యోగ - యోగం
21-06-2024
శీర్షిక : జీవితావిష్కరణ ...
ప్రకృతిలోని పశు పక్ష్యాదులకు
అవసరంలేని మందులు
మాకులు మనకు మాత్రమే
ఎందుకో ... ఏలనో ....
ఉరుకులు పరుగులమీద
సైరన్లతో 108 వాహనాలు ...
స్వాధీనం తప్పే గుండెపోట్లు
సంధి కొట్టే చక్కర నిల్వలు ...
అవసరమా ?
మైళ్ళ కొద్దీ నడకలు
గుప్పెడు గుప్పెడు గోళీలు
అక్కరలేని ఆరోగ్య రహస్యం
మనసు తనువు సంలీనం ....
సమయమంతా సంధానమే
నావాళ్లంటూ ... రోజుకోగంట
రోగనిరోధం కొరకు కేటాయించు ..
మరమ్మతుల మర్మమెరుగని నివారణ ...
కార్పొరేట్ల కబంధ హస్తాల
ఉక్కు సంకెళ్లను తుత్తునియలు
చేయి ... జిమ్ములకై సొమ్ములు
వెచ్చించకు ...
అంగాంగం అవసరమైంత
మెలిపెట్టు ... గురుసమక్షంలో
గురి కుదిరిందా ... జీవితాన్ని
బహుగొప్పగా ఆవిష్కరించుకునే యోగం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment