THIS IS THE NTPC LTD
పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరాన -
నవంబరేడవ తేదీన -ఉధ్బవించిన ఎన్ టి పి సి
50000 మేఘా వాట్ల ఉత్పత్తులతో -
నలుబది ఒక్కేళ్ల మహోత్సవం జరుపుకుంటున్నది
భారతాన ఆనాడు వెలుగుల సంస్థగా వచ్చినది
వేల మంది ఉద్యోగులతో, మేఘా వాట్ల ఉత్పత్తులతో
దశ దిశల దేశాన జాబిలి వెలుగులు నింపినది
విఫణి వీధిలో మహారత్నమై కలికి తురాయిగ నిలిచినది
పరిశుభ్ర తలను ఆచరిస్తూ, పర్యావరణం పదిలపరుస్తూ
స్పష్టమైన దృక్పథంతో, సుసాధ్యమైన లక్ష్యాలతో
నవ్య సాంకేతికతను స్వాగతిస్తూ, నాణ్యత కేమో పట్టం కట్టినది
మౌలిక విలువలు పాటిస్తూ మానవతను చాటుచున్నది
థర్మల్ పవరుతో మొదలెట్టినా -
హైడల్ పవరును అక్కున చేర్చుకుని
గాలి మరలు మొదలుకుని, సోలారును అందుకుని -
ఆటమిక్ లో సైతం అడుగిడినది
ముందు వెనుక నేనేనంటూ -
కోల్ వాషరీస్ , ఫ్లై యాష్ లలోనే కాకుండా
రైల్వే లతో పొత్తు కుదుర్చుకుని -పవర్ సేలు ,
సలహాల సర్వీసులలో సై అంటున్నది
సంఘ హితం సదా కోరే సంస్థగా -
సడక్ లు, పల్లె చదువుల్లో ప్రశిక్షణలే కాకుండా
స్వచ్ఛ భారత్ కార్యక్రమాలలో సైతం -
సంఘీ భావంతో పాలు పంచుకున్నది
విఫణిలో సంస్థలన్నీ కుదేలయ్యి రోదిస్తున్న సమయము లో
తబ్బిబ్బులకు తావివ్వకుండా తమాయించుకుని నిలిచినది
ఆర్ధిక మాంద్యములోను అతలాకుతలం కాకుండా
కొండంత అండనిచ్చి నిలిచినది మనకు, మన వాటా దారులకు
పంట పొలాలకు, పరిశ్రమల అవసరాలకు-
ప్రతి క్షణం అండ దండగా నిలుస్తున్నది
నాటి నిపుణుల స్వప్న సాకారంగా -
సంస్థ సారూప్యత చెంది నిలిచినా
నేడు, మేటి నిపుణుల సమాహారమై -
ప్రగతి మార్గమున పయనిస్తున్నది
పట్టాలు పుచుకుని పరుగున వచ్చిన మనకు -
పదే పదే ప్రశిక్షణలిచ్చి - పరిణతి నింపి నిలిపినది అమ్మలా
కన్న తల్లి తండ్రులను - కట్టుకున్న ఇల్లాలును -
కని పెంచిన పిల్లలను - సదా కని పెట్టుకుని ఉన్నది
అత్యవసరాలకు ఆదుకుని - అవసరాలన్నీ తీర్చినది
చదువులిచ్చి పిల్లలకు - సంస్కారములు నేర్పింది
పండగలకు, ఫర్నీచర్లకు - వాహనాలకు , ఇళ్లకు ,
కంప్యూటర్లకు బహు చక్కగా అడ్వాన్సులు ఇచ్చి -
బ్రతుకంతా బాధ లేకుండా ఓ ఇంటి వాన్ని చేసింది
గేటెడ్ కమ్యూనిటీలో - సెక్యూర్డ్ జీవితాలనిచ్చి
సంఘములో స్టేటసిచ్చి – సంతృప్తిని ఇచ్చింది
సాదాగా వచ్చిన మనందరిని - సంపూర్ణముగా తీర్చి దిద్దినది
అంతరాత్మను సృశించి - అంతర్ముఖుడవై గమనించు మిత్రమా
అవార్డులెన్నో గెలిచినది , రివార్డులెన్నో తెచ్చినది
రికార్డులెన్నో అధిగమిస్తూ జాతి కీర్తిని ఇనుమడిస్తూ
విశ్వ వేదికలలో, వినీలాకాశంలో తారగ నిలిచినది
కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజము మాదిరి -కర్మాగారమై వెలిసినా,
మనందరికీ మాతృ మూర్తి సమానమైన-పవిత్ర దేవాలయం మిత్రమా…