Friday, July 26, 2024

చాక్లెట్ తేది : 25-02024 శీర్షిక : విష కన్య

 చాక్లెట్ 

తేది : 25-02024
శీర్షిక :  విష కన్య 

గోముఖ వ్యాఘ్రంలా 
ముఖం చూస్తే ముద్దాడబుద్ది 
దాని గుణం చూస్తే దుర్భాషలాడబుద్ది 
ఏమని చెప్పను ఎంతని చెప్పను.... 

పడమటింటి గాలి తోనే 
పరిచయమయ్యాయి ...చాకోలెట్లు
కేకులు  బ్రెడ్  పిజ్జాలు బర్గర్లు 
ఆరోగ్యాలను హరించే విషపూరితాలు ... 

పల్లెల్లో గోడకు రేవ పూసినట్టు 
పళ్లకు పాచి పట్టినట్టు 
పుచ్చు పుల్లకు పునాది రాయి 
జివ్వులాటకు తొవ్వలేసేది .... 

తాజా స్వీట్లు తవ్వెడు తిన్నా 
రాని తిప్పలు నిలువుంచే వీటితో 
నిలువునా ముంచే అనారోగ్యాలు 
అయినా మారని జనాలు .... 

పాము కుడితే పది నిమిషాలన్నా 
తయారున్న లోకం .... బద్దకాలు 
పలకరిస్తుంటే ... సిద్దాలకు ఎగబడుతూ  
వద్దన్నా పోలో మంటూ లాగిస్తున్నారు.... 

ముద్దొచ్చే విషపు కన్యలా 
హద్దులెరుగని ఆనందాలకు 
వద్దన్నా జనం చేరదీస్తుంటే 
సుద్దులెవరికి ... ప్రభుత్వాలకా 
ప్రజలకా ? 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment