Thursday, July 25, 2024

కలం గళం: లలిత గేయాలు తేది : 18-05-2024 శీర్షిక : అందమైన విరితోట

 కలం గళం: లలిత గేయాలు 

తేది : 18-05-2024
శీర్షిక : అందమైన విరితోట  

అందమైన  సుందరమే  
విరితోటల  ఆనందం 
నందనాలు పంచుకుని 
మురిసెదమా  ఓ  చెలీ  ... 

మరువం దమనం 
మనసారా  విచ్చుకునె  
వరసైన బావ నీకు 
సిగలోన  ముడుచునంట
గుభాళించె పరిమళాలు 
గుండెలోన గుబులు రేపు .... 

అందమైన  సుందరమే  
విరితోటల  ఆనందం 

ముద్దబంతి చామంతులు 
ముసిముసిగా నవ్వుచుండె 
మత్తేదో ఆవరించగ
మైమరిపించి మురియుచుండె 
మామ కూతురా నీవొస్తే 
మతలబేందో తెలియవచ్చు .... 

అందమైన  సుందరమే  
విరితోటల  ఆనందం 

గుండుమల్లె గుత్తులేమో 
గుసగుసలు చెప్పుచుండె 
విడివడక  తుమ్మెదలు 
గుచ్చి గుచ్చి అడుగుచుండె 
తపనలతో తడబడగా 
పెదవులపై తడి ఆరె 

అందమైన  సుందరమే  
విరితోటల  ఆనందం 
నందనాలు పంచుకుని 
మురిసెదమా  ఓ  చెలీ  ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment