నీవు లేని నేను
తేది : 11-07-2024
శీర్షిక : నీడలేని వస్తువు ....
సహస్రాధికం ....
చీకటి వెలుగుల దాగుడుమూతల్లా
ఒకరికొకరన్న ఓర్పుల పర్వం ....
నాకు నువ్వు ... నీకు నేనంటూ
తేనెజల్లుల మకరందములా ...
తీగలలో ఒకరికొకరై అల్లుకున్నా
పూలల్లో ఒకరికొకరై విచ్చుకున్నా ...
పూర్ణత్వం సంతరించుకునేది
మాత్రం ఒకరికొకరైనప్పుడే .....
పిల్లతెమ్మెరలో పరిమళాలైనా
గండుతుమ్మెదకు మధువులైనా ....
నిండుదనం సంక్రమించేది
మాత్రం ఒకరికొకరైనప్పుడే ....
ఋతువులలో వసంతమైనా
వానలలో మెరుపుతీగలైనా ....
బంధంలో భారతీయంలా
ఒకరికొకరైనప్పుడే సుమా ....
ఆకుమీద వాన చినుకు
మంచి ముత్యమై మెరుస్తుంటే ....
ఆకందమా ... చినుకందామా
అంటే రెంటి కలయికనే సమాధానం ....
భర్త లేక భార్య ... భార్య లేక భర్త
నీడలేని వస్తువులా నిరుపయోగమే .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment