నాయకత్వ లక్షణాలు
తేది : 30-05-2024
శీర్షిక : అత్యుత్తమ లక్షణాలు
పలకరింపులో ప్రాణమై
మాటలలోనే గాయాలకు
మలాము పూయగలిగి
మంత్రించే దండమవ్వాలి ....
నలుగురిని కలుపుకుని
నమ్రతగా నడుచుకుంటే ....
స్వార్థానికి తోలోదకాలిచ్చి
పరోపకారానికి తెర తీస్తే ....
తమ పర భేదమెరుగని
తప్పుల గుర్తింపులతో ...
న్యాయాన్యాయాల నిలదీతలకు
నిఖారసుగా నిలబడడం ....
పటాటోపాలకు పదామడగా
ఆడంబరాలను అంటించుకోక
పదిమందిలో తానొకడిగా
ఉదాహరింప ఊతమవ్వాలి ...
అపాయాలను ఆదిలోనే
పసికట్టి ఆటకట్టించగలగడం ...
వైవిధ్యమైన పనివిధానంతో
సమస్యలను అరికట్టడం ....
ప్రశంసలకు దూరంగా
కీర్తి కాంక్షలు లేకుండా
తనవల్ల పరిష్కరించినా
సామూహికానికి గంట కట్టడం ...
కుటుంబానికి దూరంగా
అందరు నావారనుకోగలగడం ....
బంధుప్రీతి పాటించక
అడ్డదారులు తొక్కకుండడం ....
యుగాలైనా జగాన తేజమై
కీర్తింపబడుతున్న గొప్ప
గొప్పోళ్ళంతా పాటించిన
ప్రాథమిక సూత్రాలతో .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment