దిండు
తేది : 06-06-2024
రాజసాలకు రమ్యమైనది
నిద్రలకే కాదు సుమా ...
ఠీవి దర్పం వెలగబెట్టే
గొప్పల కుప్ప ....
నిజమైన ఆకలికి రుచి ఉండదు
మెండైన నిద్ర సుఖమెరుగదు
దూదితో నిండిన దిండైనా
పాతగుడ్డల పొత్తిలి అయినా సరే ...
ఆరోగ్యాల ముల్లె మూటయినా
అనారోగ్యాలకు చెల్లు చీటీ యైనా...
కొన్నిసార్లు అనారోగ్యాలకు మూలమై
వైద్య సలహాలకు వంత పాడమంటుంది ..
పేదోడికి మడిచిన చెయ్యి
మల్లెలు నింపిన దిండవును ...
పచ్చలు పొదిగిన అవని మాత
ఒడినే అమ్మ ఒడిలా పరుపగును....
పరిశుభ్రమైన ప్రకృతి కన్నా
కమ్మని అమ్మ ఒడి
ఉన్నదా ....
కార్మికులు కర్షకులు అనుభవించే
నిత్య పవిత్రమైన అవనిమాతా ఒడిలా ...
ప్రాంతాలవారిగా పరి పరి
నామములతో పలకరించినా ....
దిలాసాలు కుమ్మరించే దిండైనా
కులాసాలు అందించే మెత్తైనా
స్వప్నాలను ఆహ్వానించే గలీబైనా ....
అన్నీ ఒకటే దారి....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment