతేనేం..... 
మానవత్వం వెల్లి విరిసింది 
దైవత్వం సంతరించుకున్నది 
మానవతకు మచ్చుతునక ...   
అన్నీ ఉన్న ఆకు అణిగి మనిగి .. అన్నట్టు 
ఎందరో మహానుభావులు ..... 
అందరికి వందనాలు 


నగునూరి రాజన్న
కరీంనగర్ 

బాలల దినోత్సవం 2019

నగునూరి రాజన్న 
అంశం: బాలల దినోత్సవం 
తేదీ 14 -11 -2019 
శీర్షిక : బంగరు భవిత మా హక్కుభుక్తం....
సంఖ్య : 315 

చిన్ని చిన్ని బాలలం 
సిరులొలికించే మొగ్గలం  
అమ్మ నాన్నల అడ్రసులం 
భావి భారత పౌరులం  .....
 
చిట్టి పొట్టి కానుకలతో 
చిరాకులే పెంచకండి ....
చిరంజీవులుగ మేము బతుక 
స్వచ్చతను మాకు వదలండి ......

అన్నింటా పాశ్చాత్యమంటూ 
అంటిచుకున్నారు నాగరికతలో 
అక్కెరకొచ్చే స్వచ్చతలో మాత్రం 
అడుగు ముందుకు వేయరెందుకో.... 

దైవ రూప సాక్షులం 
దేవులాడే బతుకు పోరులం 
దెబ్బదేండ్లు గడిచినా 
దెబ్బలు తినే చదువులేనా ........

ఉరుకుల పరుగుల చదువులతో 
ఊపిరి సలపని ఇంటి పనులతో 
ఉసురు తీస్తున్నారు మా తరానికి 
ఉచితమేనా ప్రశ్నించుకోండి ......

పుష్టి నిండిన భావి తరానికై
పౌష్టికాహారం అందించండి 
పుర స్వచ్చతలు పాటించండి 
స్వచ్ఛ నీరు గాలి వదలండి 

స్వార్థాలను సమాధి చేయండి 
సరళమైన విద్యలు నేర్పండి 
సుందరమైన ఆరోగ్యాన్నివ్వండి 
బంగారు భవిత మా హక్కుభుక్తం....

భావి తరాలకు బాధ్యతగా 
బలీయమైన పాలనలు అందించండి....

నగునూరి రాజన్న
కరీంనగర్. 

కార్తీక పౌర్ణమి .....2019

నగునూరి రాజన్న 
అంశం: కార్తీక పౌర్ణమి .....2019
తేదీ 12 -11 -2019 
శీర్షిక : దేదీప్యమానం....
సంఖ్య - 314 

భూమి తన చుట్టూ తాను తిరిగి 
సూర్యుని చుట్టు తిరిగిన చందంగా......
నిత్య జీవన పోరాట పరిక్రమలో  మునకలేస్తూ....
అప్పుడప్పుడు 
మన పుట్టుకకు జీవన వృద్ధికి వ్యాప్తికి 
కారకమయిన  అనంత సృష్టి రహస్య 
ప్రత్యక్ష ప్రకృతికి మరియు పరోక్ష మూలకాలైన 
కోటానుకోట్ల దేవతలను కాలానుగుణంగా తలుచుకుని 
కృతజ్ఞతాభావంగా   ప్రణమిల్లడానికి 
అనుభవజ్ఞులు పూర్వీకులు ఏర్పరచినవే 
ఈ ప్రత్యేక పర్వదినాలు. 

పారేటి నీటిన పరవశాలు పొంది  
ఉసిరి స్నానాల ఉల్లములు సంతసించ.....
దివి బోలు భూదేవి దీపకాంతుల
శోభిల్లు హరిహరుల మండపాలు 
నిండైన భక్త జన సందోహాల.......



ఋతువు మారితే బతుకు మారు
సంధికాలాన ఆరోగ్య సర్దుబాట్లకై 
అనుభవజ్ఞుల ఆలోచనల వెసులుబాట్లు 
హరి హరుల పూజల కార్తీక పౌర్ణమి.... 

నగునూరి రాజన్న
కరీంనగర్. 

వనభోజనాలు

నగునూరి రాజన్న
అంశం: వనభోజనాలు 
తేదీ- 02 -11 -2019 
శీర్షిక - ఆరోగ్యమె ఆదిమూలం....
సంఖ్య :

కాలాలన్నీ కమనీయమే    
కనువిందు చేయు మనోహరమై
వర్షరుతు కనుమరుగై 
శరదృతువు ఏతెంచ......

కోరి చేరిన కొత్తనీటి చెంత 
కోతిగుణపు క్రిములు చేరు 
వాలు చూసి వాత బెట్టు
వాటమైన హాని చేయ మానవాళికి....

ఆరోగ్యమే ఆనందాల మూలమని 
ఆనాడే ఆచరించిరి ఆర్యులు 
అనేకమయిన కాలానుగుణ 
ఆచార సాంప్రదాయాలు........

సూక్ష్మజీవుల నుండి సురక్షితం కోరి 
మెరుగైన ఆరోగ్యం మేలు కోరటంచు 
మెండుగా కలిగిన మేలైన ప్రాణవాయుకై 
దండుగా కదిలేరు నిండు స్వాగతం పలుక....

పారాడి వచ్చెదరు ప్రతిఒక్కరు 
పరుగుపరుగున వనభోజనాల పేరిట 
పచ్చపచ్చని ప్రకృతమ్మ ఒడిలోకి 
పరవశించ అంత పిల్లాపాపలతో..... 

నగునూరి రాజన్న
కరీంనగర్ 

ఉసిరి

నగునూరి రాజన్న
అంశం - ఉసిరి
తేదీ -06 -11 -2019 
శీర్షిక - ఆయుశ్శుకు ప్రపూర్ణం....
సంఖ్య - 311 

ఆరోగ్యమే మహాభాగ్యమటంచు
అందరికి తెలుసా అంటే...తెలుసు మరి... 
కాలానుగుణంగా కాయము కాపాడుకొనుటే....
అయినా అక్షరాలా ఆచరించేది కొందరే సుమా!

అన్నిటికన్నా ఆదిమూలం ఆరోగ్యమేనంటూ 
ధన్వంతరిగా దైవం ధరణిలోవర్ధింప జేసి
శుశ్రూతునితో ఫరడవింప జేసిన వ్రతం
ప్రజారోగ్యమే పరమావదన్నది నిక్కము....

దేవతల మేథోమథనాల జనియించి
ప్రజల ఆరోగ్యాల పరిరక్షణలకై పయనించి
ఋషులద్వారా ప్రజల్లోకి పల్లవించి
పదిలమై నిలిచింది ఆయుర్వేదం......

అంత: బాహ్య సౌందర్యాలకు 
అసలు కిటుకు అంగాంగ సంరక్షణమే
మేనుకైనా మేధకైనా పేరెన్నిక గని
మెప్పులు పొందిన పెన్నిధి మన ఉసిరి....

ఒకటి కాదు రెండు కాదు ఆసాంతం ....
చెట్టు బెరడు ఆకు పువ్వు కాయ....ప్రతీది....పవిత్రమే 
వాంతులు విరేచనాలు అజీర్ణం హుష్ కాకి....
పుష్కలమైన విటమిన్ సి రోగనిరోధకాలు 
ఆంటీ ఆక్సిడెంట్లకు నిలయం మన ఉసిరి...

నిజం చెప్పాలంటే ఉసిరి మన వెంట ఉంటే 
ఉసురు లేదు మన ఆరోగ్యానికి...
ఆరోగ్యకరమైన ఆయుష్షుకు ప్రపూర్ణం.......
అందుకే పూజనీయం...
పూర్వీకులనుండి పుణికి పుచ్చుకున్న అపూర్వం... 

నగునూరి రాజన్న
కరీంనగర్. 

భగినీ హస్తాలు ..... వలసలు .....

వలసలు ..... 

కటికాలు కాకపోయినా కలిగి బతకాలని 
చదువులే కాదు.....బతుకు చదివిన బాలలు 
ఒరిస్సా ఉత్తప్రదేశ్  బెంగాలీ బిహారీలంతా 
దక్షణాది దాపులకొస్తుంటే .......

ఇంకొంచం ఇనుమడించుకుందామని 
సాంకేతికతను సంతరించుకున్న 
దక్షణాది వాళ్లేమో దాటుతున్నారు ఖండాలు 
అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికాలు 
లండన్ యూరప్  కెనడాలు

వలసలన్నీ వంతులవారీనే 
కట్టే గుడ్డయినా కడుపుకు తిండయినా
పండుగైనా పబ్బమైనా ఆచారమైనా 
అరయ సాంప్రదాయమైనా
చివరకు బతుకు పోరాటమైనా ...... 

భళారె భలి రంగు రంగుల హోలీలు 
బహు సుందరమైన బంధాల రాఖీలు 
విందు భోజనాల భగినీ హస్తాలు 
నిరాహార పూజల కడువా చవితీలు....
ప్రకృతిని పరవశింపచేయు బతుకమ్మలైనా...... 

నగునూరి రాజన్న 


కరీంనగర్ 

ఆనందమె జీవిత మకరందం

నగునూరి రాజన్న 
అంశం: ఆనందమె జీవిత మకరందం
తేదీ:  30 -10 -2019 
శీర్షిక -   స్వయంకృతం....
సంఖ్య- 309

ప్రకృతే మనకు ప్రథమ పాఠశాల 
పరికించు మిత్రమా..............
ఇవ్వడంలో ఇమిడిన సుగుణం 
పొందడంలో పోగుట్టుకుంటున్నాం.....

మార్పు మంచిని కోరేదైతే
కూర్పు కోతినుంచని మరువద్దు  
అప్పుడప్పుడు ప్రయత్నిస్తే అభాసే
అనితరమై సాగితేనే సొగసు మిత్రమా!

పక్కవారి దోషాలను పదే పదే ప్రస్తావించకు
ప్రతి చిన్న పొరపాటును తప్పుగా పరిగణించకు 
పరిధి హృదయాన పరుచుకో విశాలంగ
ప్రయత్నించి సాధించు ప్రశాంత వాతావరణం ......

ఇస్తినమ్మ వాయనం 
పుచ్చుకుంటినమ్మ వాయనం 
మనతోనే మంచి మొదలవ్వాలి 
మంచికి నాంది మనమే అవ్వాలి .....

స్వార్థాలకు సంకెళ్లు వేసి
పరమార్థాలకు పాకులాడితే 
పట్టుబడదా నిష్ఠ కలిగిన 
పట్టు తేనెల మధురిమలు ...... 

నగునూరి రాజన్న
కరీంనగర్. 

చినుకు మాట్లాడితే

నగునూరి రాజన్న 
అంశం: చినుకు మాట్లాడితే
తేదీ:  22-10 -2019 
శీర్షిక - అవని చిత్తడి.... 
సంఖ్య- 308

చినుకు సోకి చిందేయగానే 
నెర్రెలూనిన నేలమ్మ నింగికెగురు
ఆహ్లాద వర్షాలు ఆవరించంగా 
కఠిన గ్రీష్మాలు కనుమరుగు మిత్రమా ....

చినుకు మాట్లాడితే అవని చిత్తడే
చిగురు తొడుగు చెట్టు చేమ నిక్కము
ధరణి పులకరించి తండ్లాటలు బాపు
బతుకు దొరుకు చేవ కలుగు ప్రాణకోటికి..

అనావృష్టి అతివృష్టి అల్లకల్లోలమే
అరకదున్నే  రైతన్నలకు అతలాకుతలమే 
సమవృష్టి అయితేనే సమ సమాజం 
సక్కనై సాగుతుంది బతుకుదెరువు అందరికి...

రైతన్న జీవితాన రాచబాట 
చేతివృత్తులకు చేయూత పనిపాట
పిల్ల పాపలకేమో కంటి వెలుగు 
ప్రాణికోటికి పంచు దరహాస స్వప్నాలు......

నీటి చక్రం కరుణిస్తేనే పండంటి జీవితం 
పర్యావరణం పరిరక్షిస్తేనే అందుకు సాకారం 
ప్రతివారు కదిలితేనే ఏదైనా సాధ్యం 
మనకెందుకులే అనుకుంటే విస్ఫోటనమే......

నగునూరి రాజన్న
కరీంనగర్

జడ కుచ్చులు

నగునూరి రాజన్న 
అంశం: జడ కుచ్చులు
తేదీ:  21 -10 -2019 
శీర్షిక -  భారతీయం....
సంఖ్య- 307

అతివల సహజాభరణాలు 
అరయ నిశి బోలిన కేశాలు 
సహజ సుందర జలపాతాలు 
సరసిజల శిరోజ భాండాగారాలు .... 

ఆడవారి సున్నిత అందాలకు 
సొబగులద్దే సుందర సాధనాలు 
మగవారి మనసులు దోచే 
మతుల  భ్రమణ కారిణులు .......

రింగుల వంకీలైనా రివ్వుమను పిల్లగాలులు 
అందము లినుమడించు సుందర సుతారంగా 
మరులు గొలుపు పురుషపుంగవులకు
కురుల సిరుల జగనపు సిరి మగువల.....

అచ్చమైన సమయసూచి లొలాకమే 
అలివేణులకు అమరిన జడ కుచ్చులు
వగలు రేపి వయ్యారాలు బోవు 
సిరి సిరి మువ్వల జేగంటలు ...... 

అరవిరిసిన పూలమాలలు 
అలంకారాల సుందర సౌరభాలు 
గుభాళించు జడన విరిబాలలు 
మల్లె గులాబీ చామంతుల శోభలు......

సాదాలైన వంకీలైనా సౌరభాల గుభాళింపే 
జుట్టేదైనా ఆడపిల్లలకు జట్టుకట్టు ఆనందాలు 
అలవోకగా సింగారిచే అందమైన కురులు 
సిరులొలికించే చిన్మయ భారతీయం ....

నగునూరి రాజన్న
కరీంనగర్. 

పెళ్ళి చూపులు

నగునూరి రాజన్న 
అంశం: పెళ్ళి చూపులు
తేదీ:  19 -10 -2019 
శీర్షిక - మున్ముందటి తతంగమే పెళ్లి చూపులు .......
సంఖ్య- 307

ఆచారమో  ఆమోదయోగ్యమో  సశాస్త్రీయమో 
ఆడపిల్లను అత్తవారింటికి 
పంపాలన్న అమ్మానాన్నల 
ఆరాటాల ప్రతిరూపానికి  ప్రథమాంకం.....

సంస్కృతి సంప్రదాయాల సంపదలతో 
సంఘజీవి సంస్కరింపబడటమే...ప్రధానం 
ఆయురారోగ్యాల భోగమే అవనిలో మేలైన భాగ్యం 
మనిషెప్పుడూ ఆనందాలవైపే మొగ్గు....

పుట్టుక నుండి పుడకల వరకు  మనిషి 
మెట్టు మెట్టుకు ఉత్సవాలే... శోభాయమానమే... 
పట్టు కలిగి నిష్టగా గరిమై జీవించాలంటే 
పుట్టు పూర్వోత్తరాల చరిత్రలే ఆధారాలు.....

సవ్య దిశన సంఘపురోభివృద్ధికై నిలిచే
సత్సంతాన వ్యవస్థార్థం...ఉత్తమ ఉపనిషత్తుల 
ఉపయుక్తమైన సమంత్రీక పెళ్లి తంతులో వెలిసిన 
ముప్పదారు పెళ్లి ముచ్చట్ల  మురిపాల పట్టికలో 
మున్ముందటి తతంగమే పెళ్లి చూపులు .......

కలిగిన వారికి కలిగినంత 
కలికి మా లక్ష్ములకు కఠిన పరీక్షలు
కథానాయకులతో ముఖాముఖి
కాలమాన విధానాల కలయికలు....

మంచి మనుషుల కలయిక కోసం 
మంచి మనసుల వెతుకులాట .....
ముచ్చటైన సుముహుర్తాన ఏర్పరిచే 
ముదం కూర్చు పెళ్లి చూపులు  .........

రాబోవు తరం రత్న విలువ ఖచితమవ్వ
రాచమార్గమేర్పరిచే సమంత్రీక పెళ్ళితంతున
పెద్దల ఆశీర్వాదాయుక్తమైతే ప్రశాంతతే 
తరమంతా.... పారమార్ధమే పెళ్ళిచూపులు .. 

నగునూరి రాజన్న
కరీంనగర్. 

కరి వేప

నగునూరి రాజన్న 
అంశం: కరి వేప
తేదీ:  18 -10 -2019 
శీర్షిక - హరిత చరితము
సంఖ్య- 306

హరితమే కదా మానవ చరితమూ... హితం 
కరుకు బెరుకులు కనబరిచినా...కమ్మదనం 
సువాసనలు వెదజల్లే....సమ్మోహనం 
సురుచిర వంటకాల ..... సుగంధం ...... 

కొలువతరమా నీ కమ్మదనం ....
విలువల జోడింపే.... ప్రతి వంటకం 
ఇంపదు నీవు లేక .... తాలింపు 
సొంపదు నీవు కలువక... పులిహోర దద్దోజనం ....

సూక్షంలో మోక్షమై నిలుస్తావు 
మోతాదు చిన్నదైనా 
మోగిస్తావు  నగారా రుచులలో....
పచ్చళ్ళైనా పరిమళించు నీ చిగుళ్ళతో......

కాల్షియములు నిండుగా కలిగి 
క్యాన్సర్లను దూరముంచే ప్రభావశీలివంటూ 
కడు సుగుణాలను సంతరించుకున్న 
కరదీపిక ఔషధాన.... ఆయుర్వేద విఫణియందు....అయినా.....

కలిమాయల ప్రభావమో ఏమో కాని
కన్న తల్లిదండ్రులను 
కలిసి నివసించే బంధు మిత్రులను 
అవసరానికి వాడుకుని ఆనక విస్మరిస్తూ .....  మనుషులు
నిన్ను సామెతగా వాడుకుంటున్నారు సుమా... 

నగునూరి రాజన్న
కరీంనగర్. 

అమావాస్య చంద్రుడు

నగునూరి రాజన్న 
అంశం: అమావాస్య చంద్రుడు
తేదీ:  17 -10 -2019 
శీర్షిక - విను వీధిన నిలిచిన శ్వేత విహంగం
సంఖ్య- 305 

విను వీధుల ప్రపంచ పాలపుంతల్లో 
విశ్వానికి పున్నమి వెలుగులు పంచే
అందమైన సుందర చంద్రమలెన్నున్నా
అవనికి సోదర వరసైన మామేకదా... మన చందమామ

నిశి చీకట్లను పెనవేసుకున్నా 
వసివాడని విశ్వ చరితకు 
ప్రతీది ప్రకృతి ధర్మమేనంటూ 
ప్రస్ఫుటపరిచే పచ్చి నిజపు ఆనవాళ్లు.... 

కృష్ణమందు క్షీణిస్తూ 
శుక్లమందు వృద్ధిచెందుతూ 
కటిక చీకిటికి కరవాలమై నిలిచే 
నిశి రాత్రుల చెరబట్టే నక్షత్ర రేడుగా
జీవితాన కష్ట సుఖాలు కలిమి లేములు 
కలిసి ఉండే ఆనవాళ్లేనని 
చెప్పకనే చెప్పిన స్థిత ప్రజ్ఞత సూచీ!

నాగరికతల పోకడలతో 
నరునికి కాల గణనల మూలమై 
నక్షత్రాల కదలికల సంబంధాలను బోధపరుస్తూ
మీన మేషాల పంచాంగాలకు ఊతమైంది...

సాంకేతికత సమృద్దతతో 
అంతరిక్షపు వింతగా 
ఖగోళ విషయ పరిజ్ఞానపు 
వింతల శోధన సాధనంగా
విను వీధిన నిలిచిన శ్వేత విహంగం....

నగునూరి రాజన్న
కరీంనగర్ 

నిదురించిన నిశ్శబ్దం



నగునూరి రాజన్న 
అంశం- నిదురించిన నిశ్శబ్దం 
తేదీ - 15 -10 -2019 
శీర్షిక - ప్రాణ వాయువు సంత వస్తువు.....
సంఖ్య - 304 

కలి నీడల కబంధ హస్తాలో
కాల మార్పుల ప్రభావ కల్మషాలో
కాలం మారిందని సరిపెట్టుకోవాలో 
స్వార్థచింతనల పెనవేతలతో
కలసికట్టుగా మనుషులంతా  
కసిగట్టినట్టు కక్ష సాధిస్తుంటే 
అలసత్వాల జోల పాడుతుంటే......

పసిమి ఛాయల ప్రకృతి సోయగాలు
పల్లవించే కొండచాయల నీటి జాడలు
అల్లనల్లన వీచే పిల్లగాలుల వాలు తెమ్మెరలు
అందాలారబోసే సుందరమైన లోయలు 
అన్నీ కథలలో మాత్రమే ప్రస్తుతించే కథా వస్తువులవుతుంటే.....

కలుషితాల పుణ్యమా అని 
కడుఁపు మంటలార్చుకునే 
కమ్మని మంచినీరు సైతం
కాసుల కొలతలయి పోయాయి.....

స్వార్థాలమాటున సక్కబెట్టుకుంటున్న
సందట్లో సడేమియాల్లాంటి దళారీలు
ఆగడాలు శ్రుతిమించుతున్న రాబందులు
పారిశ్రామిక ఫలితాలని వల్లె వేసినా......

ముంచుకొచ్చే ముసలంలా 
నిదురించిన నిశ్శబ్దంలా ఎంతో దూరం లేదు 
దుమ్ము ధూళిలో కొట్టుమిట్టాడుతున్న 
ప్రాణాలు నిలిపే వాయువులు సైతం 
పణంగా దొరికే సంత వస్తువు కావడానికి .... 


నగునూరి రాజన్న
కరీంనగర్. 

Friday, October 4, 2019

వార్త పత్రికలు

నగునూరి రాజన్న
అంశం - వార్త పత్రికలు
తేదీ - 04-10-2019
శీర్షిక - వారధి ...
సంఖ్య -  303

ఊరంతా నిదుర మత్తు వదలకముందే
ఊసులన్నీ పోగేసుకుని ఊరిస్తుంది
ఉరుకుల పరుగుల పోటీ జీవితాలకు
ఉషారులూదే విశిష్ట మేధో కరదీపిక ....

కారణం ఏదైనా కరెక్ట్ సమయానికి
అందలేదో .... అంతా అయోమయమే....
పక్క ఊరు  ముచ్చట్లయినా మంచిదే
మొక్కవోకుండా ముందుగా తెలుపుతుంది....

భాషాభివృద్ధికి బహుదూరపు బాటసారి
చరిత్రల ఆనవాళ్లకు అందమైన ఆధారం
విద్య శాస్త్ర సాంకేతికతల సవ్య దిక్సూచి
విజ్ఞాన వినోదాల సమగ్ర దర్శిని .....

ఒకప్పుడు ధర్మానికి నాలుగు పాదాలు ... 
ఇప్పుడు రామరాజ్యమంత రంజిల్లకపోయినా
ప్రజాస్వామ్య ఫరిఢవింపుకు
ప్రశ్నించే ప్రజా గొంతుక పాత్ర పోశిస్తున్నది ....

అందమైన వ్యాపార వాణిజ్య ప్రకటనలిచ్చినా
అచ్చమైన సేవలకు ఆనవాళ్లు.....
అక్కడక్కడ అపవాదులు మూటగట్టుకున్నా
ఎంతో కొంత ప్రజా సంక్షేమాన్ని సృశిస్తున్నాయ్....


సాంకేతికత సంధి సవాళ్లనెదుర్కొంటున్న
సజీవ సాక్ష్యాలు ....
ప్రజలకు ప్రభుత్వాలకు వారధులైన పత్రికలను
ప్రజలు ప్రభుత్వాలే పనిగట్టుకుని  పరిరక్షించాలి ....


నగునూరి రాజన్న
కరీంనగర్




Wednesday, October 2, 2019

గాంధీజీ/శాస్త్రీజీ (గ్రామస్వరాజ్యం)

నగునూరి రాజన్న
అంశం - గాంధీజీ/శాస్త్రీజీ (గ్రామస్వరాజ్యం)
తేదీ  02-10-2019
శీర్షిక - అంతా తూచ్.....
సంఖ్య -302

జయంతులు సమమయిన జయకేతనాలు 
ఖగోళాన నిలిచిన జాతి జంట నక్షత్రాలు 
భారతావనికి  భగవంతుడిచ్చిన సూర్యచంద్రులు 

తెల్లోడి  మెడలు వంచి నిలిచిన ఖడ్గం
అహింస సత్యాగ్రహముల శాంతి మంత్రం....
ఆసేతు హిమాచలాన్ని ఐక్యతగ  నిలిపింది
మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ చేతి తంత్రం

పొరుగు ముష్కరుల పాలిట సింహ స్వప్నమై
శతగ్నులు పేల్చి జూలు విదిల్చిన సింహం ...
హరిత విప్లవానికి  బాటలు వేసిన వైనం
జై జవాను జై కిసాన్ శాస్త్రి గారి  నినాదం

స్వార్థమెరుగని సచ్చరిత సరంగులు
నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనాలు
పదవులంటే పాకులాడని నాయకులు
సాకులు తెలియని నాయక సాక్ష్యాలు...

ఆర్థికతను సాంతం అర్థం చేసుకుని
సామాజికతను ప్రేమగ  చంకనేసుకుని
బాధ్యతల బరువులను పంచుకుని
పల్లెలు పరిపుష్టమైతేనే ప్రగతి సాధన
అన్నారు ఆనాటి నాయకులు....

దెబ్బదేండ్లు గడిచినా ఇబ్బందులే ఇంకా  ....
పల్లె ప్రగతి కాదు ... పాలకుల ప్రగతే ...
చర్చల దశ దాటదు ప్రణాళికల దశ చేరదు
అమలు దశకు ఆమడల దూరం.....
అధికారమైనా  అప్పోజిషన్ అయినా
అంతా పకడ్బందీనే ...  ఆనవాలు లేకుండా....
కాగితాలకే పరిమితం ... అంతా తూచ్......

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA) 

Monday, September 30, 2019

బ్రహ్మోత్సవాలు

నగునూరి రాజన్న
అంశం - బ్రహ్మోత్సవాలు
తేదీ - 01-10-2019
శీర్షిక - నేత్ర పర్వం .....
సంఖ్య - 301

బ్రహ్మోత్సవం పేరు వింటేనే
బ్రహ్మానందం పరమానందం...
అలంకారయుక్త స్వామి దర్శనం
అంగ రంగ వైభవ నేత్ర పర్వం .....

అడవి దర్భ నుండి అలంకారం వరకు
పుట్ట మట్టి నుండి పూల మాలల వరకు
దేవతా ఆహ్వానం నుండి వీడ్కోలు వరకు
దేదీప్యమానమే దేవదేవుని కార్యక్రమం...

విశ్వక్సేనుని ఆరాధనతో విరాజింపజేసి
నవధాన్యాల అంకురింప చేసి
సోమాధిపతిగా శుక్లపక్షంలో జరిపే
శ్రీ దేవీ భూదేవి మలయప్పస్వాముల ఉత్సవం... 

ధ్వజారోహణముల ఆహ్వానాలంపి
ముక్కోటి దేవతలు ఒక్కటై ఏతెంచ
ముదము గొలుపు శ్రీవారి ఉత్సవాలు
తీరొక్క వాహనంతో  రోజుకో రీతిగా....

తొమ్మిది రోజుల ఆనందోత్సవాలు
చక్ర స్నానమే చివరి అంకముగ
ధ్వజ అవరోహణంతో దేవతా వీడ్కోలు
కోట్లాది భక్తుల కోరికలు దీర్చంగ....

కొండా కోనా నిండు జన సందోహం
దండి భజనలతో స్వామిని వేడి
చిత్ర విచిత్ర వేష ధారణలతో
చిన్మయ రూపుని కొలుతురు తనివిదీర ....

సకల జనుల సంక్షేమమే ధ్యేయం
సర్వాంతర్యామి ఉత్సవాల మనోగతం
దుష్ట శిక్షణ శిష్ట రక్షణే పరమార్థం
లోక కళ్యాణార్ధమే స్వామి కళ్యాణం

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Thursday, September 26, 2019

పదవీ విరమణ 1 & 2

నగునూరి రాజన్న
అంశం - పదవీ విరమణ
తేదీ - 30-09-2019
శీర్షిక - పర్వ సమమే....
సంఖ్య - 300

పదవీ విరమణ నిజంగా పర్వ సమమే

అర్ద జీవిత కాలం
ఆనందాలు పంచుకున్న పూల వనం
దాదాపు నాలుగు దశాబ్దాల ప్రయాణం
ఎన్నో మనస్తత్వాల శోధన బోధనం
రెండు ఉద్దండ పరిశ్రమలలో అనుభవం ....

అమ్మ నేర్పిన మన్నన
ఆనందాల కొలువులు
అందుకున్న రోజు నుండి
ప్రతిజ్ఞలు బాసలు చేయకపోయినా...
సత్ప్రవర్తనలతో సంతృప్తిని పొందిన కాలం ....

అనుదినం సహచరి తోడ్పాటు
సమయ పాలన సముచిత సేవలతో
పదిలమై  నడచిన బాధ్యతల నిర్వర్తనలు
పలు అత్యవసరాలలో ఆపత్కాలాలలో
పడిన తపనలే అందుకు తార్కాణం .....

మరువలేని మిత్రుల సహకారం
స్వచ్ఛమైన స్వేచ్ఛ నీడన
దేశ ప్రగతిలో నేను సైతం
సేదదీరుతూ సేవలందించి
మచ్చ లేకుండా మలి దశ తీరం చేరడం....

నేను చేసిన సేవల ఫలితమే
అంచెలంచెలుగా ఎదిగిన నా పయనం
అడుగడుగున పొందిన అవార్డులు రివార్డులు
అత్యున్నతంగా ఆఖరు రోజున పొందిన
కార్య నిర్వాహక సంచాలకులచే  స్వర్ణ సత్కారం

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)



నగునూరి రాజన్న
అంశం - పదవీ విరమణ  2
తేదీ - 30-09-2019
శీర్షిక - పర్వ సమమే....
సంఖ్య - 300

పదవీ విరమణ నిజంగా పర్వ సమమే
అవసరమా  సాదృశ్య సాక్షతలు
అడుగడుగున కదిలిన నీ నీడలు
ఆత్మ సాక్షిని సంతృప్తి పరచగలిగితే...

ఆనందాల కొలువు అందుకున్న నుండి
ప్రతిజ్ఞలు బాసలు చేయకపోయినా...
పదిలమైన మన బాధ్యతల నిర్వర్తనలో
పడిన తపనలే అందుకు తార్కాణం అవుతే ....

అత్యవసరాలలో మనం చూపిన చొరవ
ఆనవాయితీగా నెరిపిన ప్రజా సంబంధాలు
ఆపద సంపదలలో  మనమాదుకున్న
అత్యంత ఘనమైన మానవతా దృక్కోణాలు...

మంచి చెడులకు మన పై అధికారులు
మచ్చుకు చూపిన మానవతా దృక్పథాలు ...
మన పని తీరుతో నడవడికతో తోటి ఉద్యోగులు
మన మీద ఏర్పరుచుకున్న భావనలు ....

అందుబాటైన అడ్డదారులు వదిలి
స్వచ్ఛమైన స్వేచ్ఛ నీడన సేవలందించి
అంచెలంచెలుగా ఎదిగిన సమయం
మచ్చ లేకుండా మలి దశ తీరం చేరడం....

సరియగు అర జీవన సమయంలో
సంధించుకున్న మన ధోరిణియే..
అందుకు తార్కాణం అయి నిలవదా
తదుపరి మంచి చెడుల ఉటంకాలకు...

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Monday, September 23, 2019

బతుకమ్మ

నగునూరి రాజన్న
అంశం - బతుకమ్మ
తేదీ  - 28-09-2019
శీర్షిక - ప్రకృతి పూవుల పూజ
సంఖ్య - 299

పంచ భూతాల పదనిసలే కదా
చరాచర ప్రాణకోటి విశ్వఛాయలు
మనసు పెట్టి పలకరిస్తే ప్రకృతిని
మమతలు నింపుకుని పులకరించదా!
తిరిగి మనను పలకరించదా ....

కొత్తనీటి తటాకాలు జీవకోటి  ఖజానాలు
ప్రవాహాల వాగు వంకలు ప్రజా జీవన సౌరభాలు
శక్తి రూపక ప్రకృతి పూజల పూవులే
మన తెలంగాణా బతుకమ్మ సందళ్ళు ...

ఆర్భాటాలు ఆడంబరాలను అధిగమించి
అనునిత్యపు కష్టసుఖాలనే  రంగరించి
అమ్మవారిని కొలిచెదరు ఆరాధనగా
అతివలంతా గూడి ఆడి పాడేరు రాగయుక్తంగా .....

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు
అష్టమి వరకు తొమ్మిది రోజులు... దుర్గాష్టమిన
ఇంపైన తంగేళ్లు ఇరగబూసిన సీత జడలు
గుబురైన గుమ్మళ్లు జోరైన ఉద్రాక్షలు
నీలాల కట్లలు నింగిలో శంఖులు
బంగారు బంతులు బతుకు గోరంటలు
పచ్చని చామంతులు పసిడి మల్లెలు    
అందంగ పేర్చెదరు  అమ్మ రూపాన్ని
అందునా చేర్చెదరు  పసుపు గౌరమ్మను
ఆదరించి మమ్మాదుకొమ్మంటూ
సాగనంపేరు సల్లంగ సూడమంటూ
సత్తు వాయనాల సందళ్ళతో......

అమాయకత్వపు నీడన మానవతాదరణ
అజ్ఞానపు దాపున సశాస్త్రీయతలు... కోకొల్లలు
ఆచారమైనా సనాతన సంప్రదాయమైనా
పూజా  పునస్కారాలైనా పుణ్యమైనా
శుచి  శుభ్రతలైనా తరచి గమనిస్తే
తిరిగి జీవకోటి  భద్రతకు సంక్షేమానికే మిత్రమా !

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

కాలేజీ రోజులు

నగునూరి రాజన్న
అంశం - కాలేజీ రోజులు
తేదీ - 27-09-2019
శీర్షిక - మా కాలేజీ రోజులు ....
సంఖ్య - 298

పూరి గుడిసెల బడి చదువులకు
పురము బోలు కళాశాల ప్రాంగణం
అబ్దురమై తోచు ప్రతి నూతన విద్యార్థికి
వరములివ్వ నిలిచిన వాణీ నిలయమై ....

అధ్యాపక విద్యార్థుల బంధాలు
అందమైన రంగు పూల కాగితాలు
గ్రంథాలయాలే జ్ఞాన భండాగారాలు
స్వంత పూచీ విద్యా స్వార్జితాలు
వింతగా ఎవరు బలవంతపెట్టరు....

జీవిత వరుస తెలియని వయస్సులు
యువతీ యువకుల ఆకర్షణలు
విరిసీ విరియని రంగుల గులాబీలు
కొన్ని ముడిపడి కొన్ని విడివడిన సందర్భాలు...

కాకతాళీయపు కవ్వింపుల పరిచయాలు
కబంధ హస్తాల కఠిన పరిస్థితులు
ఉద్యమ బాటల ఉలికి పాటులు
ఉట్టికెక్కిన చదువుల సంగతులు....

ఉక్కు  కులపతుల ఆగమనం
ఉద్యమ గతుల నిష్క్రమణం
కుదుటపడిన  చదువుల వైనం
మొత్తానికి గట్టెక్కిన డిగ్రీల కోణం....

కలలు గన్న ప్రతివారికిని
కళ్ళు జిగేలుమనే వెలుగుల కాంతులు
కమనీయ భావాల అనుభవాలు
కలకాలపు శోభనిచ్చు జీవన జ్ఞాపకాలు....


నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

అపురూపగీతం

నగునూరి రాజన్న
అంశం - అపురూపగీతం
తేదీ - 26-09-2019
శీర్షిక - అపురూప గీతాలు.. పవిత్ర యజ్ఞాలు
సంఖ్య - 297

అహింసాయుత స్వాతంత్య్ర సమరాన
అపర సమర శంఖారావమై నిలిచే కదా
వందేమాతరమంటూ జాతీయ గేయమైన
ఆనాటి బంకీమ్ చంద్రుని మనో కవనం .....

ఆసేతు హిమాచలాన్ని అనురక్తితో
అనుసంధానించి అక్షరీకరించిన
జనగణ మన  అధినాయక జయహే
విశ్వ కవి రవీంద్రుని విరచితము....

సాంప్రదాయపు ఒరవడిని దాటుకుని
సగటు మనిషి హృదయాన్ని చేరిన
సమకాలీనతల వ్యావహారిక భాషతో
కోటలు దాటిన గురజాడ గారి మాతృభాష పాటలు   ....

తెలుగువారందరిని ఒకటిగా నిలిపి
ఓలలాడించిన తేజపు గీతం
శంకరంబాడి సుందరాచారి గారి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ ....

మలిదశ తెలంగాణ ఉద్యమాన
మకుటాయమానమై శోభించె కదా ..
మరుపురాని అపురూప గీతమై
అందెశ్రీ అందించిన తెలంగాణా గీతం....

తనువు చీల్చి మనుఫు నిలిపిన
మాతృమూర్తిలా ప్రతి కవికి తన కవనం....
సంఘం మెచ్చిన పిల్లల ప్రయోజకత్వంలా
కాలమానపరిస్థితులకు కలిసి వచ్చే
ప్రతి గీతం ఒక  పవిత్ర యజ్ఞమే ...

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

నిర్వేదం

నగునూరి రాజన్న
అంశం - నిర్వేదం
తేదీ - 25-09-2019
శీర్షిక - క్రమశిక్షణ
సంఖ్య - 296

ఆశ మనిషికి గమ్యం ఏర్పరిస్తే 
ఆశయం గమనం నేర్పిస్తుంది 
అత్యాశ దురాశలే అతలాకుతలం చేస్తాయి 
నిరాశ నిస్పృహలకు మార్గమేర్పడుతుంది.... 

కాలంతో సమానంగా పోటీపడినా
కనికరించదు కొన్నిసార్లు 
ఆదరా బాదరా అందుకుంటానంటే 
అనుకున్నది జరగదు ఏ కోశానా ... 

పరిష్కరించలేని ప్రశ్నలైనా 
ప్రశాంతంగా కొంత యోచిస్తే 
పట్టు పడుతుంది ఖచ్చితంగా  
ప్రత్యమ్నాయాల పుష్కలాలు .... 

క్రమానుగత మేథోమథనం 
వైవిధ్యమైన వివేక వివేచనం 
ఆచరణాత్మక ప్రణాళిక రచనలు
ఆమోదయోగ్యమైన అమలు విధానాలు
నిలుపు కదా నిన్ను  ప్రత్యేకతగా .....

పట్టు వదలక పాకులాడే  నిష్ఠతో
క్రమశిక్షణ కలిగి నీవు కదిలితే
ప్రయత్నాన వచ్చే ఫలితం
అవుతుంది  నీకు సొంతం....
అధిగమించు నిర్వేదం......

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

భావప్రకటన

నగునూరి రాజన్న
అంశం - భావ ప్రకటన
తేదీ - 24-09-2019
శీర్షిక - అమ్మ భాష
సంఖ్య - 295

అమ్మ కడుపున పుట్టడమే అదృష్టం
అమ్మ భాష ఆత్మీయతల మూటగా
శిరోధార్యంగా నెత్తిన పెట్టుకుని ...
ముత్యమంటి తెలుగు పలుకులు ముదము గొల్ప
అక్షర జ్ఞానం నింపి నాకు
ముచ్చటించే వరమిచ్చిన తొలి గురువుగ
అమ్మ భాషనే అనుకరిస్తా !

అక్షర జ్ఞానంతో  కూర్చిన
పద సంపదకు అవసరం లేదేమో
రంగులద్ది సొబగులు దిద్దడం అదనంగా ...
ఆత్మీయతలు చాటి మానవీయతను
మేల్కొలిపి పరి జనుల మనుగడలలో
సుగంధాలు వెదజల్లితే చాలనుకుంటాను!

రంగు రంగుల పక్షులు
ముద్దులొలికే చిలక పలుకులులా
విచిత్ర భంగిమలతో దృష్టి మరల్చక
నలుపు పులుముకుని
కొమ్మల చాటున దాగిన
కోయిలమ్మ కులికే తీయని కంఠమోలె
మధుర సంభాషణ చాలనుకుంటాను !

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Saturday, September 21, 2019

మల్లె పందిరి


నగునూరి రాజన్న
అంశం - మల్లె పందిరి
తేదీ - 23-09-2019
శీర్షిక - మల్లె సుగంధం
సంఖ్య - 294

అందమైన ఇంద్రధనస్సుకు
సప్తవర్ణం నిండు శోభయినా
అందుకు మూలం
మల్లె పొదువు కున్న శ్వేతమే కదా !

మండుటెండల గ్రీష్మమేతెంచి
కాలం కనికరించకపోయినా
మలయ మారుతమై
మల్లె పందిరి సేద దీర్చి కరుణించు కదా  ! 

మనసు దోచుకునే సువాసనల
మల్లె పందిరి తావులు కూడా
అల్లుకునే తీగ మెలికలు
ఆత్మీయతలకు బాట చూపు!

పూవులన్నీ కలిసి ఉత్సవాల
ప్రాంగణ శోభను ఫరిఢవింప జేసినా
మూల విరాట్టును అలంకరింపజేయు
పుణ్య మూర్తుల మల్లె సుగంధాల ప్రాశస్త్యమే వేరు!

అరివీర భయంకర యుద్ధ నీతిన సైతం
మల్లె పోలిన శ్వేత వర్ణ ధ్వజంతో
మానవత వికసించి ఫరిఢవిల్లగా
శాంతి కాముకత దయమయిగా దారి చూపు!

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)


Friday, September 20, 2019

వెదురు

నగునూరి రాజన్న
అంశం -  వెదురు
తేది  - 21-09-2019
శీర్షిక - గడ్డి కుటుంబం
సంఖ్య - 293

గడ్డి కుటుంబమే అనుకుంటాం కానీ
గట్టి మేలు తలపెట్టే వెదురు సుమా !
నిట్టాడులా అన్ని అమర్చుకున్న కుందనం ...

పచ్చ కోక చుట్టుకున్న నిండు ముతైదువలా
పచ్చని అరణ్యాలకు అలంకారాలు
పర్యావరణానికి పెట్టని కోటలు...

శీతల వాతావరణాన  చిగురించినా
కొన్ని రకాలు గంటల్లోనే అడుగులు పెరిగి
ఆకాశ రాజుకు హారథులై నిలుచు...

కదిలిపోయే కరి మబ్బుల నిలిపే
వర్షపు ఛాయలకు నీలి జాడలు
పాడి పంటలకు పరోక్ష ఊతాలు ....

ఆధ్యాత్మికత  అందిపుచ్చుకున్న
నిండు శోభనిచ్చు పూల పండుగలో
గౌరీ దేవికి ఆసనమై నిలుచు శిబ్బిగా ....

జన జాతరను తలపించే
వనదేవత ఉత్సవం మేడారంలో
అమ్మ ప్రతిరూపం కుంకుమభరిణగా...

నాగరికత నడకలలో ప్రతి అడుగులో
కఱ్ఱ ఊతమై కల్పించు పనిముట్లు
గుజ్జు తయారీతో కాగితాలకు మూలం...

సరాగాలు వల్లించే సంగీత సాధనం
సుందరమై నిలుచే రమణీయ గానం
మాధవుని జాడల రాధమ్మ మనోవ్రతం....

అన్నార్తుల పాలిట అన్నపూర్ణ
ఆయుర్వేదపు ఆణిముత్యమైన వన మూలిక
అంతటా తానై నిలిచిన సర్వాంతర్యామి....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)


Wednesday, September 18, 2019

చీపురు

నగునూరి రాజన్న
అంశం - చీపురు
తేదీ - 19-09-2019
శీర్షిక - కొమ్మ పొరకల తయారీ  సాధనం
సంఖ్య - 292

చెట్టుకొమ్మ పొరకల తయారీ  సాధనం
చిన్న చిన్న పుల్లల సమిష్టి బంధనం
చిత్రంగా కలిసి చీపురుగా నిలిచె ....

స్థిరనివాసాలతో సాగిన సావాసం
నాగరికతతో బాటు నడయాడిన
పరిశుభ్రతల పరిరక్షణ సాక్ష్యం  ....

ఉదయతపూర్వమే మేలుకొలుపు
ఇల్లాలు చేతిలో ఆయుధమై కదులు
ఇంట్లో ఇంటిచుట్టు చుట్టబెట్టు...

పురపాలక బంట్రోతు పుణ్యాల
పురవీధులన్నీ శుభ్రపరచంగ
ఆనందాల ఆరోగ్యాలు ఒంటబట్టు...

స్వచ్ఛ భారతంటూ సవాలు విసిరినా
గాంధీగారి పిలుపు గతం నాటిదే కదా
శుచి శుభ్రతలకు నడుము కట్టె
అదే కదా అందరు కోరుకునేది....

అప్పుడప్పుడు సారాయి తమ్ముళ్లకు
అపురూపమైన సన్మానాల కొరకు
అవమాన పరచ తిరగేసి చూప
ఆడవారి చేతికందే వజ్రాయుధం ....

తరం మారి తరీక మారిపాయె
ప్లాస్టిక్కులు వచ్చి పరేషానే కదా!
పర్యావరణానికి చేటు కూర్చ ...
ప్రజలు హుషారై మేల్కొనాలి....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

కండువా 1 & 2

నగునూరి రాజన్న 
అంశం - కండువా
తేది - 19-09-2019
శీర్షిక -  ఉత్తరీయం
సంఖ్య- 291     

కండువా లేనిదే గడపైన దాటడు
ఎవడు వాడు..  ఇంకెవడు... తెలుగువాడంటూ
ప్రవచించారు ఒకనాడు మన విశ్వంభరుడు... సినారె గారు

వెనకటి తరాలకు అవసరమై నిలిచిన ఉత్తరీయం
వెన్నంటి కాచుకుంది పొందుగా ప్రతిక్షణం
తాతగారికెప్పుడు తలపైన ఠీవిగా ఉట్టిపడ్డ రాజసం...
నాన్నగారివరకేమో నాజూకై భుజముపై వాలె....

కష్టజీవికి తప్పనిసరైన నిత్య కిరీటం
కర్మయోగికి పట్టు కుదురు మధ్యమునకు దిట్టయై
విశ్రాంతి సమయాన విదుషీమణియై విరాజిల్లు ....

అన్ని వాతావరణాలల్లోన అనుకూలమై నిలుచు
శుచి శుభ్రతల కోరకు సైతం ఆదరిస్తుంటారు.....

పండగలకు పబ్బాలకు సంబరాలకు
ప్రత్యేకమైన జరీ అంచుల దర్పాలు చేర్చి     
రాజకీయాలకేమో రంగులు మార్చి
రక్తి కట్టిస్తుంటారు ఆయా సందర్భాలను.....

పండితుల ప్రముఖుల గౌరవ సన్మానాలకు
అతిథి దేవుళ్ళ మర్యాద మన్ననలకు
ఆచరింతురు అలంకరించి శోభాయమానంగా...

తరాలు మారగానే పరిమాణాలు మారి
జేబుల్లో దూర్చినా ... చేరి సేద దీర్చుచుండె...
పాశ్చాత్య పద్ధతిన వదిలించుకుని
పదే పదే కాగితాలను వాడేసి ... మళ్ళీ
పర్యావరణ కాలుష్యమంటూ ఊదరగొడ్తూ
ప్రపంచానికి  చాటింపులు వేస్తారు....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)


అంశం - కండువా
తేది - 19-09-2019
కండువా స్వగతం....

అత్యవసరాలలో  గుడ్డ ఆది ద్వితీయమైనా
అందునా నేను అత్యంత అవసరం సుమా !
రంగు రూపు రేఖలు హంగులెన్ని మార్చినా
పొందుగా ప్రతి క్షణం కాచుకొనే ఉంటా !

తాతల కాలాన నెత్తి నెక్కి కూర్చున్నా
తండ్రుల సమయానికి భుజాలపై వాలాను...
తదుపరేమో పరిమాణం తగ్గి పరిమితమయ్యాను
జేబుల్లో దూర్చినా...  చేరి సేద దీర్చుతున్నాను ....

రాజకీయాలలో నా రంగులు మార్చినా
సంబరాలకు నేనెప్పుడు సంకేతమౌతాను..
కర్మయోగికి విశ్రాంతినిచ్చే విదుషీమణిని
కష్ట జీవికి ఇష్టమైన నిత్య కిరీటాన్ని మిత్రమా !

అన్ని వాతావరణాలల్లోన ఆదుకుంటాను
ఆపద సంపదల్లోన అత్యవసరమౌతాను...
శుచి శుభ్రతల కోరకు అందరు నన్నాదరిస్తారు
ఆధ్యాత్మికం సాంప్రదాయం రెండు నాకిష్టం...

పాశ్చాత్య పద్ధతిన నన్ను వదిలించుకున్నా
పదే పదే కాగితాలను వాడేస్తారు... మళ్ళీ
పర్యావరణ కాలుష్యమంటూ ఊదరగొడ్తూ
ప్రపంచానికి  వెకిలి చాటింపులు వేస్తారు....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Tuesday, September 17, 2019

కాళేశ్వరం ప్రాజెక్టు 1 & 2

నగునూరి రాజన్న
అంశం - కాళేశ్వరం ప్రాజెక్టు
తేదీ 18-09-2019
శీర్షిక - దక్కనుకు పెద్ద దిక్కు
సంఖ్య - 290

కదిలి పోతున్న కన్న తల్లి గోదారమ్మను
కనికరించమని వేడుకుంటూ
కాళేశ్వరాన మేడిగడ్డ ప్రాంతాన
కట్టడి చేసిరి బంధమేసి నిలువరించి
అన్నారం సుందిల్లలకు సల్లంగ పంపించి
పంట పొలాలకు చిరునవ్వులు పంచుతూ
ఆపైన మెల్లంగ ఎల్లంపల్లికి చేర్చి
పారిశ్రామిక వాడలను పలుకరిస్తూ
నంది మేడారం రామడుగుల మీదుగా
మధ్య మానేరుకు మళ్లించి సేద దీర్చి
అనంతగిరిని ఆవరించి మల్లన్న సాగరు ద్వారా
జల జలా కొండ పోచమ్మకు అండగా నిలువుమనె
తెలంగాణా మాగాణుల బంగారం పండించ......

పాలకుల పట్టుదలకు ప్రతి రూపం
గొప్ప ఇంజనీరింగ్ అద్భుతానికి తార్కాణం
రెండు కళ్ళకు చాలనంత పెద్ద పెద్ద మోటార్లు
బారైనా కాలువలు బహు వింతైన టన్నెళ్లు
అహో రాత్రుల శ్రమ జీవుల రెక్కల కష్టం
విశ్వంలోనే వింతైన ఎత్తిపోతలు మిత్రమా...

కొలరాడో మ్యాన్ మేడ్ ల సరసన చేరి
ప్రపంచ ప్రఖ్యాతిని మూటగట్టుకున్నఅద్భుత ఆవిష్కారం
ధర్మపురి నుండి మేడిగడ్డ వరకు
జీవనదిగా చిత్రించిన సాక్షాత్కారం
తెలంగాణ రైతాంగానికి సస్యశ్యామల కారిణి
తాగునీరు సాగు నీరు పారిశ్రామికానికి .... మొత్తానికి
ప్రజలకు అంకితమిచ్చిన అరుదైన కట్టడం
దక్కనుకే పెద్ద దిక్కు నేస్తమా ....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)


నగునూరి రాజన్న
అంశం - కాళేశ్వరం ప్రాజెక్టు
తేదీ 18-09-2019
శీర్షిక - తెలంగాణ స్వప్నం....
సంఖ్య - 290

దక్కను పీఠభూమి మెట్ట ప్రాంతం
చిక్కని అడవులు మాయమైన వైనం
వలస నాయకుల సవతి  పాలనలు
వంత పాడిన వింత పోకడలు చూస్తూ ....

నీళ్లు నిధులు నియమాకాలంటూ
నిగ్గదీసిన జనావళికి  నిజమైన పండగే....
పల్లానికి ప్రవహించే నదీమతల్లిని
అన్నార్థులకందించ నిలువరించె...

విశ్వంలోనే వింతైన ఎత్తిపోతలు
కొలరాడో మ్యాన్ మేడ్ ల సరసన చేరే...
ప్రపంచ ప్రఖ్యాతిని మూటగట్టుకుని
ప్రజలను ఆదుకుని ఠీవిగా నిలబెట్ట.....

కదిలి పోతున్న కన్నతల్లి గోదావరమ్మను
కనికరించమని వేడుకుంటూ మేడిగడ్డలో నిలువరించి
అన్నారం సుందిళ్ల ఎల్లంపల్లిలకు పంపించి
నంది మేడారం  రామడుగు మీదుగా
మధ్య మానేరుకు మళ్లించి అనంతగిరిని ఆవరించి
మల్లన్నసాగర్ లో ఘల్లుమనిపించి
కొండపోచమ్మకు అండగా నిలుపమని వేడుకొనె....
తెలంగాణా మాగాణుల బంగారు పండించ....

రెండు కళ్ళు చాలావన్నంత పెద్ద పెద్ద మోటార్లు
బారైన కాలువలు వింతైన టన్నెళ్లు
బహు గొప్ప ఇంజనీరింగ్ మెళకువలు
బాటలు వేసె దక్కను పీఠభూమిని
పచ్చ తివాచీల సాక్షాత్కరింప ....


నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Monday, September 16, 2019

గూగుల్ గురువు

నగునూరి రాజన్న
అంశం - గూగుల్ గురువు
తేదీ - 17-09-2019
శీర్షిక - విశ్వ మానవాళిని ఆదరిస్తున్నవినయ శీలి....
సంఖ్య -   289                                   

సద్భావమైనా సంప్రదాయమైనా
సమస్త మానవాళికి ప్రథమ గురువు అమ్మ
తదుపరే నాన్న ఆపైన గురువు ....

మార్గదర్శనం మృగ్యమైన పయనం
మంచు పొగన పోలిన గమనం
ఆసక్తి కలిగిన రంగం ఆనవాలు పసిగట్టి
అనుపానులు తెలిపి గమ్యం చేర్చు గురువు ...

సాంకేతికత సమృద్ధతతో
అందరికి గురువై ఆదరింపబడె
అపారమైన సమాచార ప్రోదితో
ఆ గూగులమ్మ విశ్వ మానవాళికి.....

అరచేతిన ఇమిడిన అనంతం
మానవ మేధ కనిపెట్టిన అద్భుతం
అంతర్జాలంతో అంతా అనుసంధానం
చదువుకైనా సాధనకైనా శోధనకైనా.....

అందుగలదు ఇందు లేదను
సందేహం వలదు... దేనికొరకైనా
ఒక్క క్లిక్ తో లెక్క సరి....
విశ్వ సందు బొందులు మూలలు
ఎందెందు వెదికిన అందందే దొరక బుచ్చును ....

గురువుల మించిన గురువై ఎదిగే...
పర తమ లింగ  ప్రాంత బేధమెరుగదు
లంచగొండి అసలు కానే  కాదు
విలువ తెలిసి మసులుకునే
విశ్వ మానవాళిని ఆదరిస్తున్నవినయ శీలి....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)



మరీచిక

నగునూరి రాజన్న
అంశం - మరీచిక 
తేదీ - 16-09-2019
శీర్షిక - మానవత్వం ?
సంఖ్య - 289      

ఎంత సేపు పరుగే లక్ష్యం 
స్వంత నియంత్రణ లోపం
అగమ్యమౌతున్న సహనం  
అనుపానులకు అదే ఊతం

ఆశ మనిషికి గమ్యం ఏర్పరిస్తే 
ఆశ్రయించడం అనుకూల స్వప్నం 
అకుంఠిత దీక్ష పట్టుదలే సాధనం 
అనుసరించాలి గురు గమనం....  

అత్యాశ ఎప్పుడు నిరాశలకు పథం
అడ్డ దిడ్డాలను ఆశ్రయింప చేస్తుంది 
అడుగులు తప్పటడుగులై  
అవుతుంది ఇక పతన మార్గం 

పచ్చని ఆత్మీయతలు పరుచుకున్న 
పండంటి  కుటుంబ బంధాలలో 
పచ్చనోట్ల చిచ్చులు నివురుగప్పిన నిప్పువలె 
దాగుడుమూతల దోబూచులాడుచున్నాయి.... 

అపురూప అనుబంధాల లోగిళ్ళలో  
ఆస్తులు అంతస్తులు అశనిపాతమై
స్వార్థ శక్తుల సంకుచితాలలో 
సర్వ ప్రణాళికలు సతమతమౌతున్నాయి  

మనిషి నీడే మనిషిని కాటేస్తూ 
మనీ తప్ప మరేమీ లేదన్నట్టుగా 
మానవత్వాలనే మంటగలుపుతూ 
మరీచికలై దాగుడుమూతలాడుతున్నాయి!

నగునూరి రాజన్న 

పర్యావరణం పరిరక్షణ

పర్యావరణం  పరిరక్షణ
సంఖ్య - 02 
శీర్షిక -  చేయూత 
నగునూరి రాజన్న 

హొయలొలికే జలపాతాలు 
హాయి గొలిపే  పచ్చికబయళ్ళు 
అవనికే అందాలు కూర్చి పేర్చిన 
మందారాల పర్వత మాలలు...ఒకనాటి మాట  

పట్టినా ముట్టినా  పంచభూతాలను
పవిత్రంగ పబ్బతి పట్టేది ప్రజలు నాడు ... 

పచ్చ పచ్చని వనదేవతల కాంతితో 
మరకతంలా మెరిసిన భూమాతను
ధాతువులంటూ మణులు మాణిక్యాలు
గాసంటూ గనులంటూ గర్భమంతా కెలికి..

కంకర గ్రానైట్ ల కొరకు కొండలను పిండిచేస్తూ  
ఇసుక కూడ వదలక వలువలూడ్చిన చందంగ 
రంగు రూపం మార్చి పిండి పిప్పి చేసి కురూపిణిగా
ఎఱ్ఱని కెంపు వర్ణానికి మార్చిన విషయం దాగేదా...  

ఇక పరిచయం అక్కరలేని పదార్థంగా  చేరి 
అది ఇది అనే తేడా లేకుండా అన్నింటా వామనుడై   
పచ్చని సంసారంలో నిప్పులు కుమ్మరిస్తుంది... 
భూమిని నీటిని ఆక్రమించి ఉభయచరమై
మానవాళి ఉనికికే మచ్చగా నిలిచింది....ప్లాస్టిక్ 

మాట సాయాలు కట్టిపెట్టి చేత సాయమందిస్తూ 
నీటి గుంతలతో మొదలెట్టి నియంత్రణలు పాటిస్తూ 
పసి మొలకలను నాటించి పచ్చ వనాలను పెంచేసి 
ముందు తరాలకు అందిద్దాం ముదముగొలుపు పర్యావరణం... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

పర్యావరణం - పారా హుషార్ !

నగునూరి రాజన్న
అంశం - పర్యావరణం
తేదీ 16-09-2019
శీర్షిక - పారా హుషార్ !
సంఖ్య - 2

చల్లని మనసు మెండుగ కలిగి
పిండి వెన్నెలలను పంచుతున్న
వెండి జలతారుల నిండు చంద్రమా !

విజ్ఞానం వికాసమంటూ అడుగిడి
విహారం వినోదమంటూ మొదలెట్టి
నివురుగప్పిన నిప్పులా ముప్పు పొంచి 
వీటన్నిటిని మింగేయగల  కొందరి
స్వార్థముంటుంది పారా హుషార్ !

పచ్చ పచ్చని వనదేవతల కాంతితో
మరకతంలా మెరిసిన భూమాతను
ధాతువులంటూ మణులు మాణిక్యాలు
గాసంటూ గనులంటూ గర్భమంతా కెలికి..

కంకర గ్రానైట్ ల కొరకు కొండలను పిండి.. 
ఇసుక కూడ వదలక వలువలూడ్చిన చందంగ 
రంగు మార్చి రూపం మార్చి కురూపిణి చేసి
ఎఱ్ఱని కెంపు వర్ణానికి మార్చిన విషయం
మేనమామవైన నీకు చెప్పక్కర లేదు....

ఒకప్పుడు నిత్య మణితో తృప్తి చెందినా
అన్నీ కావాలనే స్వార్థ చింతన లాగా 
తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటూ
డార్విన్ సిద్ధాంతానికి వారసత్వపు హక్కు భుక్తాలను 
పునరుద్ఘాటిస్తున్నాడు .....   
 
నగునూరి రాజన్న

Friday, September 13, 2019

జాతీయభాష 2019

నగునూరి రాజన్న
అంశం - జాతీయభాష
తేదీ - 14-09-2019 
శీర్షిక - అంత : సూత్రం
సంఖ్య - 288

జనులను జాగృత పరుచ
జాతికి జవసత్వాలు నింప
జాతీయ భాష కీలకము గాదె
జగతిన మనను ఒకటిగ నిలుప....

ముచ్చట గొలుపు మన దేశాన
మూడు వేల నాలుగు వందల
ముద్దు భాషలు కలిగె మాటాడ
ముదము తీర్చు జాతీయ భాష  
భిన్నత్వంలో ఏకత్వమై నిలుప.....

రంగులద్దుకున్న దండలోని పూవులోలె
ఇరువది నాలుగు  అధికార భాషలున్నా
అంత:సూత్రమైన దారమోలే జాతీయ భాష
అందరిని కలిపి నిలుపు సమ భావన వేదికయై ...

కేంద్ర రాష్ట్ర సంబంధ సమన్వయాలకు
జాతి సతమతాల తిలోదకాలకు
ప్రాంత భేదాల సమస్యా పరిష్కారాలకు
సర్వ నివారిణి యోగ సమాధానంలా ...

రాజ్యాంగపు రాచ బిడ్డయై
రంజిల్లుచుండె హిందీ మన
రాజభాషయై పదునాలుగు
సెప్టెంబర్ పర్వదినం జరుపుకుంటూ ...
పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

Thursday, September 12, 2019

అదృష్టం


నగునూరి రాజన్న
అంశం -  అదృష్టం
తేదీ - 13-09-2019
శీర్షిక - సమయ సమర్థత ...
సంఖ్య - 287

సమర్థ సమయ వినియోగం
సామర్థ్యాన్ని సానబెట్టుకోవడం
అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడం
అందిపుచ్చుకోవడమే అదృష్టం.....

మొక్కజొన్న పొత్తుల్లా కొంతమంది
అన్నీ అమరినట్టుండి ఎండా వాన
కష్టమెరుగక నీరు పట్టి నిగ నిగలాడుతూ
సంతోషాలను మాత్రమే ఆస్వాదిస్తుంటారు....

కొంతమందికి స్వంత పనులు కూడా
పక్కవారు చేస్తుంటే లాహిరి లాహిరి
కోయిలమ్మ  కమ్మని కూజితాలవలె
రాగాలాపనలకే సరిపోతుంది.....

అధికారం అందలాలనిస్తుంది
పేర్లు మారినా వరాలు మారలేదు
పెట్టి పుట్టింది పాలన  నాయకగణం
అటు ఇటుగానైనా అదృష్టమే వారి స్వంతం....

తాత ముత్తాతల తరం వల్లనో
తరగని ఆస్తుల నీడల వల్లనో
వారసత్వంగానో  కొంతమందికి
వద్దన్నా ఎదురొస్తుంది... అదృష్టం అన్నింటా

అందరిని ఆ గాట కట్టలేం ....
అలా అని విడిచి పెట్టలేం ....
అందరికి అదే సూత్రమనుకుంటే
అంధకారమే ఎదురౌతుంది...

మార్పును ఒంట బట్టించుకుని
అభిప్రాయాలను సవరించుకుంటూ
నిన్నటి కంటే నేడు... ఇంకా రేపు ..
వివేక ప్రదర్శన చేసుకుంటే.....చిక్కును తథ్యం...

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

కాలరీస్ కార్మికులం

      కాలరీస్  కార్మికులం

కాలరీస్ కార్మికులం కష్టజీవులం నమ్మండి
భూమి పొరల్లోన  బతుకులీడుస్తుంటాము  ...
రోజుకో తడవ మాకు పునర్జన్మ మిత్రమా
భూదేవి ఒడిలోకి వెళ్లి వస్తూంటాము  .....

మేనేజర్లు  అండర్ మేనేజర్లు ఓవర్ మెన్లు
మైనింగ్ సర్దార్లు మా పనులకు సూపర్ వైజర్లు...
సర్వేయర్ల ప్రణాళికలతో మేనేజర్లు వివరించంగ
సీములన్నీ దాటుకుంటూ పనిస్థలం చేరుకుంటం...

కోల్ కట్టర్లు డ్రిల్లింగులు చేయంగ
షాట్ ఫైరర్లు మందు నింపి పేల్చగ
సర్దారులు ముందుండి నడిపించగ
ఓవర్ మెన్లు మమ్ము  కనిపెడుతూంటారు .....

కూలిన కోల్ పెల్లలను తట్టలతో తలకెత్తుకుని
లాడీస్ లను నింపేది కోల్ ఫిల్లర్ సోదరుడు !
బావిలోన నీటిని ప్రతి క్షణం పంపింగ్ చేస్తూ
పని స్థలాలను పరి రక్షించేది పంప్ డ్రైవర్లు నేస్తమా !

ఎప్పటికప్పుడు కొత్త లైన్లు వేస్తూ
లాడీస్ ల కదలికలను నియంత్రించేది లైన్ మెన్లు!
లారీలతో  కోల్ తరలింపులకు లారీ  డ్రైవర్లు
సంక్షేమం బాగోగులకు కాంటీన్ స్టాఫ్ సరే సరి .....

రూఫులన్నీ సరిచేస్తూ రూటు మాకు చూపే
టింబర్మెన్ కూడా మెంబరే  మా టీమ్ లోన...
భారమైన సామాన్లను బాధ్యతతో మోసుకొచ్చి
బావిలోన ప్రతి పనికి బాటలు వేసేది టిండాలు సోదరుడు...

లాడీసులను లాగించేది ట్రామార్ సోదరులైతే
ఆక్షీజన్ అందించేది ఫాను డ్రైవరు మిత్రమా....
నైపుణ్యపు పనులకై ఎలక్ట్రీషియన్ ఫిట్టర్
బ్లాక్ స్మిత్ కార్పెంటర్  సదా మాకు సహకరిస్తుంటారు  ...

ప్రతి క్యాటగిరీలోని ఖాళీలను పలుకరిస్తూ
పనుల్లో లీనమయ్యేది జనరల్ మజ్దూర్లు సోదరా...
కష్టాల కడలిలో కలుషిత వాతావరణంలో
దుమ్ము ధూళితో పోరాడుతూ జాతి వెలుగుల కోసం
కదం కలిపి నడుస్తున్నం ....

ఖమ్మంలో హెడ్డాఫీసు ధన్బాద్ నియంత్రణలు 
రక్షణకు రాచ మార్గాలు సదా మాకు ఏర్పరచగా...

నగునూరి రాజన్న